ETV Bharat / entertainment

చాలా బాధేసేది! - కానీ నేనిప్పుడు అలా లేను : మలైకా అరోరా - Malaika Arora

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 10, 2024, 4:36 PM IST

Malaika Arora Trolls : మలైకా అరోరా తనపై వచ్చే ట్రోల్స్‌ గురించి స్పందించింది. అలాగే తనకు సంబంధించిన కొన్ని పర్సనల్‌ విషయాలను తెలిపింది! పూర్తి వివరాలు స్టోరీలో

source ETV Bharat and Getty Images
Malaika Arora Trolls (source ETV Bharat and Getty Images)

Malaika Arora Trolls : మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన హాట్ అండ్ ఫిట్‌నెస్‌ అందాల ప్రదర్శనతో నెటిజన్లను ఫిదా చేస్తుంటుంది. అభిమానులకు కనుల విందును ఇస్తుంటుంది. ఇదే సమయంలో ఆమె రిలేషన్‌షిప్‌కు సంబంధించి లేదా ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌, లుక్స్‌పై నెట్టింట్లో నెగిటివిటీ కూడా వస్తుంటుంది. ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూ ఉంటుంది.

అయితే తాజాగా ఈ విషయమై మలైక స్పందించింది. ఈ నెగిటివిటీ తనను ప్రభావితం చేస్తుందని చెప్పిన మలైక ఇదే సమయంలో పలు మార్గాలను అనుసరించడం ద్వారా మానసిక బలాన్ని పెంపొందించుకున్నట్లు తెలిపింది. "కొన్ని సార్లు నా గురించి అసహ్యంగా, చండాలంగా రాసిన కథనాలు కనిపించినప్పుడు, వాటిని స్వీకరిస్తాను. అది ఆ సమయానికి కాస్త బాధను, గందరగోళానికి గురి చేస్తుంది. కానీ నేను వాటిని పట్టించుకోకుండా బలంగా ఉండటంలో మెరుగయ్యాను. మానసికంగా దృఢంగా, బలంగా ఉండేందుకు చాలా కృషి కూడా చేస్తున్నాను. అనవసరమైన వాటిని పట్టించుకోవడం మానేసి, సమయానికి యోగా, ధ్యానం చేయడం, తినడం, నిద్రపోవడం వంటివి చేసి నన్ను నేను బలంగా ఉంచుకుంటున్నాను." అని మలైక చెప్పారు.

50 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ మలైకా అరోరా ఎంతో ఫిట్‌గా, తక్కువ వయసు ఉన్న వ్యక్తిలా కనిపిస్తుంటారు. దీంతో ఆమె ఫిజికల్ అప్పియరెన్స్‌పై ప్రశంసలు కూడా వస్తుంటాయి. దీనిపై కూడా మలైక స్పందించింది. "48 ఏళ్ల వ్యక్తిలా భలే కనిపిస్తున్నావ్‌ అని కొంతమంది అంటుంటారు. అది విన్నప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. ప్రజలు దానిని సెటైరికల్‌గా అంటున్నారని నేను అనుకోను. దాన్ని కాంప్లిమెంట్‌లా భావిస్తాను. నేనిలా కనిపిస్తున్నానంటే అది నేను చేసిన కృషి, అంకితభావం, ఏకాగ్రత వల్లే సాధ్యమైంది. మీరు ఇలా ఉండేందుకు ఏం చేస్తున్నారని ఎవరైనా నన్ను అడిగితే గొప్పగా అనిపిస్తుంది." అని మలైక వెల్లడించింది.

ఇకపోతే మలైకా అరోరా గతంలో ఫిల్మ్‌మేకర్‌, యాక్టర్‌ అర్బాజ్‌ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. కానీ వీరిద్దరు పెళ్లైన 19 ఏళ్లకు విడిపోయారు. ఈ జంటకు 21 ఏళ్ల అర్హాన్‌ అనే అబ్బాయి ఉన్నాడు. అచితే అర్బాజ్‌ ఖాన్‌ రీసెంట్‌గా షురా ఖాన్‌ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. మలైక తన కన్నా వయసులో చిన్నవాడైనా హీరో అర్జున్ కపూర్‌తో రిలేషన్‌ షిప్‌ మెయిన్‌ టెయిన్ చేసింది. కానీ ఇప్పుడు వీరిద్దరు విడిపోయినట్లు ప్రచారం సాగుతోంది.

అయితే అర్జున్‌తో రిలేషన్‌షిప్‌ గురించి మలైక మాట్లాడలేదు కానీ తన కొడుకు అర్హాన్‌తో మంచి అనుబంధం ఉందని చెప్పింది. కాగా, గతంలో పలు సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం డ్యాన్సర్‌గా, టీవీ హోస్ట్‌గా, వీజేగా, మోడల్‌గా, రియాలిటీ షో జడ్జిగా రాణిస్తోంది. అయితే తాను ఏమీ చేసినా తనకు సంతృప్తినిచ్చేది మాత్రమే చేస్తానని, దాని కోసం ప్రత్యేకంగా ఏమీ ఆలోచించనని పేర్కొంది.

ఫ్యాన్స్ గెట్‌ రెడీ - ఒకే వేదికపై బాలయ్య, చిరు! - Chiranjeevi Balakrishna

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీ షూటింగ్​ షురూ - పూజా కార్యక్రమాలతో లాంఛనంగా - Prashanth Neel NTR 31

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.