Oscar Movie OTT : 2025 ఆస్కార్ వేదికపై ఎక్కువసార్లు వినిపించిన పేరు 'అనోరా'. ఈ సినిమా ఏకంగా 5 విభాగాల్లో అవార్డులు దక్కించుకొని అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఆస్కార్ వేదికపై ఒకే చిత్రానికి నాలుగు (ఉత్తమ చిత్రం, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, దర్శకుడు) అవార్డులు అందుకున్న వ్యక్తిగా దర్శకుడు సీన్ బేకర్ రికార్డు సృష్టించారు. మరి వరల్డ్‌వైడ్‌గా ట్రెండ్ అవుతున్న ఈ సినిమా కథేంటి? ప్రస్తుతం ఏ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ అవుతుందో తెలుసకుందాం!
ఇది ఓ వేశ్య కథ
హాలీవుడ్లో భారీ బడ్జెట్, ఫుల్ యాక్షన్ జానర్ సినిమాలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కిందే ఈ 'అనోరా'. సీన్ బేకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ డ్రామా జానర్లో ఈ సినిమా తెరకెక్కించిది. మైకీ మ్యాడిసన్, మార్క్ ఎడిల్జియన్, యురా బోరిసావ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ కథ 23ఏళ్ల 'అని' అనే వేశ్య చుట్టూ తిరుగుతుంది. బ్రూక్లిన్‌లో నివసించే అని, వృత్తిలో భాగంగా ఓ రోజు రష్యన్ ఒలిగార్క్ కుమారుడు వన్యను కలుస్తుంది. అనిపై ప్రేమను పెంచుకున్న అతడు, రహస్యంగా ఆమెను వివాహం చేసుకుంటాడు. ధనవంతుల కుమారుడు వేశ్యను వివాహం చేసుకోవడం వల్ల అంతటా చర్చకు దారితీస్తుంది. చివరకు రష్యాలో నివసిస్తోన్న వన్య తల్లిదండ్రులకు ఈ విషయం తెలుస్తుంది.
తమ కుమారుడు అమాయకుడని, మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నావంటూ వారు ఆమెను నిందిస్తారు. తమ కుమారుడిని వదిలేస్తే 10 వేల డాలర్లు ఇస్తామని ఆశ చూపిస్తారు. మరి, అని వారిచ్చిన ఆఫర్‌ను స్వీకరించిందా? వన్యను వదిలేసిందా? చివరకు ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేదే సినిమా.
Three Oscars. What about four? Or five? #Oscars
— The Academy (@TheAcademy) March 3, 2025
Congratulations to ANORA, this year's Best Picture winner! pic.twitter.com/Nt3Q2Ta405
రూ.350 కోట్ల వసూళ్లు
గతేడాది అక్టోబర్‌లో రిలీజైన ఈ సినిమాను సుమారు 6 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.52 కోట్లు)బడ్జెట్‌తో రూపొందించగా, 41 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.358కోట్లు) అందుకుని కలెక్షన్లలో రికార్డులు సృష్టించింది. ఇది సీన్ బేకర్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు (గ్రాస్) సాధించిన సినిమాగా నిలిచింది.
ఓటీటీ డీటెయిల్స్ : ప్రస్తుతం ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ+ లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. కానీ, ఈ సినిమాను రెంట్ బేస్‌గా రిలీజ్ చేశారు. అందుకే ఈ సినిమా వీక్షించాలంటే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
ఆస్కార్ 2025 : బెస్ట్ యాక్టర్‌గా అమెరికా నటుడు- ఉత్తమ చిత్రం ఏదంటే?
'ఆస్కార్' బరిలో ఫస్ట్ ట్రాన్స్‌జెండర్ - అత్యుత్తమ అవార్డులు ఎవరికి దక్కేనో?