Ilaiyaraaja Good Bad Ugly : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ నెల 10న రిలీజైన సినిమా మంచి టాక్ దక్కించుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌కు షాక్ తగిలింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మేకర్స్‌కు లీగల్ నోటీసులు పంపారు.
గతంలో ఆయన మ్యూజిక్ అందించిన మూడు పాటలను అనుమతి లేకుండా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలో వాడుకున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. అందుకుగానూ రూ.5 కోట్ల పరిహారం డిమాండ్ చేశారు. అంతేకాకుండా తక్షణమే సినిమా నుంచి ఆ పాటలను తొలగించి, క్షమాపణ చెప్పాలని కోరారు. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
గతంలోనూ ఇలాగే
కాగా, గతేడాది ఓ మలయాళ సినిమాకు కూడా ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారు. యుత్‌ఫుల్ హిట్‌గా నిలిచిన 'మంజుమ్మేల్ బాయ్స్' సినిమాలో వాడిన ఓ పాటకు సంబంధించి హక్కులు తనవేనని ఇళయరాజా క్లెయిమ్ చేసుకున్నారు. ఈ మేరకు రూ.2 కోట్లు పరిహారం డిమాండ్ చేశారు. అయితే ఈ వ్యవహారంలో మూవీమేకర్స్ రూ.60 లక్షలు చెల్లించినట్లు అప్పట్లో ప్రచారం సాగింది.
ఇక భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆరదణ లభిస్తోంది. రీసెంట్గా అక్కడ ఈ సినిమా వన్ మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరిపోయింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్ట్ చేశారు. కాగా, ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా ఇప్పటికే రూ.150 కోట్లు వసూలుచేసింది. తమిళనాడులోనే రూ.80 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఇదే వారంలోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరడం పక్కా అని ట్రేడర్స్ అంచనా వేస్తున్నారు.
ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించారు. అర్జున్ దాస్, యస్ జే సూర్య, శ్రీలీల, సునీల్, యోగిబాబు ఆయా పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, రవిశంకర్ నిర్మించారు.
జస్ట్ మిస్ - కారు ప్రమాదంలో అజిత్ సేఫ్! - నెలలో ఇది రెండోసారి
క్రేజీ డైరెక్టర్‌తో అజిత్ నెక్ట్స్ మూవీ- 'AK64' వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్!