బిగ్‌బాస్ "అగ్నిపరీక్ష" - ఆగస్టు 22 నుంచి స్ట్రీమింగ్ - ఎక్కడ చూడాలో తెలుసా?
- అగ్నిపరీక్షకి 15 మంది ఎంపిక - ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 5 వరకు టెలికాస్ట్

Published : August 14, 2025 at 5:08 PM IST
Bigg Boss Agnipariksha: బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ త్వరలోనే ప్రారంభం కానుంది. తెలుగులో సక్సెస్ ఫుల్‌గా ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో వచ్చే నెలలో తొమ్మిదో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రతి సీజన్‌లోనూ కొత్తదనాన్ని చూపించే బిగ్ బాస్ టీం, ఈ సారీ ప్రేక్షకుల్ని డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు సరికొత్త కాన్సెప్ట్‌ని తీసుకువచ్చింది. అదే "అగ్నిపరీక్ష". తొమ్మిదో సీజన్లో కామన్మ్యాన్స్కు అవకాశం ఇస్తూ ఆడిషన్స్ కోరిన బిగ్‌బాస్ టీం అందులో కొందరికి సెలెక్ట్ చేసి అగ్నిపరీక్ష పెట్టబోతుంది. అసలు ఈ అగ్నిపరీక్ష ఏంటి? ఎప్పటినుంచి మొదలు? ఎక్కడ చూడాలి? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
నార్మల్‌గా బిగ్‌బాస్ అంటే సెలబ్రిటీలు, బుల్లితెర నటీనటులు ఇలా జనాలకు పరిచయం ఉన్న వాళ్లను సెలెక్ట్ చేసి వారందరినీ ఒక దగ్గర ఉంచి కథ నడిపిస్తారు. ప్రతి సీజన్‌కూ ఇలా జనాలకు తెలిసిన వారినే తీసుకొస్తున్నారు. అయితే గత రెండు మూడు సీజన్ల నుంచి పైన చెప్పిన వారితోపాటూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను ఎంపిక చేశారు. తాజాగా తొమ్మిదో సీజన్లోకి పైవారితోపాటు సాధారణ మనుషులకు కూడా అవకాశం కల్పించారు.
కామన్‌మ్యాన్ కోటా కింద సెలెక్షన్ ఇలా: ఇక బిగ్‌బాస్ టీం చేసిన ప్రకటనతో వేల మంది బిగ్‌బాస్‌లో పాల్గొనేందుకు అప్లికేషన్లు పంపించారు. ఇప్పటికే వచ్చిన అప్లికేషన్ల నుంచి ఫస్ట్ లెవల్(వీడియో సెలక్షన్స్ ), రెండో లెవల్(కాల్ సెలక్షన్స్), మూడో లెవల్(గ్రూప్ డిస్కషన్ ) పూర్తి అయిపోయాయట. అలా వచ్చిన అప్లికేషన్స్‌ను ఫిల్టర్ చేసి 100 మందిని ఎంపిక చేశారని, ఇందులో నుంచి అగ్నిపరీక్షకు 40 మందిని ఎంపిక చేసినట్టు సమాచారం. ఇప్పటికే అగ్నిపరీక్షకు సంబంధించిన షూటింగ్ మొదలైందని, 40 మందిలో 15 మందిని ఫైనల్ రౌండ్‌కు సెలెక్ట్ చేసినట్లు న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారిలో ఈ కింది వారు ఉన్నారట.
- కల్కి
- అనూష రత్నం
- శ్వేత శెట్టి
- దివ్య నికితా
- శ్రియ
- ప్రసన్న కుమార్
- డెమాన్ పవన్
- దాలియా
- దమ్ము శ్రీజ
- పవన్ కళ్యాణ్
- ప్రియా శెట్టి
- షాకీబ్
- మర్యాద మనిష్
- మాస్క్‌మ్యాన్ హృదయ్
- ప్రశాంత్
అగ్నిపరీక్షకు హోస్ట్‌గా బుల్లితెర రాములమ్మ: ఇక ఈ అగ్నిపరీక్షకు హోస్ట్‌గా బుల్లితెర రాములమ్మ శ్రీముఖి ఉన్నట్టు తెలుస్తోంది. ఇక జడ్జ్‌లుగా బిగ్‌బాస్ సీజన్ 4 విన్నర్ అభిజీత్, సీజన్ 1 కంటెస్టెంట్ నవదీప్, ఓటీటీ విన్నర్ బిందు మాధవిలను సెలెక్ట్ చేసినట్టు సమాచారం. తాజాగా దీనికి సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. ఇందులో జడ్జీల స్థానంలో ఈ ముగ్గురే కూర్చున్నారు.
ఈ ప్రోమోలో వచ్చే "ఇదే మీ స్పాట్‌లైట్. ఇదే మీ ఎంట్రీ టికెట్. కానీ ఇది అంత తేలిక కాదు", మాస్క్ అంటేనే ఫేక్. నా ముందు ఉండేది రెండే ఆప్షన్స్, బ్లాకా?, వైటా? ఈ అగ్నిపరీక్షలో అదే తేల్చేద్దాం", "నేను మైండ్ గేమ్ ఆడతానని మీకందరికీ తెలుసు. కానీ ఈసారి మైండ్ బ్లాక్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి" అంటూ కొన్ని డైలాగ్స్‌తో అగ్నిపరీక్షపై ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేశారు మేకర్స్.
15 మందిలో ఎవరు పక్కా: కామన్‌మ్యాన్ కోటా కింద నిర్వహించిన ఆడిషన్స్‌కు వేల మంది వచ్చినా, అందులో అన్ని రకాల పరీక్షల తర్వాత అగ్నిపరీక్ష ఫైనల్ రౌండ్‌కు 15 మందిని జడ్జ్‌లు సెలెక్ట్ చేసినట్టు సమాచారం. అయితే వీరిలో సీజన్ 9లో పాల్గొనేది కేవలం ఐదుగురు మాత్రమే అని తెలుస్తోంది. అంటే ఈ 15 మందిని ఐదుగురు చొప్పున డివైడ్ చేసి మూడు టీమ్‌లుగా చేస్తారట. ఆ టీమ్స్‌కు జడ్జ్‌లుగా అభిజిత్, నవదీప్, బింధు మాధవి ఉంటారని తెలుస్తోంది.
ఈ మూడు గ్రూపులకి టాస్కులు పెట్టి ఇందులో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన ముగ్గురిని అంటే ఒక్కో గ్రూప్‌ను ఒకరిని బిగ్‌బాస్ 9 కంటెస్టెంటుగా ఎంపిక చేస్తారని సమాచారం. ఇక మిగిలిన 12 మందికి ఓటింగ్ పెట్టి టాప్ 2లో నిలిచిన ఇద్దరికి అవకాశం దక్కనుందని, ఇలా మొత్తం ఐదుగురు కామన్ మ్యాన్ కోటాలో హౌస్‌లోకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.
ఇది ఎక్కడ చూడాలి: ఇక ఈ అగ్నిపరీక్షను కూడా టెలికాస్ట్ చేస్తోంది బిగ్‌బాస్ టీం. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు సుమారు 15 రోజుల పాటు అగ్నిపరీక్ష ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. ఇక దీనిని కేవలం జియో హాట్‌స్టార్‌లో మాత్రమే చూడొచ్చు. అంటే టీవీలో రాదు.
బిగ్‌బాస్ హౌజ్‌లో క్రికెటర్లు- ఇద్దరికి రన్నరప్ కూడా- ఎవరంటే?

