ETV Bharat / entertainment

ఒక్కటైన సిద్ధార్థ్‌, అదితి - పెళ్లి ఫొటోలు వైరల్‌ - Siddharth Aditi Rao Hydari Marriage

Siddharth Aditi Rao Hydari Marriage: నటుడు సిద్ధార్థ్‌, నటి అదితిరావు హైదరీ తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వనపర్తిలోని దేవాలయంలో వివాహం జరిగింది.

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2024, 12:36 PM IST

Siddharth Aditi Marriage
Siddharth Aditi Marriage (Source: IANS)

Siddharth Aditi Rao Hydari Marriage : హీరో సిద్దార్థ్- బ్యూటీ అదితి రావు హైదరీ తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వనపర్తిలోని దేవాలయంలో ఇరు కుటుంబాల సమక్షంలో వీరి వివాహ వేడుక జరిగింది. ఈ తంతును సింపుల్‌గా పూర్తి చేసేశారు. ఈ విషయాన్ని అదితి, సిద్దార్థ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

'మన ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా ఉండేందుకు, చిరునవ్వులు చిందించేందుకు, ఎప్పటికీ తరిగిపోకుండా ఉండేందుకు నువ్వే నా సూర్యుడు, నా చంద్రుడు, నా నక్షత్రాలన్నీ. నీ కోసమే నా నిత్యనూతనమైన ప్రేమ, వెలుగు, మ్యాజిక్' అంటూ పోస్ట్​కు క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ క్రమంలో కొత్త జంటకు సెలబ్రిటీలు, ఫ్యాన్స్​ శుభాకాంక్షలు చెబుతున్నారు.

చాలా కాలం పాటు డేటింగ్​లో ఉన్న ఈ జంట ఆరు నెలల కిందట నిశ్చితార్థం చేసుకుంది. 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయంలో సింపుల్​గా పెళ్లి చేసుకున్నారు. ఈ ప్రదేశానికి అదితికి ఒక లింక్ ఉంది. ఒకప్పటి వనపర్తి జాగీర్ చివరి రాజా రామేశ్వర రావు మనువరాలే అదితి. వాస్తవానికి ఎంగేజ్మెంట్ సమయంలోనే పెళ్లి అయిపోయిందంటూ ప్రచారాలు జరిగాయి కూడా. వాటికి క్లారిటీ ఇస్తూ చేతికి ఉన్న రింగ్‌తో కేవలం నిశ్చితార్థం మాత్రమే అయిందని చెప్పింది.

అలా మొదలైంది
2021లో జరిగిన 'మహా సముద్రం' సినిమా షూటింగ్​లో వీరి పరిచయం అయిందట. రెండున్నరేళ్ల పాటు రిలేషన్ తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ గ్యాప్​లో మీడియా కంటపడినా కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇక రెండున్నరేళ్ల తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యార. అయితే అదితికి ఇది రెండో పెళ్లి కాగా, సిద్దార్థ్‌కు కూడా రెండో పెళ్లే.

స్కూల్​లో ప్రపోజల్
'హైదరాబాద్‌లోని మా నాన్నమ్మ ప్రారంభించిన స్కూల్లో నాకు ప్రపోజ్ చేసి మనసు గెలుచుకున్నాడు. ఒకరోజు అక్కడికి తీసుకెళ్లమని అడిగాడు. ఆ తర్వాత మోకాళ్లపై కూర్చొని నాకు ప్రపోజ్ చేశాడు. మా నాన్నమ్మ ఆశీస్సులు మాకు ఉండాలనే అలా చేశానని తర్వాత చెప్పాడు' అని అదితి సిద్ధార్ధ్ ప్రపోజల్ గురించి గతంలో చెప్పింది.

తన వల్లే ప్రేమపై నమ్మకం కలిగింది : అదితి - Aditi Siddharth Engagement

'మా అమ్మ వల్లే దాని గురించి చెప్పాల్సి వచ్చింది' - అసలు నిజం చెప్పిన అదితి - Aditi Rao Hydari Engagement

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.