ETV Bharat / entertainment

'జై హనుమాన్'​ కంటే ముందే ఆ చిత్రాన్ని విడుదల చేస్తాం : ప్రశాంత్ వర్మ - Prasanth Varma Jai Hanuman Movie

Prasanth Varma About PVCU : టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా తన అప్​కమింగ్ మూవీస్ గురించి ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. అలాగే ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ (PVCU) గురించి కూడా ఆయన పంచుకున్నారు. ఆ వివరాలు మీ కోసం.

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2024, 8:35 AM IST

Updated : Sep 11, 2024, 9:11 AM IST

PRASANTH VARMA JAI HANUMAN MOVIE
Prasanth Varma (ETV Bharat)

Prasanth Varma About PVCU : 'హనుమాన్‌'తో బ్లాక్‌బస్టర్‌ హిట్​ను సాధించిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఆ మూవీ సీక్వెల్​ను తెరకెక్కించే పనుల్లో ఉన్నారు. అయితే తాజాగా ఆయన లైనప్​లో ఉన్న మరిన్ని సినిమాల గురించి ఓ ఆంగ్ల మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇందులో భాగంగా 'జై హనుమాన్‌' రిలీజ్ డేట్​, అలాగే ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ (PVCU) గురించి కూడా ఆయన మాట్లాడారు.

"PVCU కోసం నేను కొంతమంది బాలీవుడ్‌ స్టార్స్‌ను సంప్రదించాను. వారందరితో నా ఐడియాలను షేర్ చేసుకున్నాను. వారు ఈ యూనివర్స్​లో కచ్చితంగా భాగమవుతారు. అయితే దానికి కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే ఈ సినిమాటిక్‌ యూనివర్స్‌ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఇక 'జై హనుమాన్‌' సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 'హనుమాన్‌' రూ.100 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసుంటే మేము ఆ మూవీ సీక్వెల్‌ను ఎప్పుడో విడుదల చేసేవాళ్లం. కానీ ఆ చిత్రం మా అంచనాలకు మించి కలెక్షన్లు సాధించింది. అందుకే మా బాధ్యత కూడా మరింత పెరిగింది" అని తన అప్​కమింగ్ సీక్వెల్​ మూవీ గురించి ప్రశాంత్ చెప్పుకొచ్చారు.

జై హనుమాన్‌కు ముందే మరో చిత్రం
ఇక ఇదే వేదికగా తన లైనప్​ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా కంటే ముందు 'అధీరా' అనే మరో సినిమాను రిలీజ్ చేయనున్నారని అన్నారు. దీంతో పాటు మరో రెండు సినిమాలకు కూడా పనిచేస్తున్నామని తెలిపారు.

"జై హనుమాన్‌ కోసం ఎంతోమంది కష్టపడుతున్నారు. స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా వేగంగా జరుగుతోంది. మీ అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉంటుంది. స్క్రీన్‌పై అభిమానులు ఏ అంశాలనైతే చూడాలనుకుంటున్నారో వాటిని మేము కచ్చితంగా చూపిస్తాం. ఇక ఈ సినిమాలో మెరిసే నటీనటుల ఎంపిక కూడా దాదాపు పూర్తయింది. 'హనుమాన్‌' టైమ్​లోనే మొదట షూటింగ్‌ చేసి తర్వాత మా టీమ్​ వీఎఫ్‌ఎక్స్‌ పనులు ప్రారంభించింది. కానీ, దీని సీక్వెల్‌కు మాత్రం వీఎఫ్‌ఎక్స్‌ పనులను ముందుగానే సిద్ధం చేస్తున్నాం. అందుకే పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు ఎక్కువ సమయం పట్టవు. షూటింగ్‌ కూడా ఇంకా ప్రారంభం కాలేదు అయితే 'జై హనుమాన్​'కంటే ముందు 'అధీరా' అనే మూవీ రానుంది. ఈ రెండింటితో పాటు మరో రెండు సినిమాలకు కూడా మేము పనిచేస్తున్నాం. ఇతర డైరెక్టర్లు కూడా వీటి కోసం వర్క్‌ చేస్తున్నారు. ఈ నెలలోనే ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభించే అవకాశముంది. ప్రతి ఏడాది కనీసం ఒకటి లేదా రెండు సినిమాలు విడుదల చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం" అని అన్నారు.

PVCUలోకి బాలయ్య వారసుడు- కిర్రాక్​గా మోక్షు ఫస్ట్ లుక్ - Mokshagna Teja Debut Movie

మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ సినిమా - మొదటి అడుగు​ పడింది అక్కడే! - Mokshagna Prasanth Varma

Last Updated : Sep 11, 2024, 9:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.