ETV Bharat / entertainment

హాస్పిటల్​కు దీపికా పదుకొణె- డెలివరీ కోసమేనా?- వీడియో వైరల్ - Ranveer Deepika Baby

Ranveer Deepika Baby: బాలీవుడ్ స్టార్ కపుల్ దీపిక- రణ్‌వీర్‌ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. తాజాగా ఈ జంట ముంబయిలోని ఓ ఆస్పత్రి వద్ద కనిపించిన వీడియో వైరల్‌గా మారింది.

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2024, 7:55 PM IST

Ranveer Deepika
Ranveer Deepika (Source: Getty Images)

Ranveer Deepika Baby: బాలీవుడ్‌ సెలబ్రిటీ జంట దీపికా పదుకొణె- రణ్‌వీర్‌ సింగ్‌ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ సందర్భంగా వినాయకుడి ఆశీర్వాదం పొందేందుకు శుక్రవారం సిద్ధివినాయక్ ఆలయానికి వచ్చారు. అలానే శనివారం సాయంత్రం దీపిక, రణవీర్ ఇద్దరూ కుటుంబ సభ్యులతో కలిసి ముంబయిలోని హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌కు చేరుకున్నారు. దీంతో దీపిక నేడో, రేపో బిడ్డకు జన్మనివ్వబోతుందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు .

వీడియో వైరల్‌
ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోగ్రాఫర్‌ షేర్ చేసిన వీడియోలో దీపిక ఫేస్‌ మాస్కు ధరించి తన కారులో కూర్చున్నట్లు కనిపించింది. రణవీర్ సింగ్, అతడి కుటుంబం కొద్దిసేపటికి వారి సొంత వాహనాల్లో రావడం వల్ల దీపిక ఆసుపత్రి ఆవరణలోకి ప్రవేశించింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. త్వరలోనే దీపిక తల్లి కాబోతున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.

వినాయకుడి ఆశీర్వాదం
శుక్రవారం గణేష్ చతుర్థికి ఒక్కరోజు ముందు, దీపిక, రణ్‌వీర్‌ ముంబయిలోని ప్రముఖ సిద్ధివినాయకుని ఆలయాన్ని సందర్శించారు. గుడిలోకి ఈ జంట చేతులు పట్టుకుని వెళ్లడం కనిపించింది. కొన్ని వారాల్లో మొదటి బిడ్డకు జన్మనిస్తున్నారని, అందుకే ఆశీర్వాదం కోసం ఆలయానికి వచ్చారని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వీరికి ట్విన్స్ పుట్టబోతున్నారంటూ నెటిజన్లు అప్పుడే అంచనా వేసేస్తున్నారు.

సెప్టెంబర్‌ చివరి వారంలో!
దీపిక ఈ నెలాఖరున ప్రసవించే అవకాశం ఉంది. దీపిక ప్రెగ్నెన్సీని ఈ ఏడాది ఫిబ్రవరిలో అనౌన్స్ చేశారు. ఆమె బిడ్డ సెప్టెంబర్‌లో జన్మించే అవకాశం ఉందని అప్పుడే ఇన్‌స్టాగ్రామ్‌ షేర్‌ చేసింది. పిల్లల బట్టలు, బూట్లు ఉన్న ఫోటోకి 'సెప్టెంబర్ 2024' అనే క్యాప్షన్‌ యాడ్‌ చేసింది. కాగా, 2018లో ఇటలీలో వీరి పెళ్లి గ్రాండ్​గా జరిగింది.

ఆకుపచ్చ చీరలో అట్రాక్షన్​గా
దీపికా పదుకొణె ఆలయానికి వచ్చినప్పుడు ఆకుపచ్చ బనారసీ చీర కట్టుకుంది. ఆమె స్నేహితురాలు, స్టైలిస్ట్ అనైతా ష్రాఫ్ అదాజానియా ఈ చీరను బహుమతిగా ఇచ్చింది. శతాబ్దాల నాటి అదే రంగు, ప్యాటర్న్‌తో చీరను డిజైన్‌ చేసినట్లు సంబంధిత బ్రాండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆరు నెలల తర్వాత చేసిన మొదటి చీరను దీపిక కోసం అనితా ష్రాఫ్ అదాజానియా కొనుగోలు చేసిందని చెప్పింది. చీర ఆకుపచ్చ రంగు సంతానోత్పత్తి, శ్రేయస్సును సూచిస్తుందని ఇది ఆమె సరైన ఎంపికని తెలిపింది.

దీపిక 'బేబీ బంప్‌' ఫొటోషూట్- రణ్​వీర్​తో క్యూట్ ఫోజులు - Deepika Padukone Baby Bump

పుట్టబోయే బిడ్డ కోసం దీపికా పదుకొణె కీలక నిర్ణయం! - ఫ్యాన్స్ ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.