Oscars 2025 : లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా ప్రతిష్టాత్మక 97వ అకాడెమీ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన 'అనోరా'కు అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో 'అనోరా' చిత్రం ఆస్కార్‌లను సొంతం చేసుకుంది. 'ది బ్రూటలిస్ట్'లో నటనకు గానూ ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ, 'అనోరా'లో నటనకు మైకీ మ్యాడిసన్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు.
ఇక 'ఎ రియల్ పెయిన్' చిత్రంలో తన నటనకుగానూ కీరన్ కైల్ కల్కిన్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డును అందుకున్నారు. ఇక 'వికెడ్' సినిమాకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పాల్ తేజ్‌వెల్‌ను ఆస్కార్ వరించింది. బెస్ట్ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్ కేటగిరిలో 'ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రెస్' ఈ అవార్డును అందుకుంది.
సెలబ్రిటీల సందడి
ఇక ఈ ప్రతిష్టాత్మక వేడుకకు హాలీవుడ్‌తో పాటు వివిధ ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. కళ్లు చెదిరే ఔట్‌ఫిట్స్‌ను ధరించి రెడ్‌కార్పెట్‌పై మెరిశారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ఇదిలా ఉండగా, ఈ అవార్డుల వేడుకకు వచ్చిన గెస్ట్‌లతో నటి, వ్యాఖ్యాత అమేలియా డిమోల్డెన్‌బర్గ్ చిట్‌చాట్ చేశారు.
లైవ్ స్ట్రీమింగ్‌లో జోరు
ఇదిలా ఉండగా, 97వ అకాడెమీ అవార్డుల వేడుకను జియో హాట్‌స్టార్, ఏబీసీ, స్టార్ మూవీస్, హులు, ఫుబో టీవీ, యూట్యూబ్ టీవీ, ఏటీ అండ్‌టీ టీవీలు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాయి. సింథియా ఎరివో, అరియానా గ్రాండే, లిసా, డోజా క్యాట్, క్వీన్ లతీఫా, రేయ్‌లు తమ పెర్ఫామెన్స్లతో స్టార్స్‌ను అలరించారు.
ఆస్కార్ విజేతల ఫుల్ లిస్ట్ :
- ఉత్తమ చిత్రం - అనోరా
- ఉత్తమ నటుడు - అడ్రియన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్)
- ఉత్తమ నటి - మైకీ మ్యాడిసన్ (అనోరా)
- ఉత్తమ దర్శకత్వం - అనోరా (సీన్ బేకర్)
- ఉత్తమ సహాయ నటుడు - కీరన్ కైల్ కల్కిన్ (ది రియల్ పెయిన్)
- ఉత్తమ సహాయ నటి - జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)
- ఉత్తమ స్క్రీన్‌ప్లే - అనోరా (సీన్ బేకర్)
- ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే - కాన్‌క్లేవ్ (పీటర్ స్ట్రాగన్)
- ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ - వికెడ్ (పాల్ తేజ్‌వెల్)
- ఉత్తమ మేకప్, హెయిల్‌స్టైల్ - ది సబ్‌స్టాన్స్
- ఉత్తమ ఎడిటింగ్ - అనోరా (సీన్ బేకర్)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ - ది బ్రూటలిస్ట్ (లాల్ క్రాలే)
- ఉత్తమ సౌండ్ - డ్యూన్: పార్ట్2
- ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ - డ్యూన్:పార్ట్2
- ఉత్తమ ఒరిజినల్ సాంగ్ - ఎల్ మాల్ (ఎమిలియా పెరెజ్)
- ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ - ఐయామ్ స్టిల్ హియర్ (వాల్టర్ సాల్లెస్- బ్రెజిల్)
- ఉత్తమ ఒరిజినల్ స్కోర్ - ది బ్రూటలిస్ట్ (డానియల్ బ్లమ్‌బెర్గ్)
- ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - వికెడ్
- ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ - ఐయామ్ నాట్ ఏ రోబో
- ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్- ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా
- ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ - నో అదర్ ల్యాండ్
- ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ - ఫ్లో
- ఉత్తమ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్ - ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రెస్