ETV Bharat / entertainment

నవంబర్​లో 'రాజాసాబ్' రిలీజ్?- డైరెక్టర్ మారుతి క్లారిటీ - RAJASAAB

'కాస్త ఓపిక పట్టండి డార్లింగ్స్!'​- రాజాసాబ్ రిలీజ్​పై మారుతి

Rajasaab
Rajasaab (Source : Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : April 8, 2025 at 3:30 PM IST

2 Min Read

Rajasaab Release Date : పాన్ఇండియా స్టార్ ప్రభాస్- మారుతి కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'రాజాసాబ్'. కామెడీ హార్రర్ జానర్​లో ఇది తెరక్కుతోంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల ఇది వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్​ను మేకర్స్ ఇప్పటివరకు ప్రకటించలేదు. కానీ, 2025 నవంబర్​లో ఈ సినిమా రిలీజ్ కానుందని ప్రచారం సాగుతోంది. దీనిపై డైరెక్టర్ మారుతి స్పందించారు.

దర్శకుడు మారుతి తాజాగా ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి, శ్రీకాళహస్తి క్షేత్రాలకు వెళ్లారు. ఈ ఆధ్యాత్మిక ట్రిప్​నకు సంబంధించిన ఫోటోలు ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ప్రభాస్ అభిమాని ఒకరు 'రాజాసాబ్' రిలీజ్ గురించి క్లారిటీ ఇవ్వాలని కోరారు. 'మీరు ప్రాజెక్ట్ ఔట్​పుట్​తో పూర్తిగా సంతృప్తి చెందినప్పుడే సినిమా రిలీజ్ చేయండి. కానీ, ఈ సినిమా నవంబర్​లో వస్తుందా? లేదా వచ్చే ఏడాది రిలీజ్ కానుందా? అనేది మీడియా ద్వారా అప్డేట్ ఇవ్వండి. అభిమానులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు' అని కామెంట్ సెక్షన్​లో రాసుకొచ్చారు.

దీనికి మారుతి స్పందించారు. దీనిపై పక్కా సమాచారం ఇవ్వాల్సింది మేకర్సేనని చెప్పారు.'సీజీ ఔట్​పుట్ త్వరలోనే వస్తుంది. అది వేరిఫై అయ్యాక మేకర్స్​ దీనిపై అప్డేట్ ఇస్తారు. ఈ ప్రాజెక్ట్​ కోసం ఎందరో కష్టపడి పనిచేస్తున్నారు. ఇది ఒక్కడి వల్ల సాధ్యం అయ్యేది కాదు. నాణ్యమైన ఔట్​పుట్ ఇవ్వాలంటే కాస్త సమయం పడుతుంది. అందుకే కాస్త ఓపిగ్గా ఉండండి. మా టీమ్ అంతా మీ అంచనాలను అందుకోవడానికే కష్టపడి పని చేస్తున్నాం' అని మారుతి రిప్లై ఇచ్చారు.

అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి గతేడాది వీడియో గ్లింప్స్ తప్పితే ఎలాంటి అప్డేట్ రాలేదు. అప్పట్నుంచి డార్లింగ్ ఫ్యాన్స్ అప్డేట్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా నవంబర్​కు షిఫ్ట్ అయ్యిందని ప్రచారం సాగింది. దీనిపైనే అభిమాని అడగ్గా, మారుతి క్లారిటీ ఇచ్చారు.

కాగా, ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్‌, రిద్ధి కుమార్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. కార్తీక్‌ పళని ఛాయాగ్రహణం బాధ్యతలు చూస్తుండగా, పీపుల్స్​ మీడియా ఫ్యాక్టరీపై ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్‌ భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు.

ఆ హీరోయిన్​తో కలిసి యూరప్​కు 'రాజాసాబ్' ప్రభాస్!

'హ్యారీపోటర్‌'లా ప్రభాస్‌ సినిమా - ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.