ETV Bharat / entertainment

తొలి మూవీతోనే స్టార్ క్రేజ్- షారుక్, సల్మాన్​తో సినిమా ఛాన్స్- ఆ ఆరోపణతో కెరీర్ స్మాష్! - Star Heroine Career Ruined

Star Heroine Career Ruined : మొదటి సినిమాతోనే బాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ పేరు సంపాదించుకుంది ఓ నటి. షారుక్​ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి పెద్ద పెద్ద హీరోలతో కలిసి నటించింది. కానీ అంతలోనే సినిమాలకు దూరమయ్యింది. ఇంతకీ ఎవరా నటి? ఇప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తుంది?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2024, 9:40 PM IST

Star Heroine Career Ruined
Star Heroine Career Ruined (Source : Getty Images)

Star Heroine Career Ruined :సక్సెస్ అనేది అందరికీ ఒకేలా ఉండదు. ముఖ్యంగా సినీ రంగ పరిశ్రమలో ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన జర్నీ. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వెంటనే సూపర్ స్టార్ పేరు దక్కించుకోవడం సులభమైన విషయం కాదు. కానీ, ఓ నటి తొలి సినిమాతోనే బాలీవుడ్ పరిశ్రమలో స్టార్ హీరోయిన్​గా మారింది. తర్వాత వరుసగా బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుక్​​ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, గోవింద వంటి వారితో కలిసి నటించింది. కానీ, బాధాకరమైన విషయం ఏంటంటే ఆమెకు సక్సెస్ ఎంత త్వరగా లభించిందో అంతే త్వరగా కెరీర్ నాశనమయ్యింది. కేవలం ఒక్క పొరపాటు ఆమె జీవితాన్నే మార్చేసింది. ఇంతకీ మనం చెప్పుకునేది ఎవరి గురించో చెప్పలేదు కదా! 52 సంవత్సరాల ఆ నాటి హీరోయిన్ మమతా కులకర్ణి గురించి.

డెబ్యూ ఫిల్మ్
1992లో విడుదలైన 'తిరంగా' చిత్రంతో మమతా కులకర్ణి బాలీవుడ్ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇందులో ఆమెతో పాటు రాజ్ కుమార్, నానా పాటేకర్ కీలక పాత్రల్లో కనిపించారు. ఆ సినిమాతో ఒక్కసారిగా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది ఈ భామ.

సూపర్ హిట్ చిత్రాలు
'తిరంగా'తో మంచి పేరు సంపాదించుకున్న మమత తరువాత వరుసగా అంటే 1993లో 'ఆశికీ ఆవారా', 'వక్త్ హై హమారా', 1994లో 'క్రాంతివీర్', 1995లో 'కరణ్ అర్జున్', 'సబ్సే బడా ఖిలాడీ', 'ఆందోళన్', 1996లో 'బాజీ', 1998లో 'చైనా గేట్', 2001లో 'ఛుప్పా రుస్తుం' వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించే అవకాశాలను అందుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్​గా మారింది.

ఒక్క ఆరోపణతో!
కెరీర్ మంచి ఊపులో ఉన్న సమయంలోనే అంటే 2013లో అహ్మదాబాద్​కు చెందిన ఇంటర్నేషనల్ డ్రగ్స్ వ్యాపారి విక్కీ గోస్వామిని విహాహమాడింది మమత. ఆ తరువాత డ్రగ్స్ విషయంలో ఈమెపై ఆరోపణలు మొదలయ్యాయి. 2016లో దాదాపు 2000కోట్ల రూపాయల విలువైన ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్​కు సంబంధించిన కేసులో ఈమె కూడా నిందితురాలని తెలిసింది. ఈ కేసులో ఆమెపై ఎలాంటి ఛార్జ్ విధించనప్పటికీ ఈ వార్తలు ఆమె సినీ కెరీర్​పై ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి.

దీంతో మమత కెరీర్ ఒక్కసారిగా కుప్పకూలింది. మరోవైపు 'చైనా గేట్' చిత్రం విడుదల తర్వాత బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత అయిన రాజ్ కుమార్ సంతోషితో మమతకు మధ్య కొన్ని వివాదాలు తలెత్తాయట. ఇది ఆమె సినీ కెరీర్​ను మరింత దిగజార్చిందనే చెప్పుకోవాలి. ఇలా డ్రగ్స్ కేసులో రకరకాల ఆరోపణలు ఓ వైపు, చూస్తుండగానే కెరీర్ నాశనం అవడం మరోవైపు జరుగుతుండటంతో మమత యాక్టింగ్​కు గుడ్ బై చెప్పేసింది. తన తర్వాతి జీవితాన్ని యోగినిగా గడపాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం సినిమా గ్లామర్ ప్రపంచానికి దూరంగా మమతా కెన్యాలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది.

Jr ఆర్టిస్ట్​గా కెరీర్​ స్టార్ట్- కమల్, సూర్యలాంటి స్టార్లతో స్క్రీన్ షేర్ - Junior Artist Acted With Big Heroes

చిన్న సినిమాలతో భారీ సక్సెస్ - ఈ వారం థియేటర్లలో అదరగొట్టిన చిత్రాలివే! - Latest movies with low budget

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.