Deepika Padukone Kalki 2 : ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 'కల్కి 2898 ఏడీ' గతేడాది విడుదలై సూపర్ హీట్‌గా నిలిచింది. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్‌గా 'కల్కి 2' తెరకెక్కనుంది. కాగా, 'కల్కి'లో కీలక పాత్రలో పోషించిన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె, ఈ సీక్వెల్ నటించలేదని ప్రచారం జరుగుతోంది. 'కల్కి 2' నుంచి దీపికా తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇటీవల కొన్ని కారణాల వల్ల 'స్పిరిట్' మూవీని నుంచి తప్పుకుంది దీపికా పదుకొణె. అదే తరహాలోనే అనగా బారీ డిమాండ్ల కారణంగానే 'కల్కి 2' దీపికా నుంచి తప్పుకున్నట్లు వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేశాయి. అయితే అవన్నీ రూమర్స్ అంటూ నిర్మాతలు స్వప్న- ప్రియా దత్ కొట్టిపారేశారు. 'కల్కి 2'లో దీపికా నటిస్తుందని చెప్పారు. దీంతో రూమర్స్‌కు చెక్ పెట్టినట్లు అయ్యింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు 30 శాతం వరకు పూర్తి అయినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే, పార్ట్1 షూటింగ్ సమయంలో సీక్వెల్‌ను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
ఇక 'కల్కి' విషయానికి వస్తే, వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మించారు. ఈ సినిమాలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా ఆకట్టుకోగా, కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్‌గా మెరిశారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, రాజమౌళి లాంటి స్టార్స్ అతిథి పాత్రల్లో మెరిశారు. బౌంటీ ఫైటర్ భైరవగా ప్రభాస్ సందడి చేయగా, సినిమా చివర్లో కర్ణుడిగా కనిపించి పార్ట్ 2పై మరిన్ని అంచనాలు పెంచేశారు. ఇక దీపికా కూడా తన నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
దీపిక రిజెక్ట్ చేసిన సినిమాలు- లిస్ట్‌లో నేషనల్ అవార్డ్ మూవీ కూడా
స్టార్ హీరో కుమార్తెకు తల్లిగా దీపికా పదుకొణె- ఈసారి ఆ రోల్లో కూడా!