ETV Bharat / entertainment

బోరింగ్​గా అనిపిస్తోందా! ఫీల్​ గుడ్ సినిమాలు చూడాలనుకుంటున్నారా ? అయితే వీటిని డోన్​ట్​ మిస్! - Classic Movies In OTT

Classic Movies In OTT : ఈ వీకెండ్​లో మీకు సినిమా చూసే ప్లాన్ ఉందా? ఇంట్లోనే రిలాక్స్​డ్​గా చూడాలనుకుంటున్నారా? ఎమోషనల్ రోల్​కోస్టర్​లో వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ క్లాసిక్ సినిమాలను ఓ లుక్కేయండి.

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2024, 1:57 PM IST

Classic Movies In OTT
Classic Movies In OTT (Getty Images)

Classic Movies In OTT : వీకెండ్ వస్తే చాలు మనలో చాలామంది తమ ప్లాన్స్​లో ఒక్కటైనా సినిమా చూడాలని అనుకుంటాం. కొందరేమో థియేటర్లలకు వెళ్లి చూస్తే, మరికొందరేమో ఇంట్లోనే రిలాక్స్​డ్ మోడ్​లో చూసి ఎంజాయ్ చేస్తారు. మరి ఈ సారి హౌస్​ పా అయితే ఈ సారి మీ లిస్ట్​లో ఈ సినిమాలను యాడ్ చేసేయండి.

బర్ఫీ (నెట్​ఫ్లిక్స్, యూట్యూబ్​)
నటీనటులు : ప్రియాంక చోప్రా, ఇలియానా, రణ్​బీర్​ కపూర్

హద్దుల్లేని ప్రేమను, దేనినైనా సమ్మతించే గుణాన్ని, ఇద్దరి మధ్యనున్న మాటల్లో చెప్పలేని బంధాన్ని ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. బర్ఫీ జాన్సన్ (రణ్​బీర్) చుట్టూనే ఈ కథ తిరుగుతుంటుంది. పుట్టుకతోనే మూగ, చెవిటి అయిన బర్ఫీ వెళ్లిన ప్రతి చోటా తన బాధలేమీ కనపడనీయకుండా సంతోషాన్నే పంచుతుంటాడు. జిల్​మిల్ అనే మానసిక ఎదుగుదల లేని ప్రియాంక చోప్రా అతడికి పరిచయమవుతుంది. అక్కడితో కథ మారిపోతుంది. ఆ ఇద్దరి ప్రయాణం ఎలా సాగిందనేదే ఈ చిత్రం. ఎంతో ఎమోషనల్​గా సాగే ఈ చిత్రం సినీ ప్రియులను అలరించింది.

ఓకే జాను ( అమెజాన్ ప్రైమ్​, నెట్​ఫ్లిక్స్)
నటీనటులు : ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్

తెలుగులో వచ్చిన 'ఓకే బంగారం', తమిళంలోని 'కాదల్ కన్మనీ' సినిమాలకు రీమేక్ ఈ 'ఓకే జాను'. ముంబయిలోని ఓ ప్రముఖ గేమింగ్ కంపెనీలో పనిచేసే ఆది (ఆదిత్య రాయ్ కపూర్), తారా (శ్రద్దా కపూర్)ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ, వాళ్ల కమిట్ అయి ఉన్న కెరీర్స్ కోసం ఎలా కష్టపడ్డారనేది ఇందులో చూపిస్తారు. మోడ్రన్ డే రిలేషన్‌షిప్స్‌లో ఉన్న సందిగ్ధాలను, కెమిస్ట్రీని చక్కగా కనబరిచారు.

డియర్ జిందగీ (నెట్​ఫ్లిక్స్)
నటీనటులు : ఆలియా భట్, షారుక్​​ ఖాన్

మెంటల్ హెల్త్, ఎమోషనల్ రిలీఫ్ కావాలనుకునే వారు తప్పక చూడాల్సిన సినిమా ఇది. ఇందులో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసే (కైరా) అలియా భట్ ఒకానొక దశలో తీవ్రమైన మనో వేదనకు గురవుతుంది. ఆ సమయంలోనే డాక్టర్ జెహంగీర్ 'జగ్' ఖాన్ (షారుక్​ ఖాన్)ను కలుస్తుంది. ఆమెలో ఉన్న భయాలన్నింటినీ పోగొట్టి, తిరిగి యథాస్థానానికి ఎలా తీసుకొచ్చాడనేది కథాంశం.

లైఫ్ ఇన్ ఏ మెట్రో (నెట్​ఫ్లిక్స్)

నటీనటులు : ధర్మేంద్ర, ఇర్ఫాన్ ఖాన్, కొంకణ సేన్ శర్మ, శిల్పా శెట్టి, కంగనా రనౌత్

ముంబయిలోని ఒక మెట్రోలో పలువురు వ్యక్తులు ప్రేమ, కెరీర్, రిలేషన్‌షిప్స్ గురించి ఎలా అవస్థలు పడ్డారనేది కథ. వీరంతా ఒకరితో ఒకరు ఎలా కనెక్ట్ అయ్యారనే దాన్ని చక్కటి స్క్రీన్ ప్లేతో చూపించారు.

తమాషా (నెట్​ఫ్లిక్స్)
నటీనటులు : రణబీర్ కపూర్, దీపికా పదుకొణె

సమాజపు పరిస్థితులకు లోబడి తనను తాను కోల్పోతాడు హీరో వేద్ (రణబీర్). ఒక ట్రిప్‌లో పరిచయమైన తారా (దీపికా) అతని ప్రేమిస్తుంది. కొన్నేళ్ల తర్వాత కలిసిన హీరో తాను ఎంతలా మారిపోయాడనేది చెబుతుంది. అప్పుడు సెల్ఫ్ రియలైజ్ అయిన వేద్ ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడ్డాడనేది చూసే వాళ్లకు కూడా ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తుంది.

వేక్ అప్ సిద్ (నెట్​ఫ్లిక్స్)
నటీనటులు : రణబీర్ కపూర్, కొంకన సేన్ శర్మ

బాధ్యత లేకుండా తిరిగే వ్యక్తి సిద్ (రణ్​బీర్)కి రైటర్ ఐషా (కొంకన) పరిచయమవుతుంది. బాధ్యతగా ఎందుకు ఉండాలి, మెచ్యురిటీతో ఎలా బతకాలి. పర్సనల్ గ్రోత్, జీవితం మధ్యలో ఆగిపోతే ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలనేది చక్కగా చూపించారు డైరక్టర్.

దిల్ దఢక్​నే దో (నెట్​ఫ్లిక్స్)
నటీనటులు : అనిల్ కపూర్, ప్రియాంక చోప్రా, రణ్​వీర్ సింగ్, షెఫాలీ షా

ఒక కుటుంబంలో ప్రేమ, స్వేచ్ఛ, బాంధవ్య విలువలు తిరిగి తీసుకొచ్చే సినిమా ఇది. యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునేందుకు మెహ్రా కుటుంబం ఒక షిప్​లో బయటకు వెళుతుంది. అలా వారి మధ్య ప్రేమ, భావోద్వేగాలు ఎలా బయటపడ్డాయనేది కథాంశం.

ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలా? - OTTలో ఈ 7 సినిమాలు బెస్ట్ ఆప్షన్ ! - Top Family Movies In OTT

రిలాక్స్ మోడ్​లోకి వెళ్లాలా? ఈ సినిమాలు చూస్తే మీ ఒత్తిడంతా ఉఫ్​! - Stress Buster Movies

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.