Actor Jaffer Sadiq Earnings : దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు ఎందరో యాక్టర్స్ తమ నటనతో సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేస్తుంటారు. దీని ద్వారా స్టార్డమ్ తెచ్చుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద తమ చిత్రాలతో భారీ స్థాయిలో వసూళ్లను రాబడుతుంటారు. ఇటీవల కాలంలో షారుక్ ఖాన్ 'జవాన్', రజనీకాంత్ 'జైలర్', కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాతో భారీగా కలెక్షన్లు కొల్లగొట్టారు. ఈ మూడు సినిమాల్లో కీలక పాత్ర పోషించిన ఓ యాక్టర్ ఒకరు ఉన్నారు. తన చివరి 3 చిత్రాల ద్వారా దాదాపు రూ.2 వేల కోట్ల కలెక్షన్లను అందుకున్నారు. అంటే షారుక్, కమల్, రజనీ నటించిన చివరి 3 సినిమాల కంటే ఈ నటుడు యాక్ట్ చేసిన మూవీసే ఎక్కువ కలెక్షన్లు రాబట్టాయి. అసలు ఇంతకీ ఎవరు ఆ నటుడు?
డ్యాన్సర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ- యాక్టర్‌గా పాపులర్
అజానుబాహుడైన హీరోలకు భిన్నంగా ఈ నటుడి ఎత్తు కేవలం ఎత్తు 4 అడుగుల 8 అంగుళాలే. వయసు 27ఏళ్లు. అయినప్పటికీ ఈ దక్షిణాది నటుడి గత 3 చిత్రాలు అద్భుతాలు చేశాయి. మనం మాట్లాడుకుంటుంది తమిళ నటుడు జాఫర్ సాదిక్ (27) గురించే. ఆయన 1995లో జన్మించారు. తొలుత డ్యాన్సర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాదిక్ ప్రస్తుతం నటుడిగా మారిపోయారు. తమిళ చిత్ర పరిశ్రమలో టాలెంటెడ్ యాక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు.
విక్రమ్‌తో ఎంట్రీ
2022లో కమల్‌హాసన్- లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన 'విక్రమ్' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు సాదిక్. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా అదే రేంజ్లో సక్సెస్‌ను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. రూ.414 కోట్ల వసూళ్లను రాబట్టింది.
రజనీలో 'జైలర్'లో యాక్టింగ్
ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ లీడ్ రోల్లో తెరకెక్కిన 'జైలర్' సినిమాలో హీరోకు సపోర్టింగ్ రోల్లో కనిపించారు సాదిక్. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించింది. రూ.650 కోట్ల వసూళ్లను రాబట్టింది.
షారుక్ 'జవాన్'లో
ఇక 2023 షారుక్ ఖాన్- అట్లీ కాంబోలో వచ్చిన 'జవాన్' కూడా మంచి హిట్ టాక్ సాధించింది. ఈ సినిమా రూ.1150 కోట్లు కోట్లు సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలోనూ సాదిక్ నటించారు. ఇలా సాదిక్ నటించిన ఆఖరి మూడు సినిమాలు కలిపి రూ.2200 కోట్లపైగా కలెక్షన్లు సాధించాయి.
ప్రభాస్, రజనీకాంత్, సన్నీ దేఓల్, రణబీర్ కపూర్, అల్లు అర్జున్ వంటి సూపర్ స్టార్లు నటించిన ఆఖరి మూడు సినిమాలు కూడా ఇంత మొత్తంలో కలెక్షన్లు సాధించలేదు. అయితే 2023లో షారుక్ నటించిన మూడు చిత్రాలు (జవాన్, పఠాన్, ఢంకీ) మంచి వసూళ్లు రాబట్టాయి. ఈ 3 మూవీస్ కలిపి రూ.2600 కోట్లు కలెక్షన్లు సాధించాయి.
ప్రభాస్ మాయలో పాకిస్థాన్ నటి- డార్లింగ్ అంటే తెగ ఇష్టమట!
'ముద్దుల కొడుకా, డాడీ ఈజ్ కమింగ్ రా'- ఇంట్రెస్టింగ్గా సూర్య రెట్రో ట్రైలర్!