Heroine Rejected Rs 600 Crore Offer : బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా తన అందం, అభినయంతో హిందీ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 2000వ దశకంలో ఐశ్వర్య రాయ్, రాణి ముఖర్జీ, కరీనా కపూర్ వంటి స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీని ఇచ్చారు. వరుస హిట్లతో అదరగొట్టారు. అయితే అప్పట్లో ఓ ప్రొడ్యూసర్ ఇచ్చిన రూ. 600 కోట్ల ఆఫర్‌ను ప్రీతి రిజెక్ట్ చేశారట. మరి ఆ ప్రొడ్యూసర్ ఎవరు? ప్రీతికి ఆయన ఎందుకు ఆఫర్ ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం!
ప్రీతిని ఆలా భావించి!
దిగ్గజ దర్శకుడు కమల్ అమ్రోహి కుమారుడు షాందర్ అమ్రోహి హీరోయిన్ ప్రీతికి ఈ ఆఫర్ ఇచ్చారు. అయితే ప్రీతి జింటాను ఆయన తన సొంత కూతురిలా చూసుకునేవారట. ఈ క్రమంలోనే ఆయన తన రూ.600 కోట్ల విలువైన ఆస్తిని ప్రీతి జింటాకు బదిలీ చేయాలనుకున్నారట. తన మరణాంతరం పిల్లలకు కాకుండా అంత మొత్తాన్ని హీరోయిన్‌కు ఇచ్చేందుకు ఆయన మొగ్గుచూపినట్లు అప్పట్లో బీ టౌన్లో టాక్.
ఆఫర్‌కు ప్రీతి నో!
నిజానికి ఎవరైనా ఇలాంటి ఆఫర్ వస్తే సంబరపడిపోతారు. కానీ, ప్రీతి ఆ ఆఫర్‌ను తిరస్కరించారని బాలీవుడ్ వర్గాల్లో చెప్పుకుంటారు. ప్రీతి చేసిన ప్రకటనల వల్ల తాను బాధపడ్డానని ఓ సందర్భంలో షాందర్ అమ్రోహి తెలిపారు. అయితే షాందర్ అమ్రోహి 2011లో చనిపోయారు. ఆ తర్వాత షాందర్కు ఇచ్చిన రూ.2 కోట్ల అప్పుకోసం ప్రీతి కోర్టును ఆశ్రయించినట్లు అప్పట్లో కథనాలు వచ్చాయి.
'నేను ప్రీతి కంటే చాలా సీనియర్. ఆమెను తొలిసారి మారియట్ హోటల్లో కలిశాను. ఆమెను నా కూతురిలా భావించాను. చాలాసార్లు బహుమతులు కూడా పంపాను. నా తోబుట్టువులతో నాకు గొడవ జరిగినప్పుడు నేను ఇబ్బందుల్లో ఉన్నానని ఎవరో ప్రీతికి చెప్పారు. ఆమె నా ఇంటికి వచ్చి నాకు మద్దతు ఇచ్చింది' అని షాందర్ అమ్రోహి గతంలో ఓ జాతీయ ఛానెల్‌తో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
అండర్ వరల్డ్ డాన్ బెదిరింపులు
కెరీర్లో నిలదొక్కుకుంటున్న సమయంలో ఆమెకు ఓ షాక్ తగిలింది. 2001లో 'చోరీ చోరీ చుప్కే చుప్కే' షూటింగ్ సమయంలో ఆమెకు అండర్ వరల్డ్ డాన్ ఛోటా షకీల్ నుంచి రూ.50 లక్షలు ఇవ్వాలని కాల్స్ వచ్చాయట. ఈ విషయాన్ని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో గ్యాంగ్ స్టర్లకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినప్పుడు ఆమె ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ, ఆమె ధైర్యానికి అప్పటి హోం మంత్రి ఎల్ కే అడ్వాణీ 'గాడ్ ఫ్రే ఫిలిప్స్ నేషనల్ బ్రూవరీ అవార్డు'తో ప్రీతిని సత్కరించారు.
కెరీర్
1997లో రిలీజైన 'దిల్ సే'తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ప్రీతి జింటా. తొలి చిత్రంతోనే అభిమానులను అలరించారు. అప్పటి నుంచి వరసు ఆఫర్లు అందుకుని లక్కీయెస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్నారు. 'దిల్ చాహ్తా హై', 'కోయి మిల్ గయా', 'కల్ హో నా హో', 'వీర్ జారా', 'కభీ అల్విదా నా కెహ్నా' వంటి అనేక సినిమాల్లో నటించారు. తెలుగులో విక్టరీ వెంకటేశ్‌తో 'ప్రేమంటే ఇదేరా' సినిమాలో నటించారు. మళ్లీ 'లాహోర్ 1947'తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
బీజేపీలోకి ప్రీతి జింటా? గట్టి కౌంటర్ ఇచ్చిన హీరోయిన్!
పంజాబ్ కోచ్‌పై ప్రీతి జింటా ఫైర్- అందరిముందే బెదిరింపు- ఏం జరిగిందంటే? - Preity Zinta Sanjay Bangar