ETV Bharat / entertainment

'స్పిరిట్​' షూటింగ్​కు ముహూర్తం ఫిక్స్!- ప్రభాస్​కు సందీప్​రెడ్డి స్పెషల్ రిక్వెస్ట్

ప్రభాస్​ స్పిరిట్​ సినిమా క్రేజీ అప్డేట్ - షూటింగ్ ఎప్పుడో చెప్పేసిన నిర్మాత

Prabhas Spirit Shooting
Prabhas Spirit Shooting (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : July 4, 2025 at 3:00 PM IST

2 Min Read
Choose ETV Bharat

Prabhas Spirit Shooting Update : రెబల్​స్టార్ ప్రభాస్ అప్​కమింగ్ మూవీస్​లో ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్​ల్లో 'స్పిరిట్' ఒకటి. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్​రెడ్డి వంగ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు కొనసాగుతున్నాయి. ఇటీవల సినిమాలో హీరోయిన్​ను కన్ఫార్మ్ చేసేశారు. ఇక షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? మేకర్స్​ సినిమా అప్డేట్స్​ ఎప్పుడెప్పుడు ఇస్తారా అని వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో షూటింగ్​ గురించి సాలిడ్ అప్డేట్ వచ్చింది.

ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ గురించి సందీప్​రెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి అప్డేట్ ఇచ్చారు. ఆయన ఇటీవల అమెరికాలో జరుగుతున్న సెలబ్రిటీ క్రికెట్ మేలా ఈవెంట్​లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్​లో స్పిరిట్ ప్రాజెక్ట్​ గురించి మాట్లాడారు. ఈ ఏడాది సెప్టెంబర్​లో సినిమా చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు తెలిపారు. తొలి షెడ్యూల్​ నుంచే ప్రభాస్ సెట్స్​లో పాల్గొంటారని చెప్పారు.

షూటింగ్​కు నో బ్రేక్! : స్పిరిట్ సినిమా కోసం ఎక్కువ డేట్స్​ కేటాయించాలని హీరో ప్రభాస్​కు సందీప్ రెడ్డి రిక్వెస్ట్ చేశారంట. అలాగే కంటిన్యూగా కొన్ని రోజులు ఈ సినిమాతోనే ట్రావెల్ చేయాలని అడిగారని తెలుస్తోంది. ఎందుకంటే ఇందులో ప్రభాస్ కంప్లీట్ కొత్త లుక్, ఫిజిక్​తో కనిపించనున్నారు. అందుకే స్పిరిట్ మధ్యలో ఇంకో సినిమా షూటింగ్​కు వెళ్తే లుక్ రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది.

అలాగే మళ్లీ స్పిరిట్ లుక్​లోకి రావడం కష్టమవుతుంది. ఈ కారణంగానే అటు ప్రభాస్​ కూడా ప్రస్తుతం పెండింగ్​లో ఉన్న పనులన్నీ పూర్తి చేసి, సెప్టెంబర్​ నుంచి కంప్లీట్ డేట్స్ అన్ని స్పిరిట్​కు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారట. కాగా, ప్రభాస్ ప్రస్తుతం 'రాజాసాబ్', 'ఫౌజీ' సినిమా షూటింగ్స్​తో బిజీగా ఉన్నారు. 'రాజాసాబ్' ఈ ఏడాది డిసెంబర్ 05న థియేటర్లలోకి రానుంది. అటు హనురాఘవపూడి తెరకెక్కిస్తున్న 'ఫౌజీ' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

కాగా, ప్రభాస్ ఇందులో పవర్​ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్​గా ఎంపికయ్యారు. ఇందులో నటించనున్న వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. భద్రకాళి పిక్చర్స్​ బ్యానర్​పై ప్రణయ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

'స్పిరిట్' హీరోయిన్ కన్ఫార్మ్- డార్లింగ్​కు జోడీగా బాలీవుడ్ బ్యాటీ

ప్రభాస్​ 'స్పిరిట్​'పై సందీప్​ వంగా క్రేజీ అప్డేట్ - షూటింగ్ అక్కడే స్టార్ట్​ చేస్తారట!