KGF Yash Mother : 'కేజీఎఫ్' సినిమాలతో పాన్ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ స్టార్ హీరో యశ్. అయితే యశ్ ఒక్కరే కాదు, ఆయన తల్లి పుష్ప కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే. ఆమె ఇటీవల నిర్మాతగా మారారు. PA (పుష్ప- అరుణ్ కుమార్) పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. ఈ బ్యానర్‌పై ఆమె తొలి ప్రాజెక్ట్‌గా 'కోథలవాడి' సినిమా నిర్మించారు. ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆమె యశ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'కోథలవాడి' సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. అనంతరం ప్రెస్మీట్లో పాల్గొన్న పుష్ప పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే 'యశ్‌తో మీరు సినిమా తీయాలనుకుంటే ఏ జానర్లో ఉంటుంది' అని ప్రశ్న అడిగారు. దీనికి పుష్ప ఇచ్చిన సమాధానం చప్పట్లు కొట్టించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె ఏమన్నారంటే?
'యశ్‌తో నేను సినిమా చెయ్యను. అతనికి ఇప్పుడు చాలా ఫేమ్ ఉంది. డబ్బులు కూడా ఉన్నాయి. అలా కాకుండా ప్రతిభ ఉండి, అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఛాన్స్ ఇస్తాం. ఎప్పుడైనా సరే మనం అన్నం ఉన్న వాడికి వడ్డించకూడదు. ఆకలితో ఉన్న వాడికే అన్నం ఇవ్వాలి. అప్పుడే వాళ్లకు అన్నం విలువ తెలుస్తుంది. అదే కడుపు నిండినోడికి అన్నం ఇస్తే, దాని వ్యాల్యూ తెలియదు. అందుకే మేం కొత్త వాళ్లకు అవకాశం ఇస్తాం' అని నిర్మాత పుష్ప రిప్లై ఇచ్చారు. దీంతో ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
నేను వాడితో సినిమా చేయను... అన్నం ఉన్న వాడికి అన్నం పెడితే ఆ విలువ తెలియదు - #Yash Mother Pushpa Garu Speech 👌 pic.twitter.com/L3AG7yPo03
— Rajesh Manne (@rajeshmanne1) May 21, 2025
అలాగే తాము తెలుగు ఇంత చక్కగా ఎలా మాట్లాడగలుగుతున్నారో కూడా చెప్పారు. ఆమెకు చిన్నప్పటి నుంచే తెలుగు తెలుసు అన్నారు. తమ ఇంటి చట్టుపక్కల తెలుగు వాళ్లు ఉండడం వల్ల ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ అయ్యిందని అన్నారు. అలాగే తమ కూతురిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించినట్లు యశ్ తల్లి పుష్ప పేర్కొన్నారు.
https://t.co/ItuC0g5IlJ pic.twitter.com/dpNVzziuSp
— Rajesh Manne (@rajeshmanne1) May 21, 2025
యశ్‌కు జోడీగా నయన్‌తార! - 'టాక్సిక్' టీమ్‌లోకి స్టార్ హీరోయిన్ ఎంట్రీ!
చిక్కుల్లో పడ్డ యశ్ మూవీ - 'టాక్సిక్' టీమ్‌కు షోకాజ్ నోటీసులు - ఎందుకంటే?