Director Ravikumar Passed Away : తెలుగు సినీ పరిశ్రమ మరో డైరెక్టర్‌ను కోల్పోయింది. దర్శకుడు ఏఎస్ రవికుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. తన నివాసంలో బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కుటుంబసభ్యులు తెలిపారు.
యజ్ఞం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన, పలు హిట్స్‌ను అందుకున్నారు. బాలకృష్ణతో వీరభద్ర, సాయి దుర్గ తేజ్‌తో పిల్లా నువ్వులేని జీవితం చిత్రాలను తెరకెక్కించారు. తద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆయన చివరిగా తిరగబడరా సామి సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే రవికుమార్ మరణించడం పట్ల తెలుగు దర్శకుల సంఘం సంతాపం ప్రకటించింది.