ETV Bharat / entertainment

Bigg Boss 9 Telugu Wild Cards List: బిగ్​బాస్​ ఫైర్​ స్టార్మ్​ 2.0 - హౌజ్​లోకి "వైల్డ్"​ కంటెస్టెంట్స్​!

- ఇంట్లోకి ప్రవేశించిన కొత్త ముఖాలు - సోషల్​ మీడియాలో భిన్నాభిప్రాయాలు!

Bigg Boss 9 Telugu Wild Cards List
Bigg Boss 9 Telugu Wild Cards List (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 13, 2025 at 10:42 AM IST

4 Min Read
Choose ETV Bharat

Bigg Boss 9 Telugu Wild Cards List: సీజన్​ 9లో బిగ్‌బాస్ 2.0 ఫైర్​ స్టార్మ్​ షురూ అయింది. వైల్డ్‌కార్డ్ ఎంట్రీలతో హౌజ్​మేట్స్ అల్లాడిపోతున్నారు. ఎందుకంటే ఈసారి హౌస్‌లోకి వచ్చిన వైల్డ్‌కార్డ్స్ అందరూ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. ముందునుంచీ చెబుతున్నట్లుగానే ఆరుగురు ప్రవేశించారు. అందులో ముగ్గురు లేడీస్​, ముగ్గురు జంట్స్​ ఉన్నారు. మరి, వారి ఎంట్రీ ఎలా ఉంది? సోషల్​ మీడియాలో ఆడియన్స్​ ఓపీనియన్​ ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.

రమ్య మోక్ష: వైల్డ్‌కార్డ్ ఎంట్రీలలో భాగంగా తొలి కంటెస్టెంట్​గా ఎంట్రీ ఇచ్చింది సోషల్ మీడియా సెస్సేషన్ రమ్య మోక్ష కంచర్ల (అలేఖ్య చిట్టి పికిల్స్). పక్కా లోకల్ సాంగ్‌కి అదిరిపోయే పెర్ఫామెన్స్‌తో ఎంట్రీ ఇచ్చింది రమ్య. ఆ తర్వాత రమ్య ఏవీ చూపించారు. అందులో తన ఊరు, తన ఫ్యామిలీ, సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం, పికిల్స్ వల్ల వచ్చిన వివాదం ఇలా అన్నింటి గురించీ వివరించింది. ఇక రమ్య లోపలికి వెళ్లే ముందు నాగార్జున ఒక పవర్ ఇచ్చారు. అదే "లగ్జరీ ఫుడ్ పవర్". "హౌజ్​లో ఎప్పుడు కావాలన్నా ఎవరి కోసమైనా వాడొచ్చు" అని నాగ్ చెప్పారు. అయితే ఈ పాప ఎంట్రీపై సోషల్​ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే స్టేజ్​ మీద అమ్మడు చూపించిన ఆటిట్యూడ్​ తగ్గించుకోవాలని, ఇలానే ఉంటే హౌజ్​లో కొనసాగడం కష్టమని అంటున్నారు.

శ్రీనివాస్​ సాయి: బిగ్‌బాస్ హౌస్‌లోకి రెండవ వైల్డ్ కార్డ్‌ ఎంట్రీగా యువ నటుడు శ్రీనివాస్ సాయి అడుగుపెట్టాడు. చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేసిన సాయి.. ప్రస్తుతం హీరోగా కూడా మూవీస్ చేస్తున్నాడు. ఇక హౌజ్​‌లోకి వెళ్లే ముందు సాయికి "డార్క్ బ్లూ స్టోన్" ఇచ్చారు నాగార్జున. దీంతో "ఈ స్టోన్​ వల్ల ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. ఇది ఉపయోగించి ఎలిమినేషన్‌లో ఎవరినైనా సేవ్ చేయొచ్చు" అంటూ నాగ్ చెప్పారు. అయితే ఈ కుర్రాడి ఎంట్రీపై కూడా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. స్టేజ్​ మీద ఉన్నట్టు మెత్తగా ఉంటే హౌజ్​లో కుదరదని, పరిస్థితులకు తగ్గట్టు ఉండాలని, లేదంటే తొందరగానే బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నారు.

దివ్వెల మాధురి: బిగ్‌బాస్ సీజన్ 9లోకి మూడో వైల్డ్​ కార్డ్​గా దివ్వెల మాధురి ఎంట్రీ ఇచ్చారు. "సమాజంలో ఎంతో నెగెటివిటీ చూశాను. ఆడపిల్ల అని కూడా చూడకుండా సోషల్ మీడియాలో ఎంతో ట్రోల్ చేశారు. బిగ్‌బాస్ హౌజ్​లో ఎవరూ యాక్ట్ చేయలేరు. కొన్నాళ్ల పాటు యాక్ట్ చేసినా కచ్చితంగా దొరికిపోతారు. అందుకే నేను ఏంటో అందరికీ తెలియడానికి. నాపైన నెగెటివిటీ ఉన్న వాళ్లకి కూడా నేనేంటో చూపించడానికే వచ్చాను" అని మాధురి చెప్పారు. అలాగే "నేను ఫైర్ బ్రాండ్. ఎవరైనా సరే డోంట్ కేర్. శ్రీనివాస్ కోసం ఏదైనా వదిలేస్తా" అని అన్నారు. ఇక హౌజ్​లోకి వెళ్లేముందు "గోల్డెన్ బజర్ పవర్" మాధురికి ఇచ్చారు. ఇది ఉపయోగించి ఒక ఎలిమినేషన్‌ని రద్దు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈమె మాట్లాడిన మాటల్లో ఓవర్​ కాన్ఫిడెన్స్ ఉందని, తనకు తాను గొప్ప అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.

నిఖిల్​ నాయర్​: వైల్డ్‌కార్డ్ లిస్ట్‌లో నాలుగవ కంటెస్టెంట్‌గా సీరియల్​ నటుడు నిఖిల్ నాయర్ ఎంట్రీ ఇచ్చారు. ముందుగా స్టేజ్ మీదకి వచ్చిన నిఖిల్ నాయర్‌కి మోహన్ లాల్ వీడియోతో సర్‌ప్రైజ్ ఇచ్చారు నాగార్జున. నిఖిల్‌కి పింక్ స్టోన్ ఇచ్చి హౌజ్​లోకి పంపించారు. దీని వల్ల కంటెండర్ పవర్ నిఖిల్‌కి దక్కింది. "ఇది ఉపయోగించి నువ్వు డైరెక్ట్‌గా కెప్టెన్సీ కంటెండర్ అవ్వొచ్చు" అని నాగ్​ చెప్పారు. అయితే మనోడి కటౌట్​ ఫిజికల్​ టాస్క్​లకు పర్ఫెక్ట్​గా సూట్​ అవుతుందని, కేవలం టాస్క్​లు మాత్రమే కాకుండా మాటకు మాట ఎదురు చెప్పగలిగేలా ఉంటేనే ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం ఉందంటున్నారు.

ఆయేషా: బిగ్‌బాస్ హౌజ్​లోకి సీరియల్ హీరోయిన్, మోడల్ అయేషా జీనత్ ఐదో వైల్‌కార్డ్​గాఎంట్రీ ఇచ్చింది. ఇక లవ్​ స్టోరీలు, బ్రేకప్​ గురించి ఆయేషా చెప్పింది. ప్రతి వైల్డ్‌కార్డ్ ఎంట్రీకి ఇచ్చినట్లే అయేషాకి కూడా ఒక పవర్ ఇచ్చారు. దాని పేరు నామినేషన్ పవర్. అందుకోసం ఆమెకి గ్రీన్ స్టోన్ ఇచ్చారు. "ఈ పవర్ సాయంతో నామినేషన్ జరిగే ప్రక్రియని మార్చొచ్చు. అది ఎలా అనేది బిగ్‌బాస్ చెప్తారు" అంటూ నాగార్జున చెప్పారు. అయితే ఈ బ్యూటీ కాస్త అతి ఉత్సాహం చూపిస్తోందని, ఆల్రెడీ బిగ్​బాస్​ ఎక్స్​పీరియన్స్​ ఉండటంతో దాని ఉపయోగించాలని, అప్పుడే కప్పు గెలిచే అవకాశం ఉంటుందని అంటున్నారు.

గౌరవ్​ గుప్తా: చివరి వైల్డ్​ కంటెస్టెంట్‌గా హౌజ్​లోకి వెళ్లాడు గౌరవ్ గుప్తా. ఇతనికి తెలుగు కాస్త తక్కువగా వచ్చు. దీంతో మాట్లాడటానికి ఇబ్బంది పడ్డాడు. గౌరవ్‌కి బ్లెస్సింగ్ పవర్ ఇచ్చారు నాగ్. అంటే హౌజ్​లో ఏదైనా సమస్య వస్తే డైరెక్ట్‌గా బిగ్‌బాస్‌ నుంచి సలహా అడిగి బయటపడే పవర్ అన్నమాట. ఇక ఇతనికి తెలుగు నేర్పించే బాధ్యతను దివ్య నిఖితకు ఇచ్చారు నాగార్జున. అయితే ఇతని బాడీ లాంగ్వేజ్​ చూస్తే భయపడుతున్నట్లు కనిపిస్తోందని ఆడియన్స్​ ఫీల్​ అవుతున్నారు. మాటల్లో తడబాటు ఉందని, తెలుగు తొందరగా నేర్చుకుంటేనే హౌజ్​లో సర్వైర్​ అవ్వొచ్చని, లేదంటే ఇబ్బందులు తప్పవంటున్నారు.

ఇలా మొత్తానికి ఆరుగురు కంటెస్టెంట్స్​ వైల్డ్​కార్డ్స్​ రూపంలో హౌజ్​లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ ఆరుగురిలో రమ్య, దివ్వెల మాధురి, నిఖిల్​ నాయర్​లు పర్ఫెక్ట్​గా ఆడితే చివరి వరకు ఉంటారని అంటున్నారు.

Bigg Boss 9 Weekend Episode : ఇమ్మూకు 'పవర్ అస్త్ర' - తనూజ కళ్లు తెరిపించిన నాగ్ - డబుల్ ఎలిమినేషన్​లో వీరు ఔట్!

Bigg Boss 9 Captaincy Task : కోపంతో ఊగిపోయిన సుమన్​ శెట్టి - బిగ్​బాస్​ ఐదో కెప్టెన్​ "అతడే"!