ETV Bharat / entertainment

'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి' రివ్యూ- థియేటర్లలో కల్యాణ్​రామ్ 'మాస్ జాతర'! - ARJUN SON OF VYJAYANTHI

కల్యాణ్​రామ్ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమా రివ్యూ

Arjun Son Of Vyjayanthi
Arjun Son Of Vyjayanthi (Source : Film Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : April 18, 2025 at 3:13 PM IST

3 Min Read

Arjun Son Of Vyjayanthi Review : సినిమా : అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి; నటీనటులు: కల్యాణ్‌రామ్‌ నందమూరి, విజయశాంతి, సయీ మంజ్రేకర్‌, శ్రీకాంత్‌ తదితరులు; సినిమాటోగ్రఫీ: రామ్‌ ప్రసాద్‌; ఎడిటింగ్‌: తమ్మిరాజు; నిర్మాత: అశోక్‌ వర్థన్‌ ముప్పా, సునీల్‌ బలుసు; సంగీతం: అజనీశ్‌ లోకనాథ్‌; రచన, దర్శకత్వం: ప్రదీప్‌ చిలుకూరి; విడుదల: 18-04-2025.

స్టార్ హీరో క‌ల్యాణ్‌రామ్- ప్రదీప్‌ చిలుకూరి కాంబోలో తెరకెక్కిన సినిమా 'అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి'. సీనియర్ నటి విజ‌య‌శాంతి ఇందులో కీలక పాత్ర పోషించడం వల్ల సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వేస‌వి సంద‌ర్భంగా శుక్రవారం ఈ సినిమా థియేటర్లలో విడుద‌లైంది. త‌ల్లిగా విజ‌య‌శాంతి, కుమారుడిగా క‌ల్యాణ్‌రామ్ తమతమ పాత్ర‌ల్లో ఎలా నటించారు? సినిమా కథేంటి? ఈ కాంబో ప్రేక్ష‌కుల్ని ఏ మేర‌కు మెప్పించింది? తెలుసుకుందాం.

క‌థేంటంటే : వైజ‌యంతి (విజ‌య‌శాంతి) డ్యూటీ అస్సలు కాంప్రమైజ్ అవ్వని పోలీస్ ఆఫీసర్. త‌న కొడుకు అర్జున్ విశ్వ‌నాథ్ (క‌ల్యాణ్‌రామ్‌) కూడా త‌న‌లాగే IPL కావాల‌నేది ఆమె క‌ల. త‌ల్లి అంటే ఎంతో ప్రేమ చూపించే అర్జున్ కూడా ఆ ప్ర‌య‌త్నాల్లోనే ఉంటాడు. కానీ ఇంత‌లో తన తండ్రి మ‌ర‌ణించడం వల్ల అర్జున్ జీవితం మ‌లుపు తిరుగుతుంది. చేతుల‌కు సంకెళ్లు ప‌డ‌తాయి. ఆ త‌ర్వాత ప‌రిణామాలు అతడిని గ్యాంగ్‌స్ట‌ర్‌ను చేస్తాయి.

ఈ క్రమంలోనే అర్జున్‌ ప్రైవేట్ సైన్యంతో వైజాగ్‌ను శాసిస్తుంటాడు. తన క‌ల‌ల‌కి భిన్నంగా అర్జున్‌ జీవితం సాగ‌డం చూసి త‌ల్లి వైజ‌యంతి బాధ పడుతుంది. అలా ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెరుగుతుంది. ఇక ఉద్యోగానికి దూర‌మై, రిటైర్మెంట్ జీవితాన్ని గ‌డుపుతున్న వైజ‌యంతి ప్రాణాల‌కు ముప్పు ఉంటుంది. మరి వైజ‌యంతిని వెంటాడుతున్నది ఎవరు? ఆ విష‌యం తెలుసుకున్న అర్జున్ ఏం చేశాడు? త‌న త‌ల్లిని కాపాడ‌డం కోసం ఏం చేశాడు? అనేది తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే : 'క‌ర్తవ్యం' సినిమాలో విజయశాంతి పాత్రను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పటిరీ మ‌రిచిపోలేరు. ఆమెకే ఓ కొడుకు ఉండి, అతను క్రిమిన‌ల్ అయితే? చ‌ట్టానికి లోబడి ప‌నిచేసిన త‌ల్లికీ, చ‌ట్టాన్ని శాసించే శ‌క్తిగా ఎదిగిన కొడుకుకీ మ‌ధ్య సంఘ‌ర్షణే ఈ కథ. ట్రైల‌ర్​తోనే సినిమా క‌థపై ఓ అంచ‌నా వచ్చేసింది. త‌ల్లీ- కుమారుల మ‌ధ్య ఎమోషన్సే ఈ క‌థ‌కు ప్ర‌ధానం. ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కూ అదే అంశంపై దృష్టిపెట్ట‌డం వల్ల అనుకున్నట్టుగానే ఎమోషన్స్​ పండాయి. యాక్ష‌న్ సీన్స్​ సినిమాకి హైలైట్‌. కొత్త‌త‌రం సినిమాలకు అల‌వాటు ప‌డిన ప్రేక్ష‌కుల్ని ఈ సినిమా అంత‌గా మెప్పించ‌క‌పోయినా, మాస్ సినిమాలు ఇష్ట‌ప‌డేవాళ్ల‌కి, అభిమానులకు మాత్రం ఫుల్ మీల్సే. క‌థ‌, క‌థ‌నం రొటీన్ టెంప్లేట్‌తో సాగ‌డమే కాస్త ఇబ్బందిక‌రం.

త‌ల్లి- త‌న‌యుడి మ‌ధ్య అనుబంధం, ఆ త‌ర్వాత యాక్ష‌న్​తో కూడిన ఓపెనింగ్ సీన్స్​ ఆక‌ట్టుకుంటాయి. అవే ప్రేక్ష‌కుడిని సినిమాలో లీనం చేస్తాయి. అయితే ఆ త‌ర్వాత నుంచి సినిమా మామూలుగానే మారిపోతుంది. ప్రీ ఇంటర్వెల్​లో హీరో- విల‌న్‌కు మ‌ధ్య పైట్ సీన్​లో సెకండ్ హాఫ్​పై ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఆ ఆస‌క్తికి త‌గ్గ‌ట్టుగానే ఫ్లాష్‌బ్యాక్‌గా వ‌చ్చే సీన్స్​ సినిమాకు మెయిన్ ఆట్రాక్షన్. మ‌హంకాళి గ్యాంగ్ దురాగ‌తాలు, పైడిత‌ల్లిని అంతం చేసే ఎపిసోడ్‌, ఆ త‌ర్వాత కాల‌నీకి హీరో అండగా నిలిచి గ్యాంగ్‌స్ట‌ర్‌గా మారే తీరు సెకండ్ హాఫ్​లో హైలైట్. స్టోరీలో ట్విస్ట్​లు కూడా ఆక‌ట్టుకుంటాయి.

అయితే ఇవ‌న్నీ ఒకెత్తైతే, క్లైమాక్స్ సీన్స్ మ‌రో ఎత్తు.సగటు ప్రేక్ష‌కుడిని షాక్‌కి గురిచేస్తాయి. ఈ సినిమాలో కొత్త‌ద‌నం ఏదైనా ఉందంటే క్లైమాక్సే. ఇలాంటి త‌ర‌హా సీన్స్​ చేయ‌డానికి క‌ల్యాణ్‌రామ్ ఒప్పుకోవడం మెచ్చుకోద‌గ్గ విష‌యం. అద్భుతంగా ఎమోషన్స్​ పండ‌టానికి కారణం ఆ ఎపిసోడే. అయితే క‌థ‌, క‌థ‌నాల్ని న‌డిపించ‌డంలోనూ అలాంటి కొత్త‌త‌రం ఆలోచ‌న‌లు వాడి ఉంటే ఉంటే సినిమా ఇంకా హైలైట్​ అయ్యేది.

బ‌లాలు

  • క్లైమాక్స్ స‌న్నివేశాలు
  • యాక్షన్‌ సన్నివేశాలు
  • క‌ల్యాణ్‌రామ్- విజ‌య‌శాంతి న‌ట‌న

బ‌ల‌హీన‌త‌లు

  • కొత్త‌త‌నం లేని క‌థ‌, క‌థ‌నం

చివ‌రిగా: మాస్‌ మెచ్చే యాక్షన్‌. క్లాస్‌కు నచ్చే ఎమోషన్స్‌. 'అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి'

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే

అది చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయా- త్వరలో అభిమానుల్ని కలుస్తా: జూనియర్ ఎన్‌టీఆర్‌

'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి' ట్రైలర్ రిలీజ్- కల్యాణ్​రామ్ మాస్ యాక్షన్​ చూశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.