ETV Bharat / entertainment

'ఈసారి గురి తప్పేదిలేదు'- వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ప్రకటన! - HARI HARA VEERA MALLU RELEASE DATE

ఈసారి గురి తప్పేదిలేదు'- వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ప్రకటన

Hair Hara Veera Malliu
Hair Hara Veera Malliu (Source: film poster)
author img

By ETV Bharat Telugu Team

Published : June 21, 2025 at 9:22 AM IST

2 Min Read

Hari Hara Veera Mallu Release Date: పవర్​ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. జ్యోతికృష్ణ, క్రిష్‌ దర్శకత్వం వహించగా, ఎ.ఎం.రత్నం నిర్మించారు. తాజాగా మేకర్స్​ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా జూలై 24 వరల్డ్​వైడ్​గా గ్రాండ్ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. అయితే ఈ సినిమా ఈ నెల 12 న రీలీజ్​ అవ్వాల్సి ఉండగా, పోస్ట్​ ప్రొడక్షన్​ పనుల కారణంగా మళ్లీ వాయిదా పడింది. పలు మార్లు వాయిదా పడుతూ వస్తున్న సినిమాను మేకర్స్​ ఎట్టకేలకు జూలై 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్​ చేయనున్నారు.

వీరమల్లు ఆగమనం తథ్యం: ఈ మేరకు ఓ కోత్త పోస్టర్ కూడాషేర్ చేశారు. 'ఈసారి గురి తప్పేదిలేదు- జూలై 24 వీరమల్లు ఆగమనం తథ్యం' అంటూ పవర్​ఫుల్ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ పోస్టర్​లో హరిహర వీరమల్లుగా పవన్​, మొఘల్​ రాజుగా బాబీ దేవోల్​ కనిపిస్తున్నారు. ఈ పోస్ట్​లో ఫ్యాన్స్​కు రిలీజ్​పై భరోసా ఇచ్చేలా పవర్​ఫుల్ లైన్ రాసుకు రావడం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇది చూసిన ఫ్యాన్స్​ ఇంకా ఈ సినిమా విడుదలకి తిరుగే ఉండదని నమ్ముతు కమెంట్స్​లో 'వీ ఆర్​ వేయిటింగ్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ చిత్రం ధర్మం కోసం యుద్ధం అనే నేపథ్యంలో తెరకెక్కనుంది. మంచి హిస్టారికల్​ బ్యాగ్రౌండ్​లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక త్వరలోనే ట్రైలర్ విడుదల చేసి, ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు. పలు మార్లు సినిమా వాయిదా పడినా, ప్రతీసారీ సినిమాపై అంచనాలు పెరుగూతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదు.

హిస్టారికల్‌ యాక్షన్‌ మూవీగా ఈ సినిమా సిద్ధమవుతోంది. నిధి అగర్వాల్‌ హీరోయిన్​గా నటిస్తున్నారు. మొఘల్‌ సామ్రాజ్యం నేపథ్యంలో కథ సాగుతుంది. కీరవాణి మ్యూజిక్​ అందించారు. రెండు భాగాల్లో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తొలి భాగం 'స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో రానుంది. జ్ఞాన శేఖర్ వి.ఎస్, మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్.ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

'సీజ్​ ది షిప్' లెవల్​లో సీన్స్- రూ.250 కోట్ల బడ్జెట్: వీరమల్లు డైరెక్టర్

'హరిహర వీరమల్లు' మరోసారి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.