ETV Bharat / entertainment

ఎట్టకేలకు 'వార్ 2' రిలీజ్​పై క్లారిటీ- వచ్చేది అప్పుడే! - WAR 2 RELEASE

'వార్ 2'​ రిలీజ్​పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్- రిలీజ్ ఎప్పుడంటే?

WAR 2 Release Date
WAR 2 Release Date (Source : ETV Bharat, Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : March 16, 2025 at 5:01 PM IST

1 Min Read

WAR 2 Release Date : పాన్ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్​ మల్టీస్టారర్​ మూవీ 'వార్ 2'. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. యశ్​ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్​కు బ్రేక్ పడినట్లు, విడుదల మరింత ఆలస్యం కానున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. దీనిపై మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.

అయితే 'వార్ 2' రిలీజ్ డేట్​లో ఎలాంటి మార్పు లేదు. ముందుగా ఆనౌన్స్​ చేసినట్లుగానే ఈ ఏడాది ఆగస్టు 14న ఈ సినిమా థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ తమ స్ట్లైల్​లో ఓ వీడియో వదిలారు. 'వరల్డ్​వైడ్​గా బీభత్సం సృష్టించేందుకు మేం ఆగస్టు 14న వస్తున్నాం' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో వార్ 2 విడుదలపై ఓ క్లారిటీ వచ్చేసిందని తారక్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

కాగా, ఈ సినిమాను అయాన్‌ ముఖర్జీ పాన్‌ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఎన్టీఆర్- హృతిక్​పై ఓ పాట షూట్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ పలు షెడ్యూల్​లలో పాల్గొన్నారు. ఆయనపై పలు కీలక సన్నివేశల చిత్రీకరణ పూర్తయ్యింది. మరోవైపు హృతిక్ కూడా రెగ్యులర్ షూటింగ్​లో పాల్గొంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.