ETV Bharat / entertainment

'స్పిరిట్' హీరోయిన్ కన్ఫార్మ్- డార్లింగ్​కు జోడీగా బాలీవుడ్ బ్యాటీ - SPIRIT MOVIE HEROINE

స్పిరిట్ హీరోయిన్ కన్ఫార్మ్- ప్రభాస్ సరసన ఎవరంటే?

Spirit Movie Heroine
Spirit Movie Heroine (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2025 at 6:53 PM IST

2 Min Read

Spirit Movie Heroine : రెబల్​ స్టార్​ ప్రభాస్- సందీప్​ రెడ్డి వంగా కాంబినేషన్​లో తెరకెక్కుతున్న సినిమా 'స్పిరిట్​'. ఈ ప్రాజెక్ట్​కు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు పూర్తి కాగా, ప్రీ- ప్రొడక్షన్‌ పనులు జెట్ స్పీడ్​లో జరుగుతున్నాయి. అయితే కొంతకాలం నుంచి ఈ సినిమాలో ప్రభాస్​కు జంటగా నటించనున్నట్లు పలువురు హీరోయిన్ల పేర్లు ప్రచారం అయ్యాయి. తాజాగా డైరెక్టర్ సందీప్​రెడ్డి ఆ రూమర్స్​కు చెక్ పెడుతూ, ఇందులో నటించనున్నా హీరోయిన్​ పేరును ఆయనే స్వయంగా ప్రకటించారు.​

ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్​లో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్​గా నటించనున్నట్లు సందీప్‌ శనివారం ప్రకటించారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్​కు హీరోయిన్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. అయితే స్పిరిట్ సినిమాకు సంబంధించి ప్రభాస్ తర్వాత అఫీషియల్​గా అనౌన్స్​ చేసింది హీరోయిన్​ గురించే. సినిమా నటించనున్న పలువురు నటీనటుల వివరాలు త్వరలోనే బయటికి వచ్చే ఛాన్స్ ఉంది.

9 భాషల్లో!
కాగా, ఈ సినిమా దాదాపు 9 భాషల్లో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నట్లు తాజా ప్రకటన చూస్తే అర్థమవుతోంది. త్రిప్తి డిమ్రీ పేరును తెలుగుతో పాటు, ఇంగ్లీష్‌, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్‌, జపనీస్‌, కొరియన్‌ రాశారు. మరోవైపు, ఈ సినిమాలో తనని ఎంపిక చేయడంపై నటి త్రిప్తి సంతోషం వ్యక్తం చేసింది. ‘'ఇప్పటికీ సంతోషంలో మునిగిపోయి ఉన్నాను. ఈ జర్నీలో నన్ను నమ్మినందుకు రుణపడి ఉంటా. మీ విజనరీ మేకింగ్‌లో నన్ను భాగం చేసినందుకు అయినందుకు థ్యాంక్యూ సందీప్‌రెడ్డి వంగా' అని త్రిప్తి సోషల్ మీడియాలో పేర్కొంది.

ఇక సినిమా విషయానికొస్తే, యాక్షన్ డ్రామాగా ఇది తెరకెక్కనుంది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీసు పాత్రలో కనిపించనున్నారు. డ్రగ్ మాఫియాను అరికట్టే నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండనుంది. కాగా, ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ​ఈ ఏడాది అక్టోబర్​లో షూటింగ్ ప్రారంభయ్యే ఛాన్స్ ఉంది. ఇక శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి 2027లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

'స్పిరిట్'​ నుంచి దీపిక ఔట్- ఆ డీల్ కుదరలేదట మరి!

హిట్ కాంబో రిపీట్- 'స్పిరిట్'లో ప్రభాస్​కు జోడీగా దీపిక!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.