Anupama Parameswaran Boyfriend : యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌కు సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉంది. విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ యూత్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్గా 'డ్రాగన్' సినిమాలో కనిపించి సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నాలుగైదు సినిమాలతో బిజీగా గడిపేస్తుంది. ఈమెకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అయిపోతుంటుంది. తాజాగా మరో క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
కేరళ కుట్టి అనుపమ కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్‌తో లవ్‌లో పడినట్లు ప్రచారం సాగుతోంది. వీరిద్దరికి సంబంధించిన ఓ ప్రైవేట్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో అనుపమ- ధ్రువ్ ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. దీంతో వీరు పక్కా డేటింగ్‌లో ఉన్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు కూడా ఇది నిజమేనేమోనని అభిప్రాయపడుతున్నారు.
అయితే అనుపమ ప్రస్తుతం 'బైసన్' సినిమాలో నటిస్తోంది. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ధ్రువ్ విక్రమ్ హీరోగా నటిస్తున్నారు. అయితే సినిమాలో ధ్రువ్‌కు ప్రియురాలి పాత్రలో అనుపమ నటిస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫొటో బహుషా సినిమాకు సంబంధించినదే కావొచ్చని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ రూమర్స్‌పై ఈ ఇద్దరూ స్పందించలేదు.
#AnupamaParameswaran and #dhruvVikram daing pic.twitter.com/pJUzbIIv1i
— Tollywood news (@harika_reddy2) April 12, 2025
కాగా, కేరళకు చెందిన అనుపమ మలయాళ సినిమా 'ప్రేమమ్'తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో 'అ ఆ' తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం అనుపమ తెలుగులో 'పరదా' అనే సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు మలయాళం, తమిళ సినిమాల్లో కూడా నటిస్తోంది.
గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న టిల్లు స్వ్కేర్‌లో అనుపమ కీలక పాత్రలో నటించింది. అప్పటి వరకు స్క్రీన్‌పై కాస్త పద్ధతిగా కనిపించిన ఈ బ్యూటీ ఈ సినిమాలో బోల్డ్‌గా నటించింది. హద్దులు చెరిపేస్తూ రెచ్చిపోయింది. అటు సోషల్ మీడియాలోనూ అనుపమకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్ముడును ఇన్‌స్టాగ్రామ్‌లో 16.3 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు.
అనుపమ పరమేశ్వరన్ 'పరదా' టీజర్- ఇదేదో ఇంట్రెస్టింగ్ స్టోరీలా ఉందే!
ట్రాక్ మార్చిన టిల్లు బ్యూటీ - లేడీ ఓరియెంటడ్ మూవీస్‌కు సై - Anupama Parameswaran New Movie