ETV Bharat / entertainment

బాక్సాఫీస్ వద్ద 'కుబేర' ర్యాంపేజ్- తొలి రోజే అదిరే వసూళ్లు - KUBERAA FIRST DAY COLLECTIONS

కుబేర కలెక్షన్ల జోరు​- తొలి రోజు వసూళ్లు ఎంతంటే?

Kuberaa First Day Collections
Kuberaa First Day Collections (Source: film poster)
author img

By ETV Bharat Telugu Team

Published : June 21, 2025 at 11:10 AM IST

2 Min Read

Kuberaa First Day Collections: టాలీవుడ్​ స్టార్​ హీరో నాగార్జున- తమిళ హీరో ధనుష్​ కాంబినేషన్​లో తెరకెక్కిన చిత్రం 'కుబేర'. ఈ సినిమాకి శేఖర్​ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ సినిమా భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా జూన్​ 20న థియేటర్లలో విడుదల అయ్యింది. అంచనాలకు తగ్గట్టే సూపర్ రెస్పాన్స్ అందుకొని, బ్లాక్​ బస్టర్​ హిట్​ కొట్టింది. దీంతో తొలి రోజే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించింది.

మొదటి రోజు ఈ భారీ కలెక్షన్స్​ను సాధించిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశవ్యాప్తంగా రూ. 13 కోట్ల నెట్​ వసూళ్లు సంపాదించింది. ఈ లెక్కన వరల్డ్​వైడ్ గ్రాస్ దాదాపు రెట్టింపు ఉండవచ్చు. తెలుగు రాష్ట్రాలతో పాటు అటు తమిళంలోనూ కుబేర డీసెంట్ ఆక్యూపెన్సీతో రన్ అవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో కుబేర జోరు : ఆంధ్ర ప్రదేశ్​ , తెలంగాణ రాష్ట్రాల్లో మొదటి రోజే 57.36 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నిండిపోయాయి. ఒక్క హైదరాబాద్​లోనే డే 1 ఓవరాల్​గా మీద 67% ఆక్యుపెన్సీని నమోదు చేసింది. నగరంలో 530 నైట్​ షోస్ పడ్డాయి. దీంతో థియేటర్​ ఆక్యుపెన్సీ 88 శాతానికి పెరిగింది. ఇక ఈ వీకెండ్ శని, అదివారం వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈజీగా రూ.100 కోట్ల మార్క్ దాటే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తన్నాయి.

ఓవర్సీస్​లోనూ కాసుల వర్షం : కుబేర సినిమా అమెరికా బాక్సాఫీస్​ వద్ద కూడా దూసుకుపోతోంది. తొలి రోజే వన్ మినియన్ మార్క్ దగ్గరలోకి వెళ్లింది. 9 లక్షల డాలర్ల గ్రాస్​తో థియెటర్లలలో కుబేర మోత మోగిస్తుంది. దీని జోరు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే సినిమాపై పాజిటివ్​ రెస్పాన్స్​ ఉండటంతో ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఓటీటీ, శాటిలైట్​ రైట్స్​ : కుబేర సినిమా శాటిలైట్​ రైట్స్​ను ప్రముఖ టీవీ ఛానల్​ స్టార్​ మా అందుకుంది. అలాగే సినిమా ఓటీటీ రైట్స్​ను అమెజాన్​ ప్రైమ్​ వీడియోస్​ సంపాదించుకుంది. బ్రాడ్​కాస్ట్​, ఓటీటీ హక్కులు దాదాపు రూ. 65 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తుంది.

కుబేర రివ్యూ- నాగ్, ధనుష్ రూ. లక్ష కోట్ల డ్రామా- ప్రేక్షకులను మెప్పించిందా?

'నా సినిమాలు అందుకే లేట్ అవుతాయ్' - కారణం చెప్పిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.