ETV Bharat / entertainment

Bigg Boss Telugu 9 Day 20 Episode: "ఆమె సైడ్" తీసుకున్న బిగ్​ బాస్​ షో! - నెట్టింట భారీ ట్రోలింగ్!

- సంజనా కోసం నలుగురి త్యాగం! - శ్రీజకు పనిష్మెంట్.. రీతూకు సలహాలు - హౌజ్ ​మేట్స్​తో ఆడుకున్న నాగార్జున!

Bigg Boss Telugu 9 Day 20 Episode
Bigg Boss Telugu 9 Day 20 Episode (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : September 28, 2025 at 9:53 AM IST

4 Min Read
Choose ETV Bharat

Bigg Boss Telugu 9 Day 20 Episode: ఎపిసోడ్​ ఎప్పుడైనా వన్​ సైడ్​ తీసుకుందని అనిపిస్తే అది బిగ్​ బాస్​ సైడ్​ అయ్యుంటుంది. లేదంటే హోస్ట్​ సైడ్ అయ్యుంటుంది. కానీ, ఈ సీజన్​లో మొదటిసారిగా ఒక ఎపిసోడ్​ ఆల్మోస్ట్​ ఒక కంటిస్టెంట్​ సైడ్​ తీసుకుంది! ఆమే సంజనా గల్రానీ. శనివారం ప్లే అయిన ఎపిసోడ్​ పూర్తిగా సంజనా సెంటర్​ గానే సాగింది. మరి, ఇది "జస్ట్​ లైక్​ దట్" అన్నట్టుగా సాగిందో.. లేదంటే నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగానే ప్లాన్ చేశారోగానీ నెట్టింట మాత్రం భారీ ట్రోలింగ్ జరుగుతోంది. ఇంతకీ నిన్నటి ఎపిసోడ్​లో ఏం జరిగిందో మీరూ ఓ లుక్కేయండి.

నాగార్జున వస్తూనే సంజనను స్టేజ్ మీదకు పిలిచి, మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి మాట్లాడారు. ఆమె ఆన్సర్​ ఇస్తూ "నాటీగా 10 శాతం మాత్రమే చేశానని, ఇంకా 90% దాచాను" అని చెప్పింది. అటు హౌజ్​మేట్స్​ వైపు తిరిగిన నాగ్.. "సంజన వెళ్లిపోయింది కాబట్టి సంతోషంగా ఉన్నారా ?" అని క్వశ్చన్​ చేశారు​. దీంతో "లేదు సర్"​ అంటూ హౌజ్​మేట్స్​ ఏకకంఠంతో చెప్పారు. ఆ తర్వాత కెమెరా పూర్తిగా సంజనానే ఫోకస్ చేసింది. ఈ క్రమంలో హౌజ్​మేట్స్ ను జడ్జ్ చేయాలంటూ చెప్పేశాడు హోస్ట్. దీంతో.. ఒక్కొక్కరిలో ఒకటికి మించిన లోపాలున్నాయంటూ చిట్టా పద్దులు చదువుతూపోయింది సంజనా.

  1. ముందుగా సుమన్ తో స్టార్ చేసింది. అతను "స్టాండ్ తీసుకోడు" అంటూ, బజర్ విషయంలో జరిగిన మేటర్​ను కోట్ చేసింది.
  2. శ్రీజ 1000 పర్సెంట్ ఆర్గ్యుమెంట్ నుంచి 300 పర్సెంట్ ఆర్గ్యుమెంట్​కి దిగి ఇంప్రూవ్ అయ్యిందని మెచ్చుకుంది.
  3. ఫ్లోరా బ్యూటిఫుల్ పర్సన్ కానీ తెలుగు నేర్చుకోవాలని సజెస్ట్ చేసింది.
  4. "సిచ్యువేషన్ వస్తే ప్రిన్సిపల్​లాగా అరుస్తుంది. కానీ, అందులో మీనింగ్ కూడా ఉండదు" అంటూ తనూజను ఏకిపారేసింది.
  5. ఇక భరణి వద్దకు రాగా "మిస్ యూ సంజన గారూ" అన్నాడు. "నాకలా అన్పించట్లేదు. నా గురించి మీరు స్టాండ్ తీసుకోలేదు. రోజూ అన్నా-చెల్లి మాదిరి కాకపోయినా, అవసరమైనప్పుడు టైమ్​లో స్టాండ్​ తీసుకోవాలి" అంటూ ఇచ్చిపడేసింది.
  6. "ప్రియా సూపర్, కళ్యాణ్ గత 3 రోజుల్లో బెటర్ అయ్యాడు" అంటూ అప్లాజ్ ఇచ్చేసింది.
  7. "అబ్బాయి నుంచి అమ్మాయి అవ్వాలి" అంటూ రీతూ చౌదరి కి తనదైన రీతిలో సూచన చేసింది.
  8. "కొంతమందిని ఎక్కువగా, కొంతమందిని తక్కువగా ట్రీట్ చేశానని ఎలిమినేట్ రీజన్ చెప్పాడు రాము" అంటూ ఫైర్ అయ్యింది. హరీష్-రాము డిస్కషన్ గురించి మాట్లాడుతూ "చీప్ అన్నావ్. ఎంత ముద్దు చేశాను?" అంటూ ఫైర్ అయ్యింది.
  9. "నాలుగు రోజులైనా బట్టలు మార్చుకొలేదు. ఒక్క శాతం కూడా హ్యూమర్ లేదు. వంట చేసేటప్పుడు ఆయనకు ఏదన్నా చెప్పాలంటే అందరూ భయపడుతున్నారు. గొడవ మాత్రమే పడతాడు. ఇలాంటి పర్సన్​తో బతకడం కష్టం" అంటూ హరీష్ ను ఎన్​కౌంటర్ చేసింది. దీంతో "ఆమెకు అనుకూలంగా ఉన్నప్పుడే ఫేవరిజం చూపిస్తుంది. ఆమె తప్పును ఎత్తి చూపినప్పుడు మాత్రం తప్పులు పడుతుంది" అంటూ కౌంటర్ ఇచ్చేశాడు హరీష్.
  10. "డీమాన్​ను తమ్ముడిగా చూశాను. కానీ అన్నం పెట్టినందుకు మానిప్యులేటర్​ను చేశాడు" అంటూ సంజన చెప్పుకొచ్చింది. సంజన విషయంలో ఇమ్మూ బాగా ఎమోషనల్ అయ్యాడు.

ఆ నలుగురి త్యాగంతో రీ ఎంట్రీ: మిడ్ వీక్ ఎలిమినేట్ అయిన సంజనా మళ్లీ ఇంట్లో వచ్చేందుకు అవకాశం ఉందని, అయితే అందుకోసం ఓ నలుగురు ఆమె కోసం త్యాగం చేస్తే 100% బ్యాటరీ వస్తుందని, దీంతో ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందని నాగార్జున చెప్పారు. ఈ క్రమంలో ఇమ్మాన్యుయేల్​ కెప్టెన్సీ, తనూజ కాఫీ, రీతూ హెయిర్​ కట్​, భరణి లాకెట్​ను త్యాగం చేశారు. దీంతో సంజనా మళ్లీ హౌజ్​లోకి వచ్చింది.

ఆ తర్వాత సీజన్​ 9 గురించి ఆడియన్స్​ ఒపీనియన్​ తీసుకున్నారు నాగ్​. దీంతో చాలా మంది "కంటెస్టెంట్స్​ వర్సెస్​ ఓనర్స్​లాగా ఉండటం లేదు. అందరూ కలిసే ఉంటున్నారు" అంటూ చెప్పారు. దీంతో "అడిగేద్దాం కడిగేద్దాం" అంటూ అసలు కథ స్టార్ట్ చేశారు నాగ్. "టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ లాగా గేమ్ ఆడట్లేదు" అంటూ కెప్టెన్​ను నిలదీశాడు నాగ్. "ఓనర్స్ అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాము" అని డీమాన్ పవన్​ చెప్పగా, "అది ఆడియన్స్​కు నచ్చట్లేదు" అని కుండబద్దలు కొట్టాడు హోస్ట్.

ఇక బజర్ టాస్క్​లో సంచాలక్ శ్రీజ చేసిన తప్పును చూపించి మళ్లీ ఇటువంటివి చేయవద్దని, ఈ విషయంలో బిగ్​బాస్​ చెప్పేదాకా అదే డ్రెస్​లో ఉండాలని శ్రీజకు పనిష్మెంట్ ఇచ్చారు. "అవకాశం వదులుకోవద్దు, పక్కవాళ్ల మాటలు వినొద్దు" అంటూ రీతూకు సలహాలు ఇచ్చారు. అలాగే ఇప్పటి నుంచి దొంగతనం చేస్తే "దొంగలున్నారు జాగ్రత్త" అనే బోర్డును మెడలో వేసి, వారమంతా అలాగే ఉంచుతామని నాగ్ హెచ్చరించారు. దీంతో నిన్నటి ఎపిసోడ్​ పూర్తయ్యింది. ఇక నేటి ఎపిసోడ్​ను దసరా థీమ్​తో సెలబ్రేట్​ చేస్తున్నారు. ఇక ఆ తర్వాత ఎలిమినేషన్​ ఉంటుంది. కాగా.. సోషల్ ట్రెండ్స్​ మాత్రం ప్రియా ఎలిమినేట్​ అవుతుందని చెబుతున్నాయి!

Bigg Boss 3rd Week Elimination: ఎలిమినేషన్​ బటన్​ నొక్కేసిన ఆడియెన్స్​ - ఆమె బ్యాగ్ సర్దేయడం పక్కా?

Bigg Boss Telugu 9 Day 19 Episode: "కొడుకు కెప్టెన్​ - అమ్మ ఎలిమినేషన్​" - బిగ్​బాస్​లో దిమ్మతిరిగే ఎపిసోడ్​!