
గోల్డెన్ ఆఫర్ ఇచ్చిన OG డైరెక్టర్- సుజీత్ టీమ్‌తో పనిచేస్తారా?
ఓజీ డైరెక్టర్ బంపర్ ఆఫర్- ఆయన టీమ్‌తో కలిసి పని చేసే ఛాన్స్!

Published : October 13, 2025 at 2:58 PM IST
Sujeeth Next Movie : యంగ్ డైరెక్టర్ సుజీత్ ఇటీవల ఓజీ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇక ఆయన తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. నేచురల్ స్టార్ నానితో సుజీత్ తన నెక్స్ట్ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అక్టోబర్ 02న పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. ఈ క్రమంలో డైరెక్టర్ సుజీత్ క్రేజీ అనౌన్స్మెంట్ ఇచ్చారు. సినిమాలపై ఆసక్తిఉన్న యువతీయువకులను, ఆశావాహులకు ఆయన టీమ్‌లో ఛాన్స్ ఇవ్వనున్నట్లు ప్రకటన విడుదల చేశారు.
వాంటెడ్ ఫిల్మ్ ఫ్రీక్స్ పేరుతో ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. రైటర్లు, అసిస్టెండ్ డైరెక్టర్లుస కాన్సెప్ట్ ఆర్టిస్ట్‌లను ఎంపిక చేసుకుంటానని పోస్ట్ చేశారు. 'సినిమాను ప్రాణంగా ప్రేమిస్తున్నవారికి ఇదొక అవకాశం' అంటూ రాసుకొచ్చారు. ఆయన టీమ్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్న వాళ్లు directionteam@signcreations.ai కు సైన్ ఇన్ ఇవ్వాలని పేర్కొన్నారు. దీంతో దర్శకత్వంలో ఆసక్తి ఉన్నవాళ్లు సుజీత్ టీమ్‌తో కలిసి పని చేసేందుకు ముందుకు వస్తున్నారు. వాళ్లు ఇప్పటికే క్రియేట్ చేలిన పలు వీడియోలను పోస్ట్‌కు కింద రీ ట్వీట్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమా నిహారికా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందుతోంది. ప్రస్తుతానికైతే ఈ సినిమాకు నాని x సుజీత్ (naniXsujeeth) అనేది వర్కింగ్ టైటిల్‌గా ఉంది.
See you guys ❤️🔥 pic.twitter.com/y9a7HGpEVU
— Sujeeth (@Sujeethsign) October 13, 2025
ఓన్లీ యాక్షనే కాదు
ఈ సినిమాలో ఓన్లీ యాక్షన్ కాకుండా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా సుజీత్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. యాక్షన్‌తోపాటు, కామెడీ, ట్విస్ట్‌లు, టర్న్‌లు అన్నీ ఉంటాయని, ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదం అందించనున్నారని సమాచారం. తన తొలి సినిమా రన్ రాజా రన్ స్టైల్లో నాని సినిమా ప్లాన్ చేస్తున్నారని టాక్. కథలో కొత్త స్క్రీన్‌ప్లే, ఎడిట్ ప్యాటర్న్ ఉండబోతోందని, మ్యూజిక్ కూడా ఇప్పటివరకు ఇండస్ట్రీలో లేని రీతిలో ఉంటుందన్న హింట్‌ని మేకర్స్ ఇచ్చారు. ఇది చూస్తుంటే ఈ సినిమా టెక్నికల్‌గానూ భారీ ప్రయోగంగా ఉండబోతోందని అంటున్నారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. నటీనటులు, హీరోయిన్ వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. అయితే నాని ఇప్పుడు ప్యారడైజ్ సినిమా చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ పనుల్లోనే నాని బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత సుజిత్ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.
With all your love here’s to the new beginnings.
— Nani (@NameisNani) October 2, 2025
Happy Dasara ♥️#NANIxSUJEETH @NiharikaEnt @Sujeethsign pic.twitter.com/9ojLGKA7tO
ఇక సుజిత్ దర్శకత్వం వహించిన ఓజీ గతనెల 25న వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను ఆయన ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో తెరక్కించారు. ఇందులో పవన్ ఓజస్ గంభీరగా కనిపించారు. ఆయన యాక్షన్ సీన్స్‌కు ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించగా, ప్రకాశ్ రాజ్ సత్య దాదా అనే పాత్రలో కనిపించారు. బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటించారు. శ్రేయా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు ఆయా పాత్రలో పోషించారు. తమన్ సంగీతం అందించగా, డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ సినిమా ఇప్పటికే రూ.300 కోట్ల క్లబ్లో చేరింది. దీనికి సీక్వెల్ కూడా ఉండనుందని సుజీత్ కన్ఫార్మ్ చేశారు. కానీ అది పట్టాలెక్కడానికి ఇంకా సమయం పడుతుంది.
సుజిత్‌తో నాని 'బ్లడి రోమియో'- త్వరలోనే షూటింగ్ షురూ!
తెలుగులో 'సుజిత్ సినిమాటిక్ యూనివర్స్'- ఓజీతో 'SCU' క్లూ ఇచ్చేశారా?

