Sivanna 40 Years Cinema Industry: ఇండస్ట్రీలోకి వచ్చి 40 ఏళ్లను పూర్తి చేసుకున్నారు కన్నడ టాప్ హీరో శివరాజ్‌కుమార్. ఆ సందర్భంగా పలువురు హీరోలు శివన్నకు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. ఆయనతో ఉన్న అనుభంధాన్ని గుర్తుచేసుకున్నారు. మరెన్నో సినిమాలతో అలరించాలని కోరుకుంటున్నారు. ప్రముఖ హీరోలు కమల్‌హాసన్, నాగార్జున, చిరంజీవితోపాటు మరెందరో సినీనటులు అబినందించారు.
శివన్న నాకు సోదరుడు : "శివకుమార్ నాకు సోదరుడితో సమానం. అతను నా కుటుంబసభ్యుడే. శివన్న 40 ఏళ్ల కెరీర్ ఇంత త్వరగా ఎలా గడిచిందో ఆశ్చర్యంగా ఉంది. ముందు నాకు అభిమానిలా పరిచయం అయ్యి, ఇప్పుడు కన్నడాలో ఓ సూపర్ స్టార్‌గా గుర్తింపు సంపాదించారు. ఇందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆరోగ్యంగా, సంతోషంగా ఎల్లప్పుడు ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. మన మధ్య ఈ బంధం ఇలానే కొనసాగాలని కోరుకుంటుంన్నాను" అంటూ కమల్‌హాసన్ కన్నడలో విషెస్ చెప్పారు.
శివన్న తండ్రి నాకు తండ్రితో సమానం: మెగాస్టార్ చిరంజీవి శివన్నతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అభినందనలు తెలిపారు. "శివరాజ్ కుమార్ తండ్రి రాజ్‌కుమార్ కూడా నాకు తండ్రితో సమానులే. ఆయన నాపై ఎంతో ప్రేమ చూపించారు. శివన్న నటుడిగా, వ్యక్తిత్వంలోనూ గొప్ప మనిషే. వారంతా నా కుటుంబమే. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూనే ఆయన ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్నారు. కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన సినిమా ఫీల్డ్కి వచ్చి నలభై ఏళ్లు పూర్తచేసుకున్నారంటే నమ్మలేకపోతున్నాను. ఆయన ఇలాంటివే మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను" అంటూ పోస్ట్ చేశారు.
పెద్దిలో కీలకపాత్ర: కన్నడ చిత్రం ఆనంద్’తో కెరీర్ ప్రారంభించారు శివరాజ్ కుమార్. అనేక పాత్రలు చేస్తూ స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ హీరోగా రానున్న పెద్దిలో కీలకపాత్రలో కనిపించనున్నారు. ఆ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత గానో ఎదురుచూస్తున్నారు. ఆయన కెరీర్‌లో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండస్ట్రీలోని వారంతా అభినందిస్తూ పెట్టిన పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
'అఖండ 2' టీజర్ రికార్డ్స్- టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య !
విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ వాయిదా - రిలీజ్ డేట్ ఎప్పుడంటే!