ETV Bharat / entertainment

'ప్రేమమ్​' హీరోకు బిగ్ రిలీఫ్! లైంగిక వేధింపుల కేసులో క్లీన్ చిట్!

లైగింక వేధింపుల కేసులో నటుడు నివిన్ పౌలీకి కేరళ కోర్టు క్లీన్ చిట్

Nivin Pauly
Nivin Pauly (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 6, 2024, 6:23 PM IST

Nivin Pauly Sexual Allegations Case : మాలీవుడ్ స్టార్ హీరో నివిన్‌ పౌలికి తాజాగా ఊరట లభించంది. గతంలో తనను వేధింపులకు గురిచేశారంటూ ఓ యంగ్ హీరోయిన్ చేసిన ఫిర్యాదు వల్ల వార్తలోకెక్కిన ఈ స్టార్ హీరో ఇప్పుడు నిర్దోషిగా నిరూపితమయ్యారు. ఆయనపై నమోదైన కేసును విచారించిన టీమ్​ నివిన్​కు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.

ఆ అమ్మాయిని నివిన్‌ లైంగికంగా వేధించినట్లు ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లభించలేదంటూ ఆ బృందం తెలిపింది. బాధితురాలిపై వేధింపులు జరిగినప్పుడు నివిన్‌ అక్కడ లేరంటూ డీవైఎస్పీ నేతృత్వంలోని విచారణ బృందం కొత్తమంగళం కోర్టుకు సమర్పించిన తాజాగా నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. దీంతో నిందితుల జాబితా నుంచి ఆయన పేరును పోలీసులు తొలగించారు. ఇక మిగిలిన వారిపై యధాతథంగా విచారణ కొనసాగుతుందంటూ తెలిపారు.

ఇంతకీ కేసు ఏంటంటే?
తనపై నివిన్ లైంగిక దాడికి దిగారంటూ ఓ యువ నటి గతంలో పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. తనకు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి, గత నవంబరులో ఆమెను దుబాయ్‌ తీసుకెళ్లారని, అక్కడే ఆమెను వారు లైంగికంగా వేధించినట్లు ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు పోలీసులు నివిన్‌ సహా మరో ఆరుగురిపై నాన్‌-బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు. అయితే నిందితుల్లో ఓ నిర్మాత కూడా ఉండటం గమనార్హం. ఇక ఈ లిస్ట్​లో నివిన్‌ పౌలీ పేరు ఆరో వ్యక్తిగా చేర్చారు. ఈ నేపథ్యంలో అప్పట్లో నివిన్ కూడా ఈ విషయంపై స్పందించారు.

'నేను ఓ అమ్మాయిని లైంగికంగా వేధించానన్న తప్పుడు వార్త నా దృష్టికి వచ్చింది. ఈ విషయం పూర్తిగా అవాస్తవం. ఈ ఆరోపణలు నిరాధారమైనవని నిరూపించడానికి నేను ఎక్కడివరకైనా వెళ్తాను. మిగిలినవన్నీ చట్టబద్ధంగా జరుగుతాయి' అంటూ నివిన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆ సమయంలో నివిన్ అభిమానులందరూ ఆయనకు అండగా నిలిచారు. తనను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్​లు కూడా షేర్ చేశారు.

బాలీవుడ్​కు​ నో చెప్పి.. దక్షిణాదికి జైకొట్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.