Hari Hara Veeramallu Movie Postponed : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. జ్యోతికృష్ణ, క్రిష్ దర్శకత్వం వహించగా, ఎ.ఎం.రత్నం నిర్మించారు. ఇప్పటికే సినిమా చాలాసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. జూన్ 12న మూవీ విడుదల అవుతుందని మేకర్స్ అఫీషియల్‌గా ఇప్పటికే ప్రకటించారు. సినిమా విడుదల గురించి జరుగుతున్న ప్రచారాలు, పెరుగుతున్న ఊహాగానాలు నేపథ్యంలో నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
పవన్ కల్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా దీనిని రూపోందించాలని మేకర్స్ అనుకుంటున్నారు. సినిమా వాయిదా వేయడం కష్టంగా ఉన్నా దానిని ఎడిటింగ్ చేయాలని కృషి చేస్తున్నారు. అన్ని సిద్ధమైతే జూన్ 12న విడుదల కావాల్సి ఉంది. కాని వివిధ కారణాల వల్ల రిలీజ్ డేట్‌ను పొడిగించారని మేకర్స్ అంటున్నారు. ప్రతి ఫ్రేమ్‌ను జాగ్రత్తగా పరిశీలించి తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఇందుకోసం వారికి కొంత సమయం పడుతుందని, అందుకే మూవీ ఆలస్యం అవుతుందని అన్నారు.
"హరి హర వీరమల్లు చిత్రం ఒక అద్భుతమైన ప్రయాణం. వందలాది మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు కలిసి వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి 24 గంటలూ తమ శక్తికి మించి కృషి చేస్తున్నారు." అని మేకర్స్ తెలిపారు. ఓపికతో సినిమా పై ఉన్న నమ్మకంతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఇందరికి మంచి అవుట్‌పుట్‌ను అందించే ప్రయత్నాలు చేస్తునట్లు చెప్పారు. చిత్రం పై వచ్చే వార్తలను నమ్మవద్దని అన్నారు. సినిమాకి సంబంధించిన సమాచారాన్ని మూవీమేకర్స్ అఫిషియల్‌గా అందిస్తుందని తెలియజేశారు. అలానే ట్రైలర్‌ను విడుదల చేస్తామని, దానితో పాటే సినిమా వచ్చే తేదీని ప్రకటిస్తామని మేకర్స్ అన్నారు. కొత్త విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. దీని కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
హిస్టారికల్ యాక్షన్ మూవీగా ఈ సినిమా సిద్ధమవుతోంది. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో కథ సాగుతుంది. కీరవాణి మ్యూజిక్ అందించారు.రెండు భాగాల్లో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. జ్ఞాన శేఖర్ వి.ఎస్, మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్.ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.