Kubera Success Meet Chiranjeevi : స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'కుబేర' చిత్రం బ్లక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. కింగ్ నాగార్జున, ధనుష్ కాంబినేషనన్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ ఏర్పాటు చేశారు. దీనికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ధనుష్ నటనపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.
'కుబేర'లో ధనుష్ బిచ్చగాడి పాత్రకు జీవం పోశారు. ఈ పాత్రను ధనుష్ తప్ప మరెవ్వరూ చేయలేరని చిరంజీవి చెప్పకొచ్చారు. అలాగే, ధనుష్ కు జాతీయ అవార్డులు అనేవి సర్వసాధారణం అయిపోయాయని మెగాస్టార్ అన్నారు. 'కుబేర'లోని అతని నటనకు జాతీయ అవార్డు వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ ఈ సినిమాకు జాతీయ అవార్డు రాకపోతే దానికి అర్థమే లేదని ఆయన వ్యాఖ్యానించారు.
'కంటెంట్ ఉంటే చాలు'
ఇక, 'కుబేర' దర్శకుడు శేఖర్ కమ్ములను చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి సినిమాలు రావాలని చిరంజీవి ఆకాక్షించారు. 'సినిమాలు విజయం సాధించడం, థియేటర్స్‌కు ప్రేక్షకులను మెప్పించడం గగనమవుతున్న రోజులివి. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని శేఖర్ నిరూపించారు. ఇలాంటి సినిమాలు చేయొచ్చన్న ధైర్యాన్ని 'కుబేర' ఇచ్చింది. రక్తపాతాలు, కొట్టుకోవడాలు, నరుక్కోవడాలు తప్పితే ఇలాంటి సినిమాలు సినిమాలు రావా? పదిరోజులు ఆగితే ఓటీటీలోకి సినిమా వచ్చేస్తుంది అన్న ఆలోచనలో ప్రేక్షకులు ఉండిపోతారా? ఏమైపోతుంది ఇండస్ట్రీ అనే అభద్రతా భావాన్ని ఈ సినిమా తొలగించింది. కంటెంట్ కొత్తగా ఉంటే, భావోద్వేగాలను టచ్ చేయగలిగితే ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి చూస్తారన్న భరోసా ఇచ్చావు' అని శేఖర్ కమ్ములను చిరంజీవి అభినందించారు.
నాగార్జున నిర్ణయం నాకు స్ఫూర్తి : చిరంజీవి
ఇక 'కుబేర'లో నాగార్జున పాత్రపై కూడా చిరంజీవి కామెంట్స్ చేశారు. ఇన్నాళ్లు హీరోగా సినిమాల చేసిన నాగ్, ఇప్పుడు కీలక పాత్రను పోషించడంపై చిరంజీవి అభినందించారు. అవసరమైతే తాను ఇలాంటి పాత్రలు చేస్తానని, దీనికి నాగార్జున తనకు స్ఫూర్తిగా నిలిచారని మెగాస్టార్ చెప్పుకొచ్చారు.
'రష్మిక ఇంటర్నేషనల్ క్రష్'
ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన రష్మికపై చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. రష్మిక మొదటి సినిమాకు కూడా తను గెస్ట్‌గా వచ్చానని, ఆమె చాలా ఎదిగిపోయిందన్నారు. రష్మిక ఇప్పుడు నేషనల్ క్రష్ కాదని, ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయిందన్నారు. రష్మికను చూస్తుంటే ఆమె కళ్లే తనను ఆకర్షిస్తాయన్నారు. ఆమె కళ్లలోకి అలా చూస్తూ ఉండిపోతానన్నారు. కళ్లతోనే రష్మిక హావభావాలను పలికిస్తుందన్నారు. ఈ సినిమాలో రష్మిక పాత్రను చూస్తే చూడాలని ఉంది సినిమాలో సౌందర్య కనిపించిందన్నారు.
Boss Timing 😂👌#Rashmika Nuvvu National Crush Kaadhu International Crush.
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) June 22, 2025
- #MegastarChiranjeevi at #Kuberaa success meet
pic.twitter.com/sJ9ZMLkiQF
1988లో శేఖర్ కమ్ములకు చిరంజీవి షేక్ హ్యాండ్
డైరెక్టర్ శేఖర్ కమ్ముల చిరంజీవికి పెద్ద ఫ్యాన్. 1988లో హైదరాబాద్ లో స్టేట్ రౌడీ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో శేఖర్ కమ్ముల ఈ సినిమా షూటింగ్‌కు వెళ్లారు. అయితే అక్కడ వందల మంది ఉన్నా శేఖర్ కమ్ములను పిలిచి చిరంజీవి షేక్ హ్యాండ్ ఇచ్చారట. ఆ క్షణం నుంచి తనలో సినిమా ఇండస్ట్రీకి రావాలన్న బీజాలు నాటుకున్నాయని శేఖర్ కమ్ముల తనకు చెప్పారని, ఇది తనలో ఎనలేని సంతోషాన్ని కలిగించిందని ఈ ఈవెంట్ లో చిరంజీవి పేర్కొన్నారు.
బ్లాక్‌బస్టర్ 'కుబేర'- OTTలోకి ఎన్ని రోజుల తర్వాత, ఎక్కడ వస్తుందంటే?
కుబేర రివ్యూ- నాగ్, ధనుష్ రూ. లక్ష కోట్ల డ్రామా- ప్రేక్షకులను మెప్పించిందా?