Nagachaitanya About Sobhita Dhulipala : టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య తాజాాగా తన సతీమణి శోభితా ధూళిపాళ్ల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తనతో ఆయన అన్ని విషయాలను ఎంతో ఆనందంగా పంచుకుంటారని తెలిపారు. కొన్ని సార్లు తను డెసిషన్స్ తీసుకోవడంలో అయోమయానికి గురవుతుంటానని ఆ సమయంలో ఆమె ఎంతో సపోర్టివ్‌గా ఉంటుందని, సరైన సలహా కూడా ఇస్తుందని చైతూ చెప్పుకొచ్చారు.
"శోభితతో జీవితాన్ని పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. తనతో నేను అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. అది నాకు ఎంతో ఇష్టం. నా ఐడియాలన్నింటినీ ఆమెతో చెబుతుంటాను. నేను ఎప్పుడైనా కన్ఫ్యూజన్గా అనిపిస్తే వెంటనే తనతో మాట్లాడుతాను. నేను ఏ మాత్రం కొంచమైనా స్ట్రెస్ ఫీల్ ?అయినా కూడా తనకు ఇట్టే తెలిసిపోతుంది. 'ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? అని వెంటనే అడుగుతుంది. అన్ని విషయాల్లోనూ తను నాకు ఎన్నో గొప్ప సలహాలు, సూచనలు ఇస్తుంటుంది. ఆమె ఒపినీయన్స్ కూడా ఎంతో న్యూట్రల్‌గా ఉంటాయి. అందుకే తన డెసిషన్‌ను నేను ఎంతో గౌరవిస్తా. ప్రతీది ఆమె నిర్ణయం తర్వాతనే వర్క్ చేస్తాను" అని చైతూ చెప్పుకొచ్చారు.
సినిమాల విషయానికొస్తే, నాగ చైతన్య తండేల్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇందులో సాయి పల్లవి నటించింది. గత కొద్ది కాలంగా బడా సక్సెస్ కోసం ఎదురుచూస్తోన్న చైతూ ఈ సారి 'తండేల్'తో దాన్ని అందుకునేలా ఉన్నారని ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్‌తో భారీ అంచనాలు పెంచేసిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో ఫిబ్రవరి 7న థియేటర్లలో సందడి చేయనుంది. దేశభక్తి అంశాలతో పాటు ఓ ఎమోషనల్ లవ్ స్టోరీని ప్రేక్షకులకు చూపించనున్నారు డైరెక్టర్ చందూ మొండేటి.
ఇక శోభిత ధూళిపాళ్ల 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచింది. 2016లో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తోన్న ఆమె, హాలీవుడ్‌లోనూ అవకాశాలు అందుకుంటూ కెరీర్లో ముందుకెళ్తోంది.
పెళ్లికి ముందు ఫస్ట్ టైమ్ అక్కడ కలిశాం - నా చేతికి చైతూ గోరింటాకు కూడా పెట్టారు : శోభిత