ETV Bharat / entertainment

Bigg Boss Telugu 9 Day 19 Episode: "కొడుకు కెప్టెన్​ - అమ్మ ఎలిమినేషన్​" - బిగ్​బాస్​లో దిమ్మతిరిగే ఎపిసోడ్​!

- బిగ్‌బాస్ 9లో అదిరిపోయే ట్విస్ట్ - మిడ్ వీక్ ఎలిమినేషన్ సెట్ చేసిన బిగ్‌బాస్

Bigg Boss Telugu 9 Day 19 Episode
Bigg Boss Telugu 9 Day 19 Episode (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : September 27, 2025 at 10:14 AM IST

4 Min Read
Choose ETV Bharat

Bigg Boss Telugu 9 Day 19 Episode: బిగ్​బాస్​ సీజన్​9లో కిక్క్​ ఇచ్చే ఎపిసోడ్​ అంటే నిన్నటిదే. ఇప్పటికే వైల్డ్​ కార్డ్​ ఎంట్రీతో ఆట స్వరూపాన్ని మార్చిన బిగ్​బాస్​.. తాజా ఎపిసోడ్​లో కంటెస్టెంట్స్​కు దిమ్మతిరిగే షాక్​ ఇచ్చాడు. ఓవైపు వైల్డ్​ కార్డ్​.. మరోవైపు మిడ్​ వీక్​ ఎలిమినేషన్​తో రఫ్పాడించాడు. అంతేకాకుండా గత రెండు వారాల నుంచి తృటిలో కెప్టెన్సీని మిస్​ చేసుకున్న ఇమ్మాన్యుయేల్​ ఎట్టకేలకు మూడో వారం గెలిచి కెప్టెన్​ అయ్యాడు. అసలు నిన్నటి ఎపిసోడ్​లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

ర్యాంకులతో ట్విస్ట్​: వైల్డ్​ కార్డ్​గా ఇంట్లోకి అడుగుపెట్టిన దివ్యకు బిగ్​బాస్​ బంపరాఫర్​ ఇచ్చాడు. "రెండు వారాలుగా కంటెస్టెంట్స్​ ఆట చూసిన మీరు అందుకు తగినట్లుగా వాళ్లకు ర్యాంకులు ఇవ్వాలి" అంటూ చెప్పాడు. దీంతో గార్డెన్​ ఏరియాలో ఏర్పాటు చేసిన ర్యాంక్​ నెంబర్ల దగ్గర ఒక్కొక్కరిని నిలబెట్టింది. అలా టాప్​ - 1లో భరణి నుంచి మొదలు ఇమ్మాన్యుయేల్​, సంజనా, డీమన్​ పవన్​, తనూజ, సుమన్​ శెట్టి, రీతూ చౌదరి, ప్రియా శెట్టి, హరీష్​, శ్రీజ, కల్యాణ్​, రాము రాథోడ్​, చివరగా ఫ్లోరా సైనీని నిలబెట్టింది. దీంతో హౌజ్​మేట్స్ అందరూ ఆలోచనలో పడిపోయారు. ఆ తర్వాత బిగ్​బాస్ ఆదేశం ప్రకారం కెప్టెన్సీ టాస్క్ కోసం టాప్​ 7 నుంచి ఐదుగురిని కంటెండర్లుగా సెలెక్ట్ చేసింది దివ్య. ఈ లిస్ట్​లో దివ్య సహా ఇమ్మాన్యుయేల్, భరణి, తనూజ, సుమన్ శెట్టిలు ఉన్నారు. అనంతరం 'తప్పిస్తారా ఒప్పిస్తారా' అనే కెప్టెన్సీ టాస్క్​లో ఇమ్మాన్యుయేల్ గెలిచి కెప్టెన్ అయ్యాడు. దీంతో సంజనా ఆనందం అంతా ఇంతా కాదు. కొడుకుగా భావించే ఇమ్మాన్యుయేల్​ కెప్టెన్​ కావడంతో ఫుల్​ హ్యాపీ అయ్యింది.

దీంతో అందరూ ప్రశాంతంగా ఉండి నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి సైరన్ మోగించి కంటెస్టెంట్లని కంగారు పెట్టాడు బిగ్‌బాస్. సైరన్ మోగడంతో అందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తున్నారేమో అనుకొని పరిగెత్తుకుంటూ గార్డెన్ ఏరియాకి వచ్చారు. కానీ ఈ సమయంలోనే బిగ్‌బాస్ అనౌన్స్‌మెంట్ చేశాడు. "నా చక్రవ్యూహం మొదటి అధ్యాయంలో దివ్య ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఆ చక్రవ్యూహంలోని మరో అధ్యాయానికి సమయం వచ్చింది. ఇంటి సభ్యులందరూ ఇప్పటివరకూ మీకు లభించిన ఫలాల్లోని బ్లూ, బ్లాక్ సీడ్స్ ఏం తీసుకొచ్చాయో చూశారు. ఇప్పుడు రెడ్ సీడ్ పొందిన వారి వంతు. ఎప్పుడూ లేని విధంగా రెడ్ సీడ్ పొందినవారికి ఇంటి నుంచి ఒకర్ని బయటికి పంపే అధికారాన్ని నేను ఇస్తున్నాను. దివ్య నేను పంపిన సభ్యురాలు కాబట్టి, ఫ్లోరా తన ఇమ్యూనిటీని గెలుచుకొని ఈ వారం సేవ్ అయ్యారు కాబట్టి వీరిద్దరూ మినహాయించి మిగతా రెడ్ సీడ్ పొందని వారిలో నుంచి ఒకర్ని మీరు ఇంటి నుంచి బయటికి పంపేందుకు నిర్ణయించాల్సి ఉంటుంది" అంటూ బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. ఇక రెడ్ సీడ్ పొందిన భరణి, హరీష్, కళ్యాణ్, డీమాన్, రాము మాట్లాడుకోవడానికి లోపలికెళ్లారు.

టార్గెట్​ చేసిన కామనర్లు: ముందుగా హరీష్ మాట్లాడుతూ.." నాకు సంజన గారు. ఈ షో దొంగల షో. దొంగతనాల షో అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. సైకో ఆనందమా అది ఏం సాధించడానికి. దాని నుంచి ఔట్‌పుట్ ఏమి వస్తుంది. ఒక్కసారి కాదు ఎప్పుడూ అదే రిపీట్ చేస్తున్నారు" అంటూ హరీష్ చెప్పాడు. ఇక "ఆవిడ రాంగ్​ లేదా ఆవిడ ఇది అని ఎవరైనా రివర్స్‌లో మాట్లాడితే ఆవిడ పర్సనల్‌గా వెళ్తారు. అది నాకు నచ్చదు" అంటు డీమాన్ కూడా సంజన పేరే చెప్పాడు. "ఆవిడకి ఎవరైతే ఫేవర్‌గా ఉంటారో వాళ్ల గురించే ఆలోచిస్తుంటారు. వాళ్ల సైడై మాట్లాడుతుంటారు. వాళ్ల గురించే ఇక్కడ వర్క్ చేస్తున్నట్లు చేస్తారు" అంటూ రాము రాథోడ్ కూడా సంజననే సెలక్ట్ చేశాడు. దీంతో ఆ ఐదుగురు కలిసి డిసైడ్​ అయ్యి లివింగ్​ ఏరియాకు రాగానే "అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమేంటో చెప్పండి" అని బిగ్‌బాస్ అనగానే.. 'సంజన గారు' అంటూ హరీష్ చెప్పాడు.

ఈ మాటకి అందరూ స్టన్ అయిపోయారు. "క్లియర్‌గా నన్ను కార్నర్ చేస్తున్నారు. ఏదైతే అది మీ ఫైనల్ డెసిషన్ బిగ్‌బాస్" అంటూ సంజన చెప్పింది. దీంతో "సంజన మీరు వెంటనే మెయిన్ గేట్ నుంచి బయటికి వెళ్లండి" అంటూ బిగ్‌బాస్ ఆర్డర్ వేశాడు. దీంతో సంజనా ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఇమ్మాన్యుయేల్​ వెక్కి వెక్కి ఏడ్చాడు. తాను అమ్మగా భావించే సంజనా వెళ్లిపోవడంతో ఫుల్​ ఎమోషనల్​ అయ్యాడు. ఎంత మంది ఓదార్చినా తాను ఒంటరివాడిని అని ఫీల్​ అయిపోయాడు. ఇమ్మాన్యుయేల్​తో పాటు ఫ్లోరా సైనీ, తనూజ కూడా బాధపడ్డారు. ఇక ఎలిమినేట్​ అయిన సంజనాను సీక్రెట్​ రూమ్​కు పంపించారు బిగ్​బాస్​. దీంతో నిన్నటి ఎపిసోడ్​ పూర్తి అయ్యింది.

Bigg Boss 9 Telugu Day 17: 'బ్లాక్​ సీడ్​'తో బిగ్​ ట్విస్ట్​ - ఫ్లోరా సైనీ గెలుపుతో ఎలిమినేటర్ ఆమేనా!

Bigg Boss 9 Ritu Chowdhary: "యాంకర్​ టూ బిగ్​బాస్​" - ఈ ముద్దుగుమ్మ వివరాలు తెలుసా?