Prabhudeva Ex Wife : ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా మాజీ రామలత తమ విడాకులపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2011లో ప్రభుదేవా- రామలత వివాహ బంధానికి ముగింపు పలికారు. అప్పట్నుంచి ఈ ఇద్దరు ఎప్పుడూ కూడా బహిరంగంగా ఒకరి గురించి మరొకరు, విడాకుల గురించిగాని మాట్లాడుకోలేదు. అయితే 14 సంవత్సరాల తర్వాత తొలిసారి తమ విడాకులపై రామలత స్పందించారు. ప్రభుదేవా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇంతకీ ఆమె ఏం అన్నారంటే?
రామలత రీసెంట్గా ఓ తమిళ్ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో తమ కుమారుడు రిషిదేవా అరంగేట్రం గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆమె ప్రభుదేవా గురించి చెప్పారు. తమ కుమారుడు తండ్రితో కలిసి ఒకే స్టేజ్‌పై డ్యాన్స్ చేయడం గర్వకారణం అని అన్నారు. అలాగే ప్రభుదేవా ఓ గొప్ప తండ్రి అని, ఆయనకు పిల్లలతో మంచి బాండింగ్ ఉందని అన్నారు.
'పిల్లలే ఆయన జీవితం. వాళ్లతో తనకు మంచి అనుబంధం ఉంది. పిల్లల పట్ల బాధ్యతతో ఉంటారు. వాళ్లకోసం ఆయన ఏదైనా చేస్తారు. పిల్లలు కూడా తండ్రితో చాలా మాట్లాడుతారు. వాళ్ల విషయంలో మేం ఇద్దరం కలిసే నిర్ణయాలు తీసుకుంటాం' అని పేర్కొన్నారు.
ఇక తమ విడాకుల గురించి కూడా రామలత మాట్లాడారు. డివోర్స్ తర్వాత ప్రభు దేవా తన గురించి చెడుగా చెప్పలేదని అన్నారు. 'విడాకుల తర్వాత ఆయన నా గురించి ఏదైనా చెడుగా చెప్పి ఉంటే, నేను కోపం పెంచుకునేదాన్ని. కానీ, ప్రభుదేవా డివోర్స్ తర్వాత ఎప్పుడు కూడా నా గురించి చెడుగా మాట్లాడలేదు. అందుకే అలాంటి వ్యక్తి గురించి నేను కూడా తప్పుగా మాట్లాడను' అని రామలత చెప్పారు.
కాగా, 1995లో ప్రభు దేవా- రామలత పెళ్లి జరిగింది. వీళ్లకు ముగ్గురు పిల్లలు. అయితే 2008లో పెద్ద కుమారుడు విశాల్ క్యాన్సర్‌తో మరణించాడు. ఈ జంట 2011లో డివోర్స్ తీసుకుంది. ఇక 2023లో ఫిజియోథెరపిస్ట్ హిమానీని ప్రభుదేవా వివాహం చేసుకున్నాడు. వీళ్లకు ఓ పాప ఉంది.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు ప్రభుదేవా - అభిమానుల తాకిడి