ETV Bharat / entertainment

'ఆ పని నేర్చుకునేందుకు ఎన్​టీఆర్​కు ఒక్క సెకను - నాకైతే 10 రోజులు' - Janhvi Kapoor Jr NTR

Janhvi Kapoor Praises Jr NTR : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తాజాగా తన కోస్టార్ జూనియర్​ ఎన్​టీఆర్​ను పొగడ్తలతో ముంచెత్తింది. అంతే కాకుండా తను నటిస్తున్న 'దేవర' షూటింగ్ అనుభవాలను పంచుకుంది. ఆ విశేషాలు మీ కోసం.

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 26, 2024, 9:37 AM IST

Janhvi Kapoor Jr NTR
Janhvi Kapoor Jr NTR (ETV Bharat)

Janhvi Kapoor Praises NTR : తన లేటెస్ట్ మూవీ ప్రమోషన్స్​లో భాగంగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తాజాగా టాలీవుడ్​తో పాటు తన కోస్టార్ ఎన్టీఆర్‌లపై ప్రశంసల జల్లును కురిపించింది. దీంతో పాటు 'దేవర' షూటింగ్ అనుభవాలను పంచుకుంది.

"తెలుగువారి పనితీరు నాకు ఎంతో ఇష్టం. వారు కళను అలాగే సినిమాను గౌరవిస్తారు. ఎంతో హుందాగా ప్రవర్తిస్తారు. కథపై నమ్మకంతోనే పనిచేస్తారు. ప్రస్తుతం నేను తెలుగులో 'దేవర' సినిమాలో చేస్తున్నాను. ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌ ఓ ఎనర్జిటిక్‌ హీరో. ఆయన రాక సెట్‌కే కళను తెస్తుంది. అందరూ ఎంతో ఉత్సాహంగా ఉంటారు. తాజాగా జరిగిన ఓ షెడ్యూల్‌లో మా ఇద్దరిపై స్పెషల్ సాంగ్​ను షూట్ చేశారు. ఆయన డ్యాన్స్‌ వేగాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆయన ఒక్క సెకనులో ఎటువంటి విషయాన్నైనా నేర్చుకోగలరు. అదే విషయాన్ని నేర్చుకోవడానికి నాకు కనీసం 10 రోజులైనా కావాల్సి ఉంటుంది. ఆయనతో పాటు మరో నెక్స్ట్​ సాంగ్ షూట్ ఉంటే దాని కోసం నేను ఇప్పటి నుంచే ప్రాక్టీస్‌ చేస్తున్నాను. డైరెక్టర్ కొరటాల శివ ఎప్పుడూ ఎంతో కూల్​గా ఉంటారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కు ఆయనే కెప్టెన్‌. ఎటువంటి విషమైనా ఆయన ఎంతో సున్నితంగా చెబుతుంటారు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని తల్లిదండ్రులు నేర్పారు. వాళ్లతో పాటు నా అభిమానులంతా గర్వపడేలా ఉంటాను. ప్రస్తుతం ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాను. నా రిలేషన్​షిప్​ గురించి రివీల్ చేసే టైమ్​ నాకు లేదు. ఆరోగ్యపరంగానూ నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటున్నాను" అని జాన్వీ చెప్పారు.

ఇక జాన్వీ కెరీర్ విషయానికి వస్తే, ఆమె నటించిన 'ఉలఝ్‌' మూవీ ఆగస్టు 2న విడుదల కానుంది. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జాన్వీ ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ ఆఫీసర్​గా కనిపించనున్నారు. ఇందులో రాజేశ్‌ థైలాంగ్‌, గుల్షన్‌ దేవయ్య లాంటి స్టార్స్ మరిన్ని కీలక పాత్రలు పోషించారు.

'అమితాబ్, హృతిక్ కాదు- తారక్​తోనే చేయాలని ఉంది!' - Janhvi Kapoor Jr Ntr

ఆస్పత్రి నుంచి జాన్వీ డిశ్చార్జ్- ఇప్పుడెలా ఉందంటే? - Janhvi Kapoor Discharged

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.