ETV Bharat / entertainment

ఓటీటీలోనూ కలెక్షన్స్​ లెక్కలు - కొత్త ట్రెండ్ షురూ చేసిన ఈటీవీ విన్ - Committee Kurrollu OTT Collections

Committee Kurrollu OTT Collections : సాధారణంగా థియేటర్​​ సినిమాలకు సంబంధించి కలెక్షన్స్​​​ వివరాలను వింటుంటాం. అయితే ఈటీవీ విన్ తాజాగా ఓటీటీ కలెక్షన్స్ అంటూ కొత్త ట్రెండ్​ను ప్రారంభించింది. పూర్తి వివరాలు స్టోరీలో.

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2024, 11:52 AM IST

source ETV Win Twitter
Committee Kurrollu OTT Collections (source ETV Win Twitter)

Committee Kurrollu OTT Collections : సాధారణంగా థియేటర్​​ సినిమాలకు సంబంధించి కలెక్షన్స్​​ వివరాలను వింటుంటాం. ఎందుకంటే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్​, రికార్డుల విషయంలో పోటీ ఉంటుంది. అయితే ఓటీటీల్లో ఇప్పటి వరకు వ్యూస్ పరంగా రికార్డులు విన్నాం కానీ, కలెక్షన్ల మాటను వినలేదు. అయితే ఇప్పుడీ ఓటీటీ కలెక్షన్స్​ ట్రెండ్‍ను ఈటీవీ విన్ ప్రారంభించింది. తమ ప్లాట్​ఫామ్​లో స్ట్రీమింగ్ అవుతోన్న కమిటీ కుర్రోళ్ళు సినిమాకు తొలి రోజు గ్రాస్ వసూళ్ల వివరాలు అంటూ ఓ పోస్టర్​ను విడుదల చేసింది.

ఎంతంటే? - కమిటీ కుర్రోళ్లు సినిమాకు తొలి రోజు రూ.70,32,416 గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు ఈటీవీ విన్ పోస్ట్ చేసింది. బిగ్గెస్ట్ రికార్డ్​ అంటూ "సినిమా థియేటర్‌లోనే కాదు, ఇక నుంచి OTTలో కూడా రికార్డులు ఉంటాయి. ఈ జాతరతో మొదలు, ఏటువంటి జాతర అయినా ఈటీవి విన్‌తోనే. Blockbuster జాతర అని ముందే చెప్పానుగా" అని రాసుకొచ్చింది. మరి దేన్ని ప్రామాణికంగా తీసుకొని ఈ కలెక్షన్స్​ను లెక్కేసారో క్లారిటీ లేదు. ఏదేమైనా ఓటీటీలో కలెక్షన్స్​ వివరాలు అని లెక్కించడం కాన్సెప్ట్​ కొత్తగా ఉంది.

కాగా, కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9న థియేటర్లలో రిలీజైంది. మెగా డాటర్ నిహారిక కొణిదెల చిత్రాన్ని నిర్మించారు. సినిమా మంచి హిట్ టాక్​ను అందుకుంది. యధు వంశీ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పుడీ చిత్రం సెప్టెంబర్ 12 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ప్లాట్​ఫామ్​లోనూ మంచి రెస్పాన్స్​ను అందుకుంటోంది.

Committee Kurrollu Story : సినిమాలో 1990ల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసేలా స్నేహితుల మధ్య అనుబంధాలు, గోదావరి పల్లె అందాలను చూపించారు. మూవీలో ప్రసాద్ బెహరా, సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, సాయి కుమార్, ఈశ్వర్ రాచిరాజు, లోకేశ్ కుమార్, మణికంఠ పరసు, రఘువరన్, శ్యామ్ కల్యాణ్ సహా పలువురు నటించారు. అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి IMDBలో 9.0 రేటింగ్​ దక్కింది.

'దళపతి 69' ప్రాజెక్ట్​ డీటెయిల్స్​ ఇవే! - హీరోయిన్ ఎవరంటే? - Vijay Thalapathy 69

ఈ వారం 4 బెస్ట్ మలయాళం మూవీస్​ ఇవే - తెలుగులోనూ స్ట్రీమింగ్​! - This Week Best OTT Malayalam Movies

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.