ETV Bharat / entertainment

13ఏళ్లకే నిక్​ జోనస్​కు షుగర్! ప్రియాంక చోప్రా రెస్పాన్స్​ ఇదే! - NICK JONAS DIABETES DIAGNOSIS

పదమూడేళ్లకే షుగర్ వచ్చిందని నిక్​ జోనస్​ ఎమోషనల్ పోస్ట్​! ప్రియాంక చోప్రా ఎలా స్పందించిందంటే?

Nick Jonas Diabetes Diagnosis
Nick Jonas Diabetes Diagnosis (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : April 22, 2025 at 1:30 PM IST

2 Min Read

Nick Jonas Diabetes Diagnosis : ప్రముఖ సెలబ్రిటీ కపుల్ ప్రియాంక చోప్రా - నిక్ జొనాస్ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తమ పెళ్లితో బాలీవుడ్​, హాలీవుడ్​తో పాటు ప్రపంచం మొత్తాన్ని తమ వైపు తిప్పుకొన్న ఈ జంట దాంపత్య బంధంలో అడుగిడి దాదాపు ఏడేళ్లు అవుతోంది. అయినా ఇప్పటికీ 'లవ్‌ బర్డ్స్‌'గానే చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు!. కపుల్ గోల్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటారు. అయితే వీరి గురించి ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది. తనకు 13ఏళ్ల వయసు ఉన్నప్పుడే డయాబెటిస్​ ఉన్నట్లు తెలిసిందని నిక్​ జోనస్​ ఎమోషనల్​ నోట్ రాశారు. దానికి ప్రియాంక చోప్రా ప్రేమగా బదులు ఇచ్చింది!.

సింగర్​, నటుడిగా ప్రసిద్ధి చెందిన నిక్​ జోనస్​ తనకున్న షుగర్​ వ్యాధి గురించి బహిరంగంగానే చెబుతుంటారు. తాజాగా తనకు 13ఏళ్ల వయసు ఉన్నప్పుడే డయాబెటిస్ ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. "నాకు 13 ఏళ్ల వయసులో టైప్ 1 డయాబెటిస్ నిర్ధరణ అయిన తర్వాత, ఎవరో నా కలలపై తలుపులు మూసినట్లు అనిపించింది. అయితే ఇప్పుడు నా చిన్నతనానికి- నేను ఊహించిన దానికంటే ప్రతీదీ బాగానే జరుగుతుందని చెప్పగలిగితే బాగుండు. ది లాస్ట్ ఫైవ్ ఇయర్స్" అంటూ నిక్ నోట్​ పెట్టారు.

"డయాబెటిస్ నన్ను ఆపలేదని నాకు తెలుసు. డెక్స్‌కామ్ G7 (డెక్స్‌కామ్ జి7 అనేది నిరంతర గ్లూకోజ్ మానిటరింగ్ (CGM) వ్యవస్థ. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను రియల్​ టైమ్​లో ట్రాక్ చేస్తుంది. డయాబెటిస్‌ను మేనేజ్​ చేయడానికి ఉపయోగపడుతుంది) నా ప్రయాణంలో చాలా ముఖ్యమైన భాగం. నా ఫోన్ లేదా ఆపిల్ వాచ్‌లో నా గ్లూకోజ్ స్థాయిలను యాక్సెస్ చేయడం, ఆ సమాచారాన్ని నా కుటుంబం, టీమ్​తో నేరుగా పంచుకునే సామర్థ్యం, నేను డయాబెటిస్‌ను మేనేజ్​ చేసే విధానాన్ని మార్చివేసింది. డెక్స్‌కామ్ CGM నా డయాబెటిస్‌ను నియంత్రించడానికి, నేను పదమూడేళ్లప్పుడు నేను సాధ్యం కావు అనుకున్నవి సాధించడానికి నాకు అవసరమైన జ్ఞానాన్ని అందించింది" అని నిక్ పోస్ట్​లో వివరించారు అన్నారు.

నిక్​ జోనస్​ పెట్టిన నోట్​కు ప్రియాంక చోప్రా ప్రేమగా స్పందించింది. ఆ పోస్ట్​కు కామెంట్​ సెక్షన్​లో హార్ట్​ ఐడ్​ ఇమోజీ పెట్టింది. అయితే సోషల్ మీడియా ద్వారా డయాబెటిస్​పై అవగాహన కల్పిస్తున్నందుకు నిక్​ జోనస్​కు అభినందించారు పలువురు నెటిజన్లు.

క్రిష్ 4కు ప్రియాంక చోప్రా పారితోషికం రూ.30కోట్లు!

SSMB 29 సెట్స్​లో అభిమానుల సందడి- మహేశ్, ప్రియాంక ఫొటోలు వైరల్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.