Nag Ashwin Depression : స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గతేడాది 'కల్కి 2898 AD' సినిమాతో భారీ విజయం అందుకున్నారు. ప్రస్తుతం ఆయన 'కల్కి' సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రొఫెషనల్ లైఫ్ అటుంచితే, నాగ్ తాజాగా కాలేజ్ స్టూడెంట్స్‌తో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఆయన ఇండస్ట్రీలో తన అనుభవాలు, కెరీర్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
అయితే నాగ్ లైఫ్‌లో ఓసారి డిప్రెషన్‌లోకి వెళ్లిన్నట్లు చెప్పారు. ఓ హాలీవుడ్ సినిమా వల్ల తీవ్ర నిరాశకు గురైనట్లు పేర్కొన్నారు. 2008లో ఓ కథ రాసుకుంటే రెండేళ్ల తర్వాత తాను అనుకున్న కాన్సెప్ట్‌తోనే సినిమా రావడం వల్ల డిప్రెషన్‌కు గురైనట్లు అశ్విన్ చెప్పారు. హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన 'ఇన్సెప్షన్' సినిమా ట్రైలర్ చూసి వారం రోజులు డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు చెప్పారు.
'2008లో జ్ఞాపకాలు అనే అంశంతో ఓ కథ రాసుకున్నాను. రెండేళ్ల తర్వాత అదే కాన్సెప్ట్‌తో క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన 'ఇన్సెప్షన్' సినిమా ట్రైలర్ చూశాక డిప్రెషన్‌లోకి వెళ్లాను. అయితే నాది జ్ఞాపకాలు అంశం కాగా, అది కలలు అనే పాయింట్‌తో తెరకెక్కింది. అవి రెండు అంశాలు దాదాపు ఒకటే కావడం వల్ల నేను డ్రాప్ అయిపోయా. అది నన్ను బాగా ప్రభావితం చేసింది. దాదాపు వారం రోజులు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా' అని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు.
కాగా, ఇదే చిట్‌చాట్‌లో అశ్విన్ మరికొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. సినిమా బాగా రావడానికి ఎడిటింగే ముఖ్య కారణం అని అన్నారు. గతంలో ఆయన పలు సినిమాలకు ఎడిటర్‌గా కూడా వర్క్ చెసినట్లు చెప్పారు. ఇక 'ఖలేజా', 'డియర్ కామ్రేడ్' సినిమాలను తాను ఎడిట్ చేసి ఉంటే బాగుండేదేమో అని అభిప్రాయపడ్డారు. కామెడీ సినిమాలను ఇష్టపడే ఆయనకు, ముఖ్యంగా జంధ్యాల చిత్రాలు నచ్చుతాయట.
కాగా, ప్రస్తుతం నాగ్ 'కల్కి' సీక్వెల్‌పైనే పని చేస్తున్నారు. అది మినహా ఆయన ఇంకా కొత్త ప్రాజెక్ట్‌లు ఏవీ ప్రకటించలేదు. అయితే బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌తో ఓ సినిమా అనుకుంటున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఆ బాలీవుడ్ హీరోయిన్‌తో సినిమా - అసలు విషయం బయటపెట్టిన 'కల్కి' నాగ్ అశ్విన్!