ETV Bharat / entertainment

'హరిహర వీరమల్లు' గ్లోబల్ లెవెల్​ ప్రమోషన్స్- బుర్జ్ ఖలీఫాపై ట్రైలర్ రిలీజ్​! - HARI HARA VEERA MALLU

'హరిహర వీరమల్లు' ఇంటర్నేషనల్ లెవెల్​లో ప్రమోషన్స్ - మేకర్స్ భారీ ప్లాన్స్!

Hari Hara Veera Mallu
Hari Hara Veera Mallu (Source : Film Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : May 18, 2025 at 8:25 AM IST

2 Min Read

Hari Hara Veera Mallu Trailer : పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌- జ్యోతికృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'హరిహర వీరమల్లు'. ఈ చిత్రం పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ జానర్​లో రెండు భాగాలుగా రూపొందుతోంది. రీసెంట్​గా మేకర్స్​ తొలి పార్ట్ 'హరిహర వీరమల్లు పార్ట్‌- 1 : స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌' విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. జూన్ 12న ఈ సినిమా గ్రాండ్​గా రిలీజ్ కానున్నట్లు తెలిపారు. తాజాగా సినిమాకు సంబంధించి మరో క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమా షూటింగ్ రీసెంట్​గా కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం మూవీటీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బీజీగా ఉంది. దీంతో మేకర్స్​ ప్రమోషన్స్​ షురూ చేసే ప్లాన్​లో ఉన్నారు. గ్లోబల్​ లెవెల్​లో సినిమాకు బజ్ తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే భారీ స్థాయిలో ప్రమోషన్స్​ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రైలర్​ను కాస్త డిఫరెంట్​గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దుబాయ్ ప్రతిష్ఠాత్మక బుర్జ్ ఖలీఫా బిల్డింగ్​పై హరిహర వీరమల్లు ట్రైలర్​ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన బిల్డింగ్ కావడం విశేషం.

తొలి తెలుగు సినిమాగా
అయితే ఇన్నేళ్ల టాలీవుడ్ చరిత్రలో ​దుబాయ్ బుర్జ్ ఖలీఫా బిల్డింగ్​పై తెలుగు సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు. ప్రచారం సాగుతున్నట్లు హరిహరి వీరమల్లు ట్రైలర్ బుర్జ్ ఖలీఫాపై విడుదల చేస్తే, అక్కడ రిలీజైన తొలి తెలుగు సినిమాగా ఇది రికార్డ్ సృష్టించనుంది. ఇదివరుకు బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్ 'జవాన్' సినిమా ట్రైలర్​ను బుర్జ్ ఖలీఫాపై రిలీజ్ చేశారు.

కాగా, సినిమాలో నిధి అగర్వాల్‌ కీలక పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్స్​ అనుపమ్‌ ఖేర్‌, బాబీ దేవోల్‌, నోరాహి ఫతేహి, విక్రమ్‌ జీత్‌, జిషుసేన్‌ గుప్త తదితరులు సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పాల్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలు షూట్‌ చేశారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్​ గ్రహీత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఏ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌ రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

గెట్​రెడీ PK ఫ్యాన్స్- 'హరిహర వీరమల్లు' నయా రిలీజ్ డేట్ అనౌన్స్​

పవన్​ ఫ్యాన్స్​కు క్రేజీ అప్డేట్- చిన్న​ గ్యాప్​లోనే రెండు సినిమాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.