Bihar Election Results 2025

ETV Bharat / entertainment

ఆ ఇద్దరిని దింపుతున్న తమన్- అఖండ 2 థియేటర్లలో ఇక 'తాండవమే'

అఖండ 2 తాండవం సాలిడ్ అప్డేట్- రంగంలోకి ఆ ఇద్దరు

Akhanda 2
Akhanda 2 (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : October 12, 2025 at 3:13 PM IST

2 Min Read
Choose ETV Bharat

Akhanda 2 Thandavam : టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చిన్న బ్రేక్ తర్వాత మళ్లీ వర్క్ మోడ్​లోకి వెళ్లిపోయారు. ఆయన సంగీతం అందిస్తున్న అప్​కమింగ్ భారీ బడ్జెట్ మూవీ అఖండ 2 తాండవం కోసం పనులు రీ స్టార్ చేశారు. తాజాగా రీ రికార్డింగ్ పనులు మొదలు పెట్టినట్లు సమాచారం. అయితే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు బెస్ట్ ఆఫ్ బీజీఎమ్ అందించాలనే తపనతో ఉన్నారు. దీంతో మరో ఇద్దరిని రంగంలోకి దింపారు. దీంతో ఫ్యాన్స్​లో అంచనాలు పీక్స్​లోకి వెళ్లిపోయాయి.

2021లో అఖండ సినిమాతో థియేటర్లలో స్పీకర్లు బద్దలయ్యేలా చేసిన తమన్ ఈ సీక్వెల్​కు అంతకంటే బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అఖండ తాండవం రీ రికార్డింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులు రీ స్టార్ట్ చేశారు. సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం ప్రముఖ పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రాను రంగంలోకి దింపుతున్నారు. ఈ ఇద్దరు పండిట్లు సోదరులు.

వేగంగా గుక్కతిప్పుకోకుండా సంస్కృతంలో శ్లోకాలు చెప్పడంలో ఈ పండిట్ సోదరులు దిట్ట. సోషల్ మీడియాలో వీళ్లు శ్లోకాలు చెప్పిన వీడియో ఇప్పటికే అనేకం వైరల్ అయ్యాయి. అయితే ఈ సోదరులను తమన్ ఆఖండ తాండవం కోసం దింపుతున్నారు. ఇందుకోసం తమన్ తాజాగా ఈ ఇద్దరిని కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోను మేకర్స్ సోషల్ మీడియా ఎక్స్​ అకౌంట్​లో షేర్ చేశారు. పండిట్ సోదరుతో తమన్ దిగిన ఫొటో ఫుల్ వైరల్​ అవుతోంది.

'శ్రవణ్ మిశ్రా, అతుల్ మిశ్రాకు అఖండ తాండవం ప్రాజెక్ట్​లోకి స్వాగతం. అఖండకు బెస్ట్ ఔట్​ ఫుట్ ఇచ్చేందుకు ఏ చిన్న ప్రయత్నాన్నీ తమన్ వదులుకోరు. థియేటర్లలో డివైన్ వైబ్స్ ఫీల్ అయ్యేందుకు సిద్ధంగా ఉండండి. డిసెంబర్ 05న కలుద్దాం' అంటూ మేకర్స్ పోస్ట్​కు రాసుకొచ్చారు. దీంతో థియేటర్లలో ఈసారి కూడా బాక్సులు బద్దలైపోవడం పక్కా అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అఖండ 2 తెలుగు సినిమాలో సంచలనంగా నిలిచిపోతుందని పోస్ట్​లు షేర్ చేస్తున్నారు.

కాగా, రీసెంట్ టైమ్స్​లో టాలీవుడ్​లో మ్యాసివ్ బీజీఎమ్​లకు తమన్ కేరాఫ్ అడ్రస్​గా మారిపోయారు. బాలయ్య - తమన్ కాంబోలో ఇప్పటికే వచ్చిన అఖండ, వీర రాఘవరెడ్డి, డాకు మహారాజ్ సినిమాలకు బ్యాగ్రౌండ్​ మ్యూజిక్ అదిరిపోయింది. ముఖ్యంగా 2021లో అఖండకు తమన్ నెక్ట్స్ లెవెల్ బీజీఎమ్ స్కోర్ అందించారు. ఈ సినిమాకైతే కొన్ని సెంటర్లలో థియేటర్లలో స్పీకర్లు బద్దలైపోయాయి. ఇక తమన్ రీసెంట్​గా ఓజీ సినిమాకు అందించిన మ్యూజిక్​కు కూడా ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు పండిట్ సోదరుల రాకతో అఖండ మ్యూజిక్ వేరే లెవెల్​లో ఉంటుందని అశిస్తున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే, దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు. దేశంలో పలు ఆధ్యాత్మిక క్షేత్రాల్లో సినిమా షూటింగ్ చేశారు. ఇందులో సంయుక్త, ప్రగ్య జైస్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలయ్య కుమార్తె తేజశ్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట 14 రీల్స్ బ్యానర్​పై రూపొందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 05న వరల్డ్​వైడ్​ గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

అఖండ 2 రిలీజ్ డేట్ ఫిక్స్- మరోసారి బాలయ్య శివ తాండవం- కొత్త పోస్టర్ చూశారా?

అఖండ 2 రిలీజ్​​పై బోయపాటి క్లారిటీ- సినిమా వచ్చేదెప్పుడంటే?