Nani HIT 3 : 'పెళ్లికి ముందు ఓ అమ్మాయిని కలిసేందుకు వైజాగ్ వచ్చేవాడిని' అంటూ నేచురల్ స్టార్ నాని తన పర్సనల్ సీక్రెట్ బయటపెట్టారు. ఆయన లీడ్ రోల్లో దర్శకుడు శైలేష్ కొలను తెరెకెక్కించిన 'హిట్- 3' సినిమా ట్రైలర్ సోమవారం రిలీజైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ విశాఖపట్టణం నగరంలో ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాని సినిమాతో పాటు పలు విషయాలు షేర్ చేసుకున్నారు.
15 ఏళ్ల క్రితం వైజాగ్‌లో తిరిగిన విషయాల్ని నాని గుర్తుచేసుకున్నారు. 'నా పెళ్లికి ముందు దాదాపు 15ఏళ్ల కిందట ఇక్కడికి ఓ అమ్మాయిని కలవడానికి వచ్చేవాడని. తర్వాత ఆ ఆమ్మాయినే పెళ్లి చేసుకున్నాను. నాకు వైజాగ్‌తో స్పెషల్ బాండ్ ఏర్పడింది. అప్పుడైనా, ఇప్పుడైనా వైజాగ్‌కు వచ్చింది ప్రేమ కోసమే. వేరే ఎక్కడికి వెళ్లినా నన్ను వాళ్లు అన్న లేదా తమ్ముడిలా చూస్తారు. కానీ, వైజాగ్ వచ్చినప్పుడు మాత్రం అల్లుడిలాగే చూస్తారు' అంటూ నాని తన భార్య గురించి, వైజాగ్‌తో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు.
ఇక ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నాని ధీమా వ్యక్తం చేశారు. కొత్త ప్రయత్నాలు చేసిన ప్రతీసారి తెలుగు ప్రేక్షకులు ఆదిరించారని నాని అన్నారు. 'హిట్- 3 అనేది కొత్త జానర్. ఇందులో మనకు అలవాటు లేని కొత్త టోన్ ఉంటుంది. కొత్త ప్రయత్నాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారనడానికి వంద ఉదాహరణలు ఉన్నాయి. ఈ మే 1న మీరు, నేను మనమంతా గెలుస్తామన్న నమ్మకం ఉంది' అని నాని అన్నారు.
కాగా, ఈ సినిమా ఫుల్ వైలెంట్ యాక్షన్‌గా ఉండనుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. నాని ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సాను జాన్ వర్ఘీస్ ఛాయాగ్రహణం బాధ్యతలు చూస్తున్నారు. ఇక యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని రూపొందిస్తున్నారు
'అబ్ కీ బార్ అర్జున్ సర్కార్'- ఫుల్ వైలెంట్‌గా నాని 'హిట్' ట్రైలర్