HIT 3 Trailer Released : నేచురల్ స్టార్ నాని- శైలేష్ కొలను కాంబోలో తెరకెక్కుతున్న మూవీ 'హిట్-3'. 'హిట్' ఫ్రాంచైజీలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ మూవీ సమ్మర్ స్పెషల్‌గా మే 1న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో షురూ చేశారు. ఇందులో భాగంగానే సోమవారం మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
'క్రిమినల్స్ భూమిపై ఉంటే 10 ఫీట్ల సెల్లో ఉండాలి లేదంటే భూమి కింద ఆరు ఫీట్ల లోపల ఉండాలి' అనే ఇంట్రెస్టింగ్ డైలాగ్‌తో ట్లైలర్ ప్రారంభమైంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నాని ఇందులో కనిపించనున్నారు. ఆఖర్లో 'అబ్ కీ బార్ అర్జున్ సర్కార్' అనే డైలాగ్‌తో అంచనాలు పెంచేశారు. ఫుల్ వైలెంట్ అండ్ పవర్‌ఫుల్‌గా ఉన్న ట్రైలర్‌ను మీరు చూశారా?