Bigg Boss Hosts Remunerations: బిగ్‌బాస్ హోస్ట్‌లుగా స్టార్ హీరోలు - ఎవరి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
- పలు భాషల్లో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోన్న బిగ్‌బాస్ షో - హోస్ట్‌ల రెమ్యునరేషన్ సోషల్ మీడియాలో వైరల్!

Published : October 8, 2025 at 5:06 PM IST
Bigg Boss Hosts Remuneration Details: టెలివిజన్ బిగ్గెస్ రియాలిటీ షో బిగ్‌బాస్. ఈ షోకు ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. ఈ షో గురించి ఎంత తిట్టుకున్నా.. తీరా ఆ సమయానికి చూసి ఎంజాయ్ చేస్తుంటారు. అందుకే తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ ఇలా భాషలతో సంబంధం లేకుండా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. అయితే ప్రతీ భాషలో ఓ స్టార్ హీరో ఈ షోను హోస్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా హోస్ట్‌లకు సంబంధించిన రెమ్యునరేషన్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దాని ప్రకారం ఎవరు ఎంత తీసుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం.
బిగ్‌బాస్ షో గురించి ఎవరికి పెద్దగా పరిచయం అక్కర్లేదు. భాష వేరైనా ఆ షో కాన్సెప్ట్ ఒక్కటే. ఎందుకంటే ఇందులో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్లు కొన్ని వారాల పాటు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఒకే ఇంట్లో అది కూడా భిన్నాభిప్రాయాలు ఉన్న వ్యక్తులతో కలిసి ఉంటారు. ఇక టాస్కులు, నామినేషన్లు, కెప్టెన్లు, గొడవలు, బాండింగ్, అలకలు, బుజ్జగింపులు, లవ్‌ట్రాక్‌లు ఇలా అన్నీ రకాల ఎమోషన్స్ ఇక్కడ ఉంటాయి. ఇక టాస్క్‌లలో గెలిచి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న వారు విజేతగా నిలుస్తారు. అందుకే భాషతో సంబంధం లేకుండా బిగ్‌బాస్ షోను సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది.
రెమ్యునరేషన్ వివరాలు ఇవే:

సల్మాన్‌ఖాన్ రెమ్యునరేషన్ ఇదే: హిందీ బిగ్‌బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్. 2006లో ఫస్ట్ సీజన్ మొదలుకాగా .. ప్రస్తుతం 19వ సీజన్ నడుస్తోంది. కొన్ని సీజన్లు మినహాయిస్తే సుమారు 15 సంవత్సరాల నుంచి సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇన్ని సంవత్సరాలుగా హోస్ట్‌గా చేస్తోన్న సల్మాన్.. రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత సీజన్‌కు సుమారు రూ.120 నుంచి రూ.150 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. అంటే వీకెండ్లో రోజుకు రూ.8 నుంచి రూ.10 కోట్లు అందుకుంటున్నట్లు టాక్.

నాగార్జున: తెలుగులో బిగ్‌బాస్ షో 2017లో మొదలైంది. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక మూడో సీజన్ నుంచి కింగ్ నాగార్జున షోను నడిపిస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు అంటే సుమారు 7 సీజన్ల పాటు హోస్ట్‌గా చేస్తున్నారు. ఈ క్రమంలో సీజన్ 9కు కింగ్ నాగ్ చాలా ఎక్కువగానే పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. సీజన్ మొత్తం కలిపి రూ.50 కోట్ల వరకు అంటే వీకెండ్లో రోజుకు రూ.3 నుంచి రూ.4 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

విజయ్ సేతుపతి: ప్రస్తుతం తమిళ బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా విజయ్ సేతుపతి వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ సీజన్ నుంచి ఏడో సీజన్ వరకు లోకనాయకుడు కమల్ హాసన్ హోస్ట్‌గా బాధ్యతలు నిర్వర్తించగా.. ఎనిమిది, తొమ్మిది సీజన్లకు విజయ్ సేతుపతి ఉన్నారు. అయితే ఈయన కూడా సీజన్ మొత్తానికి రూ.40 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.

కిచ్చా సుదీప్: కన్నడలో బిగ్‌బాస్ 2013లో ప్రారంభమైంది. సీజన్ మొదటి నుంచి తాజా సీజన్ వరకు కిచ్చా సుదీప్ హోస్ట్‌గా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ సీజన్ మొత్తానికి రూ.8 నుంచి రూ.10 కోట్ల మధ్య పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.

మోహన్ లాల్: మలయాళంలో బిగ్‌బాస్ 7వ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్‌కు మోహన్‌లాల్ హోస్ట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. షో మొదలైనప్పటి నుంచి ఈయనే హోస్ట్‌గా ఉన్నారు. అయితే ప్రస్తుత సీజన్‌కు రూ.20కోట్ల పైనే పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Bigg Boss 9 Suman Shetty: "అధ్యక్షా.." మొదటి సినిమాకే "నంది" - సుమన్ శెట్టి బ్యాగ్రౌండ్ ఇదే!

