ETV Bharat / entertainment

నాని క్రేజీ లైనప్​ - ఆ డైరెక్టర్​తో ఫస్ట్​ మూవీ, హీరోయిన్​తో ఇది మూడోసారి! - Nani Upcoming Movies

Nani Upcoming Movies : నేచురల్ స్టార్ నాని త్వరలోనే ఓ క్లాసిక్​ డైరెక్టర్​తో ప్రాజెక్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే అందులోని హీరోయిన్​ కూడా నానితో మూడోసారి స్క్రీన్​ షేర్ చేసుకోనుంది. ఇంతకీ ఆ డైరెక్టర్, హీరోయిన్ ఎవరంటే?​

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2024, 10:09 AM IST

Nani Upcoming Movies
Nani Upcoming Movies (ETV Bharat)

Nani Upcoming Movies : నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస హిట్స్​తో దూసుకెళ్తున్నారు. ఆయన నటించిన 'హాయ్​ నాన్న', 'సరిపోదా శనివారం' బ్లాక్ బస్టర్లు కావడం వల్ల ఇప్పుడు నాని ఫ్యాన్స్ దృష్టంతా ఆయన అప్​కమింగ్ మూవీస్​పై పడింది. రానున్న సినిమాతో ఆయన హ్యాట్రిక్ కొట్టి రికార్డుకెక్కాలని ఆశిస్తున్నారు.

అయితే ఇప్పుడు నాని లైనప్​లో 'హిట్​ 3', 'ఓజీ' ఫేమ్​ సుజీత్ మూవీ, అలాగే 'దసరా' డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సినిమాలు ఉన్నాయి. ఇందులో 'హిట్​ 3' నుంచి మాత్రం తాజాగా ఓ స్పెషల్ పోస్టర్ విడుదలై అభిమానులను ఆకట్టుకుంది. ఆ సినిమా కూడా 2025 మే 1న థియేటర్లలోకి వచ్చేందుకు ఫిక్స్ అయ్యింది. మిగిలిన రెండు సినిమాలు మాత్రం ఎటువంటి అప్​డేట్స్ లేకుండానే సైలెంట్​గానే ఉన్నాయి. దీంతో అభిమానుల్లో నాని నెక్స్​ట్​ ప్రాజెక్ట్ గురించి మరింత ఆసక్తి పెరిగింది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన రూమర్ తెగ ట్రెండ్ అవుతోంది. అదేంటంటే నాని త్వరలో తన అప్​కమింగ్ మూవీస్​ లిస్ట్​లోకి ఓ స్టార్ డైరెక్టర్ సినిమాను చేర్చనున్నారట. ఆయనెవరో కాదు టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఈయన తాజాగా నానికి ఓ స్టోరీ వినిపించగా, అది హీరోకి తెగ నచ్చిందట. దీంతో ఈ ఇద్దరూ కలిసి ఆ ప్రాజెక్ట్​పై పనిచేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం నానితో పాటు శేఖర్ కమ్ముల కూడా బిజీగా ఉండటం వల్ల ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని 2025లో సెట్స్​పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ​

ఇదిలా ఉండగా, ఈ సినిమాలోని ఫీమేల్​ లీడ్ కోసం నేచురల్ బ్యూటీ సాయి పల్లవిని ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శేఖర్ కమ్ముల ఆమెతో కూడా ఈ విషయమై సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఇదిగనక నిజమైతే ఈ సూపర్ పెయిర్ కూడా హ్యాట్రిక్​గా స్క్రీన్​పై కనిపిస్తారు. ఇప్పటికే ఈ జంట 'MCA', 'శ్యామ్ సింగరాయ్' సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.

'సర్కార్ టేక్స్ ఛార్జ్' - 'హిట్ 3'లో నాని పవర్​ఫుల్ ఇంట్రో! - Nani Hit 3 Movie

15రోజులు మాకు నిద్ర లేదు: సక్సెస్​మీట్​లో నాని - Saripodhaa Sanivaaram

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.