Lagaan Movie Climax Scene 10000 Artists : దాదాపుగా చాలా సినిమాల్లో క్లైమాక్స్ అంటే హీరోహీరోయిన్, విలన్ లేదా చుట్టూ ఓ పది మంది లేదో ఇంకాస్త ఎక్కువ మంది ఉంటారు. కానీ ఓ సినిమా క్లైమాక్స్ సీన్ కోసం ఏకంగా 10,000 మంది నటించారు. అవును మీరు చదివింది నిజం. వాస్తవానికి షూటింగ్ సమయంలో అంత మందిని మేనేజ్ చేయడం అంత ఈజీ మాత్రం కాదు. కానీ అలాంటి సందర్భాలన్నింటినీ దాటుకుంది వచ్చిన ఓ సినిమా ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయింది.
అదే 'లగాన్' సినిమా. బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన అమీర్ ఖాన్ నటించిన సినిమానే 'లగాన్'. అశుతోష్ గోవారికర్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదలై 20 ఏళ్లు అయినా ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేదు. ఎందుకంటే అప్పట్లో విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుని ఆల్ టైం ఫేవరేట్ మూవీగా నిలిచింది.
ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్స్ అవార్డుకు కూడా నామినేట్ అయింది. అందుకు కారణం సినిమా క్లేమాక్స్ సీనే. ఈ సన్నివేశంలో గ్రామస్థులకు, బ్రిటీషర్లకు మధ్య క్రికెట్ ఎంతో ఉత్కంఠగా జరుగుతుంది. సీన్‌లో చాలామంది గ్రామస్థుల్లా కనపడాల్సి ఉంటుంది. దీని కోసం దగ్గర్లో ఉన్న నగరాల నుంచి, వేరు వేరు ఊర్ల నుంచి మొత్తం 10వేల మందిని సెట్‌కు తీసుకొచ్చింది చిత్ర యూనిట్.
ఈ 10వేల మందికి డ్రెస్సింగ్‌తో పాటు ఆహారం ఏర్పాటు చేసే విషయంలో మూవీటీమ్ చాలా కష్టపడ్డాల్సి వచ్చిందట. అలా షూటింగ్ కోసం వచ్చిన వారిని ఎంటర్‌టైన్ చేసేందుకు ఒకానొక సందర్భంలో హీరో అమీర్ ఖాన్ "ఆతీ క్యా ఖండాలా" అంటూ పాట కూడా పాడారట. అది విని వారంతా కేరింతలు కొడుతుంటే ఆ సీన్‌ను షూట్ చేసి క్లైమాక్స్‌లో వాడేశారట.
ఏదేమైనా సెట్లో ఇంతమందిని కంట్రోల్ చేసేందుకు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవట. కాబట్టే అనుకున్న ప్రతి షాట్‌ను కచ్చితంగా సమయానికి పూర్తి చేయగలిగారు. ఇక ఈ సినిమా విడుదల అయ్యే సమయానికి సన్నీ దేఓల్ నటించిన గదర్: ఏక్ ప్రేమ్ కథ కూడా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సంపాదించింది. అలా 2001 జూన్ 15న రిలీజైన ఈ రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధించాయి.
ఆ ఒక్క సీన్‌ను మూడేళ్ల పాటు షూట్ చేశారట! - ఏ సినిమా కోసం అంటే? - Amitabh Bachchan Sholay Movie