సినిమాల్లోకి రాకముందు మీనాక్షి చౌదరి అలాంటి పనులు చేసిందా!?

author img

By ETV Bharat Telugu Desk

Published : Feb 13, 2024, 10:37 AM IST

సినిమాల్లోకి రాకముందు మీనాక్షి చౌదరి అలాంటి పనులు చేసిందా!?

Guntur Kaaram Meenakshi Choudhary : మీనాక్షి చౌదరి ప్రస్తుతం ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. అందంగా కనిపిస్తూ, చక్కటి అభినయంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్​ను పెంచుకుంది. అయితే సినిమాల్లోకిి రాక ముందు ఏం చేసేదో తెలుసా?

Guntur Kaaram Meenakshi Choudhary : మీనాక్షి చౌదరి ప్రస్తుతం ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. రీసెంట్​గా సంక్రాంతి కానుకగా విడుదలైన సూపర్ స్టార్​ మహేశ్​ బాబు గుంటూరు కారం చిత్రంలో అందంగా కనిపిస్తూ, చక్కటి అభినయం కనబర్చింది. అయితే ఆమెకు అసలు ఏమాత్రం ప్రాముఖ్యత లేని పాత్ర ఇవ్వడం వల్ల దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్​పై అభిమానులు, ప్రేక్షకులు కాస్త విమర్శించారు. అయితే మీనాక్షి చౌదరి సినిమాల్లోకిి రాక ముందు ఏం చేసేదో తెలుసా?

వివరాల్లోకి వెళితే. సాధారణంగా ప్రేక్షకులకు తెలిసినంత వరకు మీనాక్షి చౌదరి మోడల్ నుంచి నటిగా మారింది. 2018లో ఫెమినా మిస్ ఇండియాగానూ ఎంపికైంది. ఆ తర్వాత రవితేజ సరసన ఖిలాడి సినిమాలో నటించి ఆకట్టుకుంది. అనంతరం యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రల్లో నటించిన హిట్ 2 చిత్రంతో తొలి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విజయం సాధించడంతో మీనాక్షి చౌదరికి మంచి పాపులారిటీ వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఆమె అందానికి అందరూ బాగా ఫిదా అయిపోయారు.

ఈ సినిమా తర్వాత మీనాక్షికి మంచి అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా గుంటూరు కారం మహేశ్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది. దీంతో ఆమె పేరు మరింత పాపులర్ అయింది. కానీ సినిమాలో ఆమె పాత్రకు ఎక్కువ స్కోప్​ లేకుండటం వల్ల ఫ్యాన్స్ కాస్త ఫీలయ్యారు. దీని తర్వాత మరో రెండు సినిమాలకు కూడా సైన్ చేసింది. అందులో ఒకటి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమా అని కూడా అన్నారు.

అయితే ఆ మధ్యలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి చౌదరి తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడింది. తాను ఒక సర్టిఫైడ్ డెంటిస్ట్ అని చెప్పింది. నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్​లో డెంటల్ కోర్స్​ను పూర్తి చేసినట్లు చెప్పింది. అంతే కాదు స్టేట్ లెవెల్​లో జరిగిన స్విమ్మింగ్ కాంపిటీషన్​లోనూ ఛాంపియన్​గా నిలిచినట్లు చెప్పుకొచ్చింది. అలానే స్టేట్ లెవెల్​లో బ్యాడ్మింటన్ ప్లేయర్​గా రాణించినట్లుగా కూడా చెప్పింది.

OTTలో భయపెట్టేందుకు మరో తెలుగు హారర్ మూవీ రెడీ - చూసే సాహసం చేయగలరా?

9 రోజుల క్రితం మిస్సింగ్ - నది ఒడ్డున శవమై తేలిన ప్రముఖ దర్శకుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.