Raja Saab Update : రెబల్ స్టార్ ప్రభాస్- మారుతి రాబోతున్న 'ది రాజా సాబ్'పై భారీ అంచనాలు ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లే జరుగుంటే ఇప్పటికే మూవీ గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేది. కానీ ప్రొడక్షన్ సమస్యల కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది. మూవీ టీమ్ ఇంకా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించలేదు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. సినిమా యూనిట్ నుంచి లేటెస్ట్ అప్‌డేట్ కోసం రెగ్యులర్‌గా సోషల్ మీడియా అకౌంట్‌లు చెక్ చేస్తున్నారు. ఈ సమయంలో ఫ్యాన్స్‌కి మారుతి క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు.
సోషల్ మీడియా ఎక్స్‌లో డిఫరెంట్ స్టైల్లో అప్డేట్ ఇచ్చారు. ఓ ఆటో వెనక ప్రభాస్ స్టిక్కర్ ఉన్న ఫొటో అప్‌లోడ్ చేశారు. దీనికి '‘హై అలర్ట్. మే నెల మధ్యలో నుంచి వడగాలులు మరింత పెరిగే అవకాశం ఉంది' అని రాసుకొచ్చారు. 'రాజా సాబ్' మూవీ అప్‌డేట్ గురించి మారుతి చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది.
రాజా సాబ్ చాలా స్పెషల్
ప్రభాస్ కెరీర్‌లో 'రాజా సాబ్' చాలా ప్రత్యేకం. ఈ సినిమాను మారుతి హారర్ కామెడీ జానర్‌లో తెరెకెక్కిస్తున్నారు. ప్రభాస్ ఇంత వరకు ఇలాంటి జానర్ సినిమా చేయలేదు. ప్రభాస్ మొదటిసారి ఇలాంటి సినిమా చేస్తున్నందుకు అభిమానులు మొదట్లో సందేహించారు. కానీ ఈ జానర్‌లో మారుతి ఎక్స్‌పర్ట్ కాబట్టి కాస్త అంచనాలు పెరిగాయి. ఈ మూవీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. సంజయ్ దత్ ఓ కీలక రోల్‌లో కనిపిస్తున్నారు.
ఈ సినిమాను రూపొందిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఇటీవల వరుసగా ఫ్లాప్‌లు చూస్తోంది. సంస్థ ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా మధ్యస్థంగా ఉన్నాయని అంటున్నారు. తమన్ కూడా ఈ సినిమా ఆడియో ఆల్బమ్‌ని పక్కన పెట్టేసి, మళ్లీ ఫ్రెష్ మ్యూజిక్ అందించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తాజాగా మారుతి నుంచి వచ్చిన అప్‌డేట్ ఫ్యాన్స్‌లో జోష్ తీసుకొచ్చింది. మూవీ టీమ్ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వనుందోనని ఫ్యాన్స్‌లో చర్చలు మొదలైపోయాయి.
నవంబర్‌లో 'రాజాసాబ్' రిలీజ్?- డైరెక్టర్ మారుతి క్లారిటీ
డార్లింగ్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్- 'ది రాజాసాబ్' టీజర్ వచ్చేస్తోందోచ్!