NTRNeel Release Date : పాన్ఇండియా స్టార్ ఎన్టీఆర్- ప్రశాంత్ కాంబోలో రూపొందుతున్న 'NTRNeel' సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌పై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ సినిమా జూన్ 25 వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇద్దరు డైనిమిక్ వ్యక్తులు బాక్సాఫీస్ వద్ద సృష్టించే విధ్వంసాన్ని అనుభూతి చెందేందుకు సిద్ధం కండి. 2026 జూన్ 25న థియేటర్లు దద్దరిల్లనున్నాయి. దీన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయనున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేస్తాం అని పోస్టర్లో మేకర్స్ రాసుకొచ్చారు. తాజా అప్డేట్తో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
A Massacre by the dynamic duo delivers a notice for a havoc-filled experience 🔥
— NTR Arts (@NTRArtsOfficial) April 29, 2025
𝟮𝟱 𝗝𝗨𝗡𝗘 𝟮𝟬𝟮𝟲.
You’ll hear the loudest chants! #NTRNeel 💥
A Special glimpse for the Man of Masses @Tarak9999’s birthday.#PrashanthNeel @MythriOfficial @NTRNeelFilm @TSeries… pic.twitter.com/3P2uFCo7kc
అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా 2026 జనవరి 09న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, కథ డిమాండ్, క్వాలిటీ ఔట్పుట్ కోసం రిలీజ్ ఆలస్యం కానుంది. ఇలా పలు కారణాల వల్ల విడుదల లేట్ అవ్వనుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్వాలిటీ విషయంలో రాజీ పడేదే లేదని నిర్ణయించుకున్నారు. అందుకే రిలీజ్ కాస్త లేటైనా, మంచి ఔట్పుట్ అందించేందుకే ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా విడుదల ఆలస్యం అయినా, సినిమా అంచనాలు మించేలా ఉండాలని భావిస్తున్నారు.
కాగా, ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభమైంది. రీసెంట్గా ఎన్టీఆర్ కూడా సెట్స్‌లో జాయిన్ అయ్యారు. ఆయనపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో తారక్ శక్తమంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఇక తొలి షెడ్యూల్లోనే దర్శకుడు ప్రశాంత్ యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించారు. 3000 మంది జూనియర్ ఆర్టిస్ట్‌లతో భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేశారు.
ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారని టాక్. ఈ ప్రాజెక్ట్‌కు డ్రాగన్ అనే టైటిల్ కన్ఫార్మ్ చేశారని ప్రచారం సాగుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది.
తారక్, నీల్ మూవీలో శ్రుతి హాసన్- గ్లామర్ కోసం కొత్త ప్లాన్!