Pawan Kalyan OG First Single Release Date : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న చిత్రం 'ఓజీ'. ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి ఫ్యాన్స్‌కు. ఈ సినిమా నుంచి ఓ వీడియో గ్లింప్స్ మినహా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు. అందుకే పవన్ ఏ మీటింగ్, ఈవెంట్‌కు వెళ్లినా అభిమానులు ఓజీ, ఓజీ అని అరవడం మాములు అయిపోయింది. అయితే చాజాగా దీనిపై ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పారు.
ఫైర్ స్టార్మ్ వచ్చేది అప్పుడే!
పవన్ కల్యాణ్ ఒజాస్ గంభీర -ఓజీగా కనిపించనున్న ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. కాగా, తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న తమన్ రిలీజ్ ఎప్పుడో చెప్పేశాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. మిగతా షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుందని, పవన్ కల్యాణ్ సెట్స్‌కు వచ్చిన రోజు గిఫ్ట్‌గా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేస్తామని తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే, ఓజీ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో పవన్ కల్యాణ్ 'ఓజాస్ గంభీర' అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన్ని ఢీకొట్టే ప్రతినాయకుడిగానే బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ నటిస్తున్నారు. యుంగ్ బ్యూటీ ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. వింటేజ్ నటి శ్రియా రెడ్డి కీలక పాత్ర పోషిస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2025 ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.
ఇదిలా ఉండగా, పవణ్ కల్యాణ్ నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు 2025 మే 09వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు ఇటీవల మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయని నిర్మాణ సంస్థ తాజాగా పోస్ట్ చేసింది. 'రీ రికార్డింగ్, డబ్బింగ్, వీఎఫ్ఎక్స్కు సంబంధించిన పనులు జెట్ స్పీడ్‌లో జరుగుతున్నాయని వెల్లడించింది. ఇప్పటివరకు చూడని అనుభూతిని ఈ సమ్మర్లో అందించేందుకు సిద్ధమవుతున్నామని తెలిపింది చిత్ర యూనిట్.