HariHara Veeramallu Latest Update: 'హరిహర వీరమల్లు' చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మచిలీపట్నంలో శుక్రవారం జరిగిన బీచ్ ఫెస్టివల్‌కు హాజరైంది. ఆ కార్యక్రమంలో దర్శకుడు జ్యోతి కృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్, 'హరిహర వీరమల్లు' మూవీ యూనిట్ నుంచి మరికొందరు పాల్గొన్నారు. ఈవెంట్లో పవన్ కల్యాణ్ సినిమాను మూడు సార్లు చూశారని, ఆయన చాలా సంతోషంగా ఉన్నారని జ్యోతి కృష్ణ వెల్లడించారు. సినిమా గురించి దాదాపుగా గంటసేపు మాట్లాడారని తెలిపారు. పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
డైరెక్టర్‌తో పవన్ కల్యాణ్ దాదాపుగా గంటసేపు!
'నేను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారితో కలిసి పని చేసినప్పటి నుంచి ప్రజలు నాపై అసూయపడుతున్నారు. ఆయన ప్రతి ఒక్కరిలోని టాలెంట్‌ను గుర్తించి, వారు సక్సెస్ అవ్వడానికి సహాయం చేస్తారు. నాకు అప్పగించిన బాధ్యతకు నేను న్యాయం చేశానని నేను భావిస్తున్నాను. సినిమా చూసిన తర్వాత పవన్ నాతో మళ్లీ మరో మూవీ చేస్తానని చెప్పారు. ఆయన దాదాపు గంటసేపు నన్ను అభినందించారు. అది నాకు ఎప్పటికీ గుర్తిండిపోతుంది. గొప్ప అనుభూతిని ఎప్పటికీ మార్చిపోలేను' అని జ్యోతి కృష్ణ తెలిపారు.
మూవీలో 'సీజ్ ది షిప్' లెవల్లో సీన్స్!
'హరిహర వీరమల్లు' సినిమాలో పవన్ కల్యాణ్ పాత్ర గురించి చెప్పారు. "బ్రిటిషర్లు మనల్ని దోచుకోవడానికి ప్రయత్నించినప్పుడు పవన్ తన పవర్‌తో వారిని ఆపుతాడు. థియేటర్లలో ఈ సీన్స్ అద్భుతంగా ఉండనున్నాయి. అందుకోసం మార్షల్ ఆర్ట్స్‌ను నేర్చుకున్నారు. మూవీలో 'సీజ్ ది షిప్' లెవల్లో సీన్స్ ఉంటాయి. 'హరిహర వీరమల్లు'ను సినిమాకు రూ.250 కోట్లకు పైగా ఖర్చు చేశారు. మూవీని ముందుకు తీసుకెళ్లిన ఏఎం రత్నం గారికి ధన్యవాదాలు" అని డైరెక్టర్ తెలిపారు.
మూవీ పై డైరెక్టర్ ఆసక్తికర విషయాలు!
"బ్రిటిషర్లు మనల్ని పరిపాలించక ముందే, ముహమ్మద్ సుల్తాన్ అనే రాజు బందర్ పోర్టు ద్వారా మనల్ని పరిచయం చేశాడు. ఈ చిత్రంలో బందర్ పోర్టుకు వ్యతిరేకంగా అద్భుతమైన పోర్ట్ సీక్వెన్స్ సెట్ వేశాం. 17వ శతాబ్దంలో ఉన్నా విధంగా రిక్రియేట్ చేయడానికి చాలా కష్టపడ్డాం" అని అన్నారు.
పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమాకు జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఆ మూవీ రిలీజ్‌ను ఇప్పటికే చాలాసార్లు పోస్ట్ పోన్ చేశారు. సీజీ వర్క్స్ పూర్తి కాగానే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారు.
'హరిహర వీరమల్లు' మరోసారి వాయిదా
రూ.11 కోట్ల రెమ్యూనరేషన్ రిటర్న్ ఇచ్చేసిన పవర్‌స్టార్- కారణం ఇదే!