Bigg Boss Telugu Dammu Srija: లక్షల జీతం వదిలి బిగ్‌బాస్‌కు - ఎవరీ "దమ్ము శ్రీజ"!
- బిగ్‌బాస్ షోలోకి కామనర్‌గా ఎంట్రీ - సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్లు!

Published : October 4, 2025 at 2:11 PM IST
Bigg Boss Telugu Dammu Srija: గత సీజన్స్‌తో పోలిస్తే ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. అలాగే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. దీనికి ప్రధాన కారణం ఈ సీజన్‌ను కామనర్స్ వర్సెస్ సెలెబ్రిటీలు అనే కాన్సెప్ట్‌తో డిజైన్ చేయడమే. అందుకు తగ్గట్టుగానే 9 మంది సెలిబ్రిటీలు, ఆరుగురు కామనర్లను గ్రాండ్ లాంఛ్ రోజు హౌజ్‌లోకి పంపించారు. సెలెబ్రిటీల విషయం పక్కన పెడితే.. కామనర్ కోటాలో ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి దమ్ము శ్రీజ. అగ్నిపరీక్షలో సత్తా చాటిన ఈ అమ్మడు సీజన్ 9లో అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ గురించి కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ బ్యూటీది విశాఖపట్టణం. శ్రీజ తండ్రి దమ్ము శ్రీను జీవీఎంసీ ఉద్యోగి. ఆమె సోదరుడు కూడా జీవీఎంసీలోనే పని చేస్తాడు. వీరిది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసి శ్రీజ.. లక్షల రూపాయల జీతంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పలు కంపెనీల్లో విధులు నిర్వర్తించింది. ఓవైపు జాబ్ చేస్తూనే.. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరగడంతో ఇన్ఫ్లుయెన్సర్గానూ మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే రీల్స్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. సుమారు 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఈ అమ్మడికి.
అగ్నిపరీక్ష ద్వారా సత్తా: అయితే కళ్లు చెదిరే జీతం, సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి తనను తాను ఫ్రూవ్ చేసుకునేందుకు శ్రీజ బిగ్‌బాస్ షోలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే కామన్‌మ్యాన్ కోసం నిర్వహించిన ఆడిషన్స్‌లో పాల్గొని అగ్నిపరీక్షకు సెలెక్ట్ అయ్యింది. అయితే 'అగ్నిపరీక్ష' ఆడిషన్స్‌లో దమ్ము శ్రీజ విచిత్రమైన ప్రవర్తనతో జడ్జిలకు షాక్ ఇచ్చింది. ఇక ఆమెను చూసి జడ్జిలైన అభిజిత్, బిందు మాధవి 'రెడ్ ఫ్లాగ్' ఇచ్చారు. అంటే ఆమె హౌజ్‌లోకి వెళ్లడానికి సూట్ కాదని అర్థం. కానీ మరో జడ్జి నవదీప్ మాత్రం ఆమెకు ఒక అవకాశం ఇస్తూ 'గ్రీన్ ఫ్లాగ్' ఇచ్చి హోల్డ్‌లో పెట్టారు.
ఆ అవకాశాన్ని శ్రీజ అద్భుతంగా ఉపయోగించుకుంది. అలా 'అగ్నిపరీక్ష'లో నిర్వహించిన ప్రతి టాస్క్‌లో ఆమె అత్యుత్తమంగా ఆడింది. ఆమె పోరాట పటిమను చూసి జడ్జిలు కూడా ఆశ్చర్యపోయారు. "వద్దు బాబోయ్ అన్న జడ్జీలే.. ఈమె షోలో ఉండాలి" అనేలా అగ్నిపరీక్షలో సత్తా చాటడంతో నేరుగా బిగ్‌బాస్ హౌజ్‌లోకి పంపించారు. ప్రేక్షకుల ఓటింగ్‌లో కూడా శ్రీజ అగ్రస్థానంలో నిలిచి, తన సత్తా చాటింది.
నాలుగో వారం నామినేషన్స్‌లో: అగ్నిపరీక్షలో సత్తా చాటి బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీపై ప్రేక్షకులు చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. గేమ్స్ వరకు బానే ఉన్నా, మిగతా విషయాల్లో చిరాకు తెప్పిస్తుండటంతో సపోర్ట్ చేసిన వాళ్లే తిట్టుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు నామినేషన్స్‌లోకి వస్తుందా? ఎప్పుడు ఎలిమినేట్ చేద్దామా? అని ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ వారం ఈ అమ్మడు నామినేషన్స్‌లోకి వచ్చింది. మరి సేవ్ అవుతుందో లేదో చూడాలి.

